హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

కేసీఆర్ పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా భువనగిరి మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి కొవ్వు త్తులతో అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డడానికి ఎందరో మహనీయులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చారని ముఖ్యంగా,విద్యార్థులు బలిదానాల వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై కెసిఆర్ ఎంతో కృషి చేసారని అన్నారు. కేసీఆర్ తెచ్చి పెట్టిన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ,రాజ్యాధికారం పొంది ప్రజలకు అమరులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని వాపోయారు ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు,నాగారం కిరణ్ కుమార్,నాయకులు తాడేం రాజశేఖర్,యువజన నాయకులు నాగారం సూరజ్ సైదులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరులకు ఘన నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కేసిఆర్ గారి పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా.. అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయినా ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, భువనగిరి పట్టణ అధ్యక్షులు AV కిరణ్, భువనగిరి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, అబ్బ గాని వెంకట్ గౌడ్, ఇత్తబోయిన గోపాల్, ఖాజ ఉద్దీన్, అతికం లక్ష్మీనారాయణ, ఇక్బాల్ చౌదరి, కుశంగల రాజు, పాండు, సుధగాని రాజు, తాడెం రాజశేఖర్, కాజాం, ముజీబ్, నాగు, బబ్లూ, సురేష్, సుభాష్, యువ నయకులు నాగారం సూరజ్, అజయ్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈనెల 4న జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్

ఈనెల 4న జరిగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక చేశారు.ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు.

ఇంద్రపాలనగరం లో ఘనంగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం ల జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో నకిరేకల్ అభివృద్ధి ప్రదాత నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్నపేట ఎంపీపీ పూస బాలమణి బాల నర్సయ్య పాల్గొని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గం లో కరోనా సమయంలో ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు వేముల వీరేశం అని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుని ఉన్నత పదవులకు ఎదగాలని భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటేపల్లి సిద్ధమ్మ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


చిత్తాపురం లో కుంభం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామంలో ఏటేల్లి అండమ్మ స్వర్గస్తులయ్యారు. వీరి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత నిధులు కుంభం పౌండేషన్ ద్వారా 5000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పీసరి వెంకటరెడ్డి, కార్యదర్శి చిన్నం స్వామి, ఉపాధ్యక్షులు వలమాల బిక్షపతి మరియు నాయకులు ఆరూర్ వెంకటయ్య ,కొంతం లక్ష్మయ్య, ఆరూరి శ్రీనివాస్, ఏటెల్లి చంద్రయ్య, రాములు, చేకూరి కృష్ణ ,మంద మచ్చ గిరి, యాదయ్య, మల్లేష్ ,అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జూన్ 10న ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి; కొండమడుగు నరసింహ తెలంగాణ వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా; జూన్ 10 న ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు మండలాల్లో జాతీయ ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహా.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో ఉపాధి హామీ కార్మికులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ లో విత్తన, ఎరువుల డీలర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:నకిలీ విత్తనాలు అమ్మిన కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం నాడు చౌటుప్పల్ లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాప్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్వాయిస్ బిల్లులు, పత్తి, వరి విత్తనం ప్యాకెట్లను పరిశీలించి దాని లోని లాట్ నంబర్స్, ఇన్వాయిస్ లు ఎక్కడినుండి తెచ్చారు, డీలర్ షిప్ వివరములు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలు అన్ని క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకి విక్రయించాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాలు కొన్న తర్వాత రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీలర్లు అనుమతి లేని విత్తనములు, నకిలీ విత్తనములు, ప్యాకింగ్ చేయకుండా లూస్ గా ఉన్న విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచకూడదని తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొన్న దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, సీజన్ అయిపోయే వరకు బిల్లులను, విత్తన ప్యాకెట్లని భద్రపరచుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన బ్యాగు మీద విత్తన తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, బీటీ టు పత్తి విత్తనాలు అన్ని రకాలు ఒకే రకమైన దిగుబడిస్తాయి కాబట్టి రైతులు దయచేసి ఒకే రకం పత్తి విత్తనాలు డిమాండ్ చేయకుండా నచ్చిన విత్తనాలను తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు ఎటువంటి ప్యాకింగ్ లేకుండా ఉండే విత్తనాలను, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వారి దగ్గర కొనకూడదని, ప్రభుత్వ అధికారులకు అటువంటి నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వాలని, రైతులు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7288878404 ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లాలోని 240 విత్తన డీలర్లను, గోదాములను విస్తృతంగా తనిఖీ చేయుటకు నాలుగు సీడ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి, తాసిల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మండల స్థాయి తనిఖీల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు రాకుండా, అలాగే డీలర్లు గారిని డిస్ట్రిబ్యూటర్లు కానీ పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా, విత్తనాల కొరత చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రపాలనగరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్

నకిరేకల్ నియోజకవర్గ ప్రజాపతినిదులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి తెలియజేయునది  ఏమనగా  రేపు అనగా తేది 01/06/2024(శనివారం) నాడు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం  జన్మదినం పురస్కరించుకుని ఉదయం 11.00 గంటల నుండి వేడుకలను నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం కనకదుర్గ ఆలయ ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహించబడును.కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఎమ్మెల్యే వీరేశం జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్ర పాల నగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందరు క్రిస్టఫర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ముందస్తుగా ఎమ్మెల్యే వేముల  వీరేశం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వలిగొండ లో వాహనాల తనిఖీలు, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్: ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని పలు వాహనాలను సీజ్ చేశామని అన్నారు. పలు వాహనాలకి సంబంధిత ధ్రువపత్రాలు లేని కారణంగా సీజ్ చేశామని తెలిపారు. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్స్ ఉండాలని సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఖైసర్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు మజహార్,అతహార్,లయిక్ అహ్మద్ గారి తండ్రి కైసర్ పటేల్ గారు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .కైసర్ పటేల్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు.