మెదక్ అసెంబ్లీ పరిధిలో మొదటి రౌండ్ కాంగ్రెస్ లీడ్ లీడ్


మెదక్ అసెంబ్లీ పరిధిలో మొదటి రౌండ్. కాంగ్రెస్ 3888 బీజేపీ 1537 బి అర్ ఎస్ 2213. కాంగ్రెస్ ఆధిక్యం నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ 2740 బీజేపీ 3515 బి అర్ ఎస్ 2425. బీజేపీ ఆధిక్యం
భువనగిరి రెండవ రౌండ్లు లో కాంగ్రెస్ 4500 ఓట్ల ఆదిత్యం
యాదాద్రి జిల్లా భువనగిరి రెండవ రౌండ్ ముగిసేసరికి 4500 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీలో స్పష్టమైన ఆధిక్యత దిశలో కూటమి
*_ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024_* *_స్పష్టమైన ఆధిఖ్యత దిశలో కూటమి_* _మొత్తం సీట్లు: 175 లక్ష్యం: 88_ *_టీడీపీ కూటమి 48_* టీడీపీ 37 జనసేన 8 బీజేపీ 3 వైఎస్ఆర్‌సీపీ 2 కాంగ్రెస్ 1 ఇతరులు 0
నల్గొండలో మొదటి రౌండ్లో కాంగ్రెస్ లీడ్
నల్లగొండలో మొదటి రౌండ్లో కాంగ్రెస్2777 మెజారిటీ... కాంగ్రెస్ ...6001 బిజెపి ....3224 టిఆర్ఎస్....1264
పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల ముందంజ
ప.గో.జిల్లా.. *కూటమి అభ్యర్థులు ముందంజ* ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు 2559 ఓట్ల తో ముందంజ నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ముందంజ తణుకు టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ ముందంజ పాలకొల్లు టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందంజ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముందంజ భీమవరంలో పులపర్తి రామాంజనేయులు తొలి రౌండ్లు 3 వేల ఓట్ల తో ముందంజ
భువనగిరిలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా KCR గారి నాయకత్వములో యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను మరియు బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం భువనగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంచడం జరిగింది.*భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత రెడ్డి, ZP చైర్మన్ సందీప్ రెడ్డి, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యమా మల్లేశం, ఆలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గార్లు మాట్లాడుతూ..

*ఆనాటి తెలంగాణ ఉద్యమ రథసారది మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో 2001 నుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది.*తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు 2014 నుండి 2023 (10 సంవత్సరాలు) ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి బంగారు తెలంగాణ దిశగా పనిచేయడం జరిగింది.*
పులిగిల్ల లో బుగ్గ బీరప్ప కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సాక్షర భారత్ కోఆర్డినేటర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఇటీవల ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సాక్షర భారత్ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు బుగ్గ బీరప్ప కుటుంబానికి దశదిన కార్యక్రమంలో భాగంగా సోమవారం వలిగొండ మండల  కోఆర్డినేటర్ మరియు వివిధ గ్రామల కో ఆర్డినేటర్లు రూ.33000/వేలు  ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కొమిరే బాలేశ్వర్ మరియు గ్రామ కోఆర్డినేటర్లు మస్కు నరసింహ, నీలం నరేందర్, బందెల రాజు, పోలెపాక బాలనరసింహ, మల్లం ధనమ్మ, కొత్తపెల్లి చైతన్య, రొయ్యల రజిత, పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నూతన చిహ్నంపై ధర్మసమాజ్ పార్టీ సూచనలు చేస్తూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత

రాష్ట్ర ప్రభుత్వ ‘నూతన చిహ్నం పై పలు సూచనలు చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ యదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వినర్ నల్ల నరేందర్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించామని, దీన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తున్నంధున ధర్మ సమాజ్ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. మేము ప్రతిపాదిస్తున్న చిహ్నంలోని గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీని మరియు దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ ని ఈ చిహ్నంలో ఉంచామని తెలిపారు. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గం పై అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సమ్మక్క సారలక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నం లో ఉంచామని తెలిపారు. ఈ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో సమానత్వ భావనని, పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తిగా, భావి తరాల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి అవుతుంది. తెలంగాణ వైభవోపేతమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అవుతుందని తెలిపారు. కాబట్టి ఈ చిహ్నాన్ని తమ ముందు (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు) ధర్మ సమాజ్ పార్టీ నుండి ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. తప్పకుండా దీనిని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని తెలియ జేయండని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాలయ్య, లింగస్వామి, మహేష్, రాకేష్, శాంతి కుమార్, శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్ళు పోయే రాచకాల్వ పనులను పూర్తి చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్

వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్లు పోయే రాచ కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని రాచ కాల్వ పనులను సిపిఎం నాయకత్వం, రైతులతో కలిసి పరిశీలన చెయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ కాల్వ పనులు వర్షాకాలం నెత్తిమీదికి కొచ్చిన ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. కాల్వ పక్కన ఉన్న రైతులు కాలువ తీస్తుంటే తమ పంట పొలాలు ధ్వంసం అయ్యాయని వాటికి నేటికీ ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వ పనులు పూర్తి కావడానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు కాలువలు దాటి తమ పంట పొలాలకు పొలాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యామ్నాయ బాటలు కూడా లేవని ఇప్పటికైనా కాల్వపైన 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని, కాల్వ మధ్యలో ఉన్న మట్టి కుప్పలను తక్షణం తొలగించాలని జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈవారం లోపు పనులు చేపట్టకపోతే రైతులను సమీకరించి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, నాయకులు బండి శ్రీను, రైతులు పన్నాల సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, సత్తిరెడ్డి, హరినాధ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మద్దుల ప్రభాకర్ రెడ్డి, సోమ అంజయ్య, చందుపట్ల ఎల్లయ్య, మల్లేష్, కసర బోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గోపరాజుపల్లి లో జై భీమ్ సేన నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో "జై భీమ్ సేన" నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సంగిశెట్టి సుందర్ రావు, అధ్యక్షులుగా వల్లమల్ల రత్నయ్య, ఉపాధ్యక్షులుగా కట్ట సురేష్, వల్లమల్ల రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సంగిశెట్టి విజయకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నీలం నరేందర్, సహాయ కార్యదర్శులుగా సంగిశెట్టి రమేష్, ఎర్ర మత్స్యగిరి, కోశాధికారిగా వల్లమల్ల మత్స్యగిరి, సాంస్కృతిక కార్యదర్శి గా నీలం నరేష్, గేమ్స్ సెక్రెటరీ గా నీలం కుబులు, మీడియా ప్రతినిధి గా సంగిశెట్టి ఉపేందర్, కమిటీ కార్యవర్గ సభ్యులుగా సంగిశెట్టి ప్రభాకర్, సంగిశెట్టి మనోహర్,ఎర్ర శ్రీను, వల్లమల్ల సైదులు, వల్లమల్ల రమేష్, కమిటీ గౌరవ సలహాదారులుగా రావుల ఎల్లయ్య, సంగిశెట్టి దేవదాస్ (Rtd టీచర్), వల్లమల్ల రఘుపతి, సంగిశెట్టి రాములు వల్లమల్ల స్వామి, సంగిశెట్టి నర్సింగరావు లెక్చరర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.