తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు, రచయితలు, మహిళా సంఘాలు,ఇలా ఎన్నో సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాలు వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన జర్నలిస్ట్ లని విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని,మరోసారి గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మండల కార్యదర్శి శివ, బలరాం రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య తదితరులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
![]()

యాదాద్రి భువనగిరి జిల్లా లో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని గురువారం కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను కోరారు. జూన్ 3 నుంచి 19 వరకు జరిగే బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు .బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.
నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అద్యక్షులు చీమ.శ్రీనివాస్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యంవంతం చేసి,అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలు చేసి నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయాలని అన్నారు.ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో బాబు. లింగం తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ విద్య విద్యార్థులకు ఇంటర్మీడియట్ మార్కుల శాతం ఉన్నత చదువులో చాలా కీలకం అని అలాంటి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ లో తప్పులు దొరలడం విద్యార్థుల విద్య భవిష్యత్తుకి నష్టం చేకూర్స్తుందని, సప్లమెంటు పరీక్షల తేదీని పొడిగించి రీకౌంటింగ్, రివాల్యుయేషన్ ఏదైనా మాత్రం పొడిగించలేదని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులు రీకౌంటింగ్, రివాల్యుయేషన్ ఫీజులు కట్టే పరిస్థితి లేదని వారు చాలావరకు కట్టలేకుండా పోయారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని వారు ప్రశ్నించారు. వేలాది సంఖ్యలో విద్యార్థులు ప్రశ్నాపత్రల తప్పుడు వాల్యుయేషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఇంటర్ బోర్డు ఇప్పటివరకు విద్యార్థులకు ఒక స్పష్టమైన భరోసా ఇవ్వలేదని తప్పుడు వాల్యుయేషన్ వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ వెంటనే ఇంటర్ బోర్డు న్యాయం చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడిస్తామని అభిలాష్ ,శాంతి కుమార్ హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు బొడిగె ఆనంద్ గౌడ్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఈసందర్బంగా బొడిగె ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ నన్ను జిల్లా కార్యవర్గ సభ్యులు గా నియమించిన జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నా వంతు గా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.నాకు సహకరించిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్ గారికి జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి గారికి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారికి ,దంతూరి సత్తయ్య , మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ గారికి తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.
తెలంగాణ నిరుద్యోగ ఉద్యమ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు కూచిమల్ల కుమార్ విలేకరుల సమావేశంలో ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భుజాన గొంగడేసి కాళ్లకు గజ్జ కట్టి ధూంధాం కార్యక్రమాలు ఎన్నో చేశామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు మా గళంతోనే ధూంధాం కార్యక్రమాలు మొదలు అయ్యేవని, మా కళాకారుల ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి పోశామని అన్నారు. తెలంగాణ ఉద్యమ మలిదశ సమయంలో కూలీ పనులు చేసుకుని జీవనం గడిపే మేము పనులు మాని ఉద్యమంలో పాల్గొంటే మా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కళాకారులను పక్కనపెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మేము ఉద్యమకారులమని గొప్పలు చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకునే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు? ఎక్కడ? పాల్గొన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి కళాకారుల ఉద్యోగ ప్రకటన చేసి నిజమైన కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
May 31 2024, 19:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.5k