నేడు కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం

ఇవాళ జ‌ల‌సౌదాలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చ‌ర్చించ‌నున్నారు.

ఈ మేర‌కు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కేఆర్ఎంబీ లేఖ రాసింది.బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్‌ ఫండ్‌ నిధుల విడుదలపై చర్చించనున్నారు.

రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను ఏపీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వ డానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. ముందు కృష్ణానదిలో వాటా తెల్చాలని టీ సర్కార్‌ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయిం పులు చేసింది. తాత్కాలి కంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది.

నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది...

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం కెసిఆర్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు.

ఇవాళ సభాపతి ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

కేసీఆర్‌ తుంటి ఎముకకు ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు హాజర య్యారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ కు 39 సీట్లు, బిజెపి 8, ఎంఐఎం 7 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి పాలకపక్షంలో ఉన్నారు. సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలుచుకుంది...

AP Politics: పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు

విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..

అయితే టీడీపీ - జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారికి బుద్దావెంకన్న వేడుకున్నారు..

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''టీడీపీ కోసం నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నా. నా సేవలను గుర్తించి చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే లేదా, అనకాపల్లి ఎంపీ సీటు కోరుతున్నాను. దుర్గమ్మను వేడుకుంటూ నా దరఖాస్తును ఆమె పాదాల చెంత ఉంచా. నాకు ఈ అమ్మవారు ఇలవేల్పు అయితే. నాకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాకు దేవుడు. వీళ్లనే నేను నమ్ముకుని ముందుకు సాగుతున్నా. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా... నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) కూడా నా విజ్ఞప్తి. వైసీపీ రౌడీలను అనేక సందర్భాల్లో ధైర్యంగా ఎదుర్కొన్నా. చంద్రబాబు ఇంటి మీదకు వస్తే దమ్ముగా నిలబడ్డా.

నాడు బూతుల మంత్రిగా ఉన్న కొడాలి నాని (Former Minister Kodali Nani) నోరు గుడివాడ వెళ్లి మూపించా. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే... పోరాటం చేశా. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలా మంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారు. మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు ఈ రెండు స్థానాల నుంచి ఎక్కడో ఒకచోట ఇవ్వాలి. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారి తాట తీస్తా. నా సేవలను, ప్రాణాలకు తెగించి పని చేస్తున్న నా పని గుర్తిస్తూ సీటు ఇవ్వమంటున్నా'' అంటూ బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు..

Union Budget: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

_ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు.

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారన్నారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు._

_ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మల చెప్పారు. నూతన సంర్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు._

_ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మల తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామని చెప్పారు. రూ. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా రూ. 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు._

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు - కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు..

ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

కుక్కలకు విశ్వాసం అయినా ఉంటుంది, కానీ నానికి అది కూడా లేదని చురకలు అంటించారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరాడని.. వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడు గా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

Budget 2024 : ఓట్ ఆన్ అకౌంట్ కు అంతా సిద్ధం..

ఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం, ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ఇప్పటివరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృదంతో కలిసి నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు..

మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..

ఈ క్రమంలో తాము తయారు చేసిన మధ్యంతర బడ్జెట్ తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం ఫొటో దిగారు. ఈ మధ్యంతర బడ్జెట్ పేపర్ లెస్ గా ఉండబోతోంది. గత కొంతకాలంగా టాబ్ లో బడ్జెట్ ను పేపర్ లెస్ గా సమర్పిస్తున్నారు..

బడ్జెట్ సమర్ఫణకు నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర, దానికి మ్యాచింగ్ గా హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకున్నారు. చేతిలో ఎరుపురంగు పౌచ్ లో ఉన్న టాబ్ ను పట్టుకున్నారు..

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.

ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం కోసం ఈరోజు అయోధ్య‌కు చేరుకున్నారు..

భగవాన్ శ్రీ రాముడు పూర్వీకుడు అని.. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని’ బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.

రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయల్దేరింది.ముస్లిల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది.

చలిలో 150 కిలోమీటర్లు కాలి నడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం.

ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించు కొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమ గ్రతను కాపాడుతుంది’ అని ముస్లిం రాష్ట్రీయ మంచ్ మీడియా ఇంచార్జీ షాహిద్ సయీద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు చేపట్టారు.

మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేస్తున్నట్టు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఇక, ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మరమ్మత్తులు కొనసాగనుండగా.. అనంతరం యథావిథిగా రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు.. ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మత్తు పనుల నిమిత్తం 10 రోజుల పాటు మూతపడనుండగా.. ఇరిగేషన్ అధికారుల కోరిక మేరకు పోలీస్ అధికారుల ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు.. కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా ప్రయాణాలు సాగించేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత.

నేడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి: నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనుంది.

ఇది పూర్తిస్థాయి పద్దు మాత్రం కాదు. లోక్ సభ ఎన్నికల ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది.

  

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది.

ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా..?

నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు గుర్తించారు.

ఆమె ఫోన్, సోషల్ మీడియా, వ్యక్తిగత చాటు పరిశీలించారు. మొబైల్ లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ను గుర్తించారు.

దీంతో లావణ్యను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఈరోజు కోరారు....