యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్యేలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, గెలుపొందిన సందర్భంగా మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి శుభకాంక్షలు మరియు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



దళిత హక్కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్
వలిగొండ మండల కేంద్రంలో దళిత కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్  మాట్లాడుతూ* డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈనెల 18,19,20 తేదీలలో యాదగిరిగుట్ట, మండలంలో  లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరగనున్నట్లు తెలిపారు... గ్రామాలలో ఇంకా అంటరానితనం అవమాననీయ దురాచారాలు అత్యంత దారుణంగా జరుగుతున్నాయి రోజురోజుకు దళితులపైన కుల వివక్ష చూపిస్తున్నారు.ఇలాంటి అణచివేతలను ఎదిరించే విధంగా దళితులను సామాజిక సంఘటితంగా రాజకీయ చైతన్యపరచటకు ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మండల కో కన్వీనర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, చొప్పరి వెంకటేష్,సుద్దాల సాయికుమార్, భూశి శివ, నరేష్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

రెడ్ల రేపాక గ్రామంలో తాటి చెట్టు నుండి కింద పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామంలో జువ్వ గాని కిష్టయ్య తండ్రి రాములు వయస్సు 50, బుధవారం  ఉదయం తాటి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భువనగిరి కి తరలించడం జరిగింది వారికి ప్రభుత్వపరంగా రావలసిన ఎక్స్గ్రేషియా మంజూరు చేయవలసిందిగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలగాని జయరాములు, రాష్ట్ర నాయకులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి పలుసం స్వామి, రెడ్ల రేపాక గ్రామ అధ్యక్షుడు జువ్వగాని స్వామి ,ఎక్సైజ్ అధికారులను కోరారు.

రిటర్నింగ్ అధికారి ,జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే నుండి ధ్రువీకరణ పత్రాన్ని పొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయినది. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,249 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి కి  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల  ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కూరెళ్ళ లో ఉప్పుల సాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరేళ్ళ గ్రామంలో ఉప్పల సాలయ్య 95 సంవత్సరాలు మృతి చెందిన సందర్భంలో ఈరోజు *సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ* *మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు* వారి కుటుంబ పరామర్శించారు సాలయ్య కుమారులు ఉప్పల ముత్యాలు వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని అందించారు సాలయ్య తెలంగాణ భూ పోరాటంలో సాలయ్య గారు సహకారం అందించే వారిని గుర్తు చేశారు. వారి కుమారుడు ఉప్పల ముత్యాలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేయుచున్నారు కుమారులు కుటుంబ సభ్యులు అంకితభావంతో పార్టీలో కొనసాగుతున్నారు అని అన్నారు ఈ సందర్భంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు యానాల దామోదర్ రెడ్డి, బోలగొని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెడచంద్రయ్య, ఏషాల అశోక్,కల్లెం కృష్ణ,పాసి కంటి లక్ష్మీ నరసయ్య,సిపిఐ మండల కార్యదర్శిలు జల్ది రాములు, అన్నపు వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, మారుపాక వెంకటేష్, బబ్బూరి శ్రీధర్,సలిగంజి వీరాస్వామి,ఎల్లంకి మహేష్, పుట్ట రమేష్ ,ఉప్పుల శాంతి కుమార్, గుర్రం రాజమణి,సూరారం జానీ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మరి పెళ్లి రాములు, భాష బోయిన సర్వేయ్య సోమనబోయిన నరసయ్య లు పాల్గొన్నారు.


భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం : కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ కౌంటింగ్ కేంద్ర వద్ద భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ...భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అన్నారు.భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన భువనగిరి ప్రజలకు నా కృతజ్ఞతలు తెలిపారు.భువనగిరి అడ్డ మీద కాంగ్రెస్ గెలుపు... తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియాగాంధీ కీ ,రాహుల్ గాంధీ కీ ఈ గెలుపు అంకితం.. ఈ భూమి ,ఆకాశం ఉన్నత కాలం తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మరువరు .ఈ తెలంగాణ ప్రజలు.. బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉన్న,, భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టి సోనియాగాంధీ రుణం తీర్చుకున్నారు.. భువనగిరి ఎంపీ గెలుపు కు కృషి చేసిన నాయకులకు అందరికీ నా తరపున కృతజ్ఞతలు.. నా మీద నమ్మకం తో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బాధ్యత అప్పగించిన అధిష్టానం నమ్మకం భువనగిరి ప్రజలు నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి పార్లమెంట్ ఆరవ రౌండు, కాంగ్రెస్ కు 32వేల ఆధిక్యం


యాదాద్రి.. భువనగిరి పార్లమెంట్ 6 రౌండ్లు పూర్తయ్యేవరకు కాంగ్రెస్ అభ్యర్ధి 32వేల కు పైగా ఆధిక్యం..
ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి

*మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి* ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
నల్గొండ లో కాంగ్రెస్ లీడ్ 26188


మెదక్ అసెంబ్లీ పరిధిలో మొదటి రౌండ్ కాంగ్రెస్ లీడ్ లీడ్


మెదక్ అసెంబ్లీ పరిధిలో మొదటి రౌండ్. కాంగ్రెస్ 3888 బీజేపీ 1537 బి అర్ ఎస్ 2213. కాంగ్రెస్ ఆధిక్యం నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ 2740 బీజేపీ 3515 బి అర్ ఎస్ 2425. బీజేపీ ఆధిక్యం