Union Budget: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

_ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు.

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారన్నారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు._

_ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మల చెప్పారు. నూతన సంర్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు._

_ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మల తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామని చెప్పారు. రూ. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా రూ. 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు._

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు - కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు..

ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

కుక్కలకు విశ్వాసం అయినా ఉంటుంది, కానీ నానికి అది కూడా లేదని చురకలు అంటించారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరాడని.. వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడు గా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

Budget 2024 : ఓట్ ఆన్ అకౌంట్ కు అంతా సిద్ధం..

ఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం, ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ఇప్పటివరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృదంతో కలిసి నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు..

మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..

ఈ క్రమంలో తాము తయారు చేసిన మధ్యంతర బడ్జెట్ తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం ఫొటో దిగారు. ఈ మధ్యంతర బడ్జెట్ పేపర్ లెస్ గా ఉండబోతోంది. గత కొంతకాలంగా టాబ్ లో బడ్జెట్ ను పేపర్ లెస్ గా సమర్పిస్తున్నారు..

బడ్జెట్ సమర్ఫణకు నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర, దానికి మ్యాచింగ్ గా హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకున్నారు. చేతిలో ఎరుపురంగు పౌచ్ లో ఉన్న టాబ్ ను పట్టుకున్నారు..

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.

ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం కోసం ఈరోజు అయోధ్య‌కు చేరుకున్నారు..

భగవాన్ శ్రీ రాముడు పూర్వీకుడు అని.. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని’ బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.

రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయల్దేరింది.ముస్లిల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది.

చలిలో 150 కిలోమీటర్లు కాలి నడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం.

ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించు కొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమ గ్రతను కాపాడుతుంది’ అని ముస్లిం రాష్ట్రీయ మంచ్ మీడియా ఇంచార్జీ షాహిద్ సయీద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు చేపట్టారు.

మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేస్తున్నట్టు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఇక, ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మరమ్మత్తులు కొనసాగనుండగా.. అనంతరం యథావిథిగా రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు.. ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మత్తు పనుల నిమిత్తం 10 రోజుల పాటు మూతపడనుండగా.. ఇరిగేషన్ అధికారుల కోరిక మేరకు పోలీస్ అధికారుల ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు.. కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా ప్రయాణాలు సాగించేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత.

నేడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి: నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనుంది.

ఇది పూర్తిస్థాయి పద్దు మాత్రం కాదు. లోక్ సభ ఎన్నికల ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది.

  

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది.

ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా..?

నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు గుర్తించారు.

ఆమె ఫోన్, సోషల్ మీడియా, వ్యక్తిగత చాటు పరిశీలించారు. మొబైల్ లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ను గుర్తించారు.

దీంతో లావణ్యను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఈరోజు కోరారు....

గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఇటీవల అఖిలపక్షం నాయకులు ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

దీంతో పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం దిగివచ్చింది. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానానికి మంగళవారం హెచ్ఎండీఏ ఆమోదం తెలిపింది. స్థలం కేటాయి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఈ నెల 31న గద్దర్ విగ్రహాన్ని అవిష్కరించాల్సి నిర్ణయం తీసుకున్న హెచ్ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే.కాగా, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారా యణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది.

ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళి సై సెప్టెంబర్ 19న తిరస్కరించారు. దీనిపై దాసోజు, కుర్ర సత్యనారాయణలు హైకోర్టు ను అశ్రయించారు.. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ పిటిషన్‌పై పది రోజుల కింద విచారణ జరిగింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేద‌ని హైకోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అనుమతి లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ తదుపరి విచారణ హైకోర్టు వాయిదా వేసింది.

అయితే త‌మ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ కోటాలో కోదండ రాం , అమీర్ ఖాన్ ల‌ను ఎమ్మెల్సీగా నియ‌మించా ర‌ని నేడు దాసోజు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తెచ్చారు.. ఆ ఇద్ద‌రూ నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని చెప్పారు.. దీంతో ఆ ఇద్ద‌రూ ప్ర‌మాణ స్వీకారం చేయ‌వ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేసింది..

త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు స్టేట‌స్ కో విదించింది.. విచార‌ణ‌ను వ‌చ్చే నెల 8వ తేదికి వాయిదా వేసింది..

IRR Case: సుప్రీంలో చంద్రబాబుకు ఊరట.. ఐఆర్‌ఆర్ కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది..

చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్‌ను త్రోసిపుచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం వ్యాఖ్యానించింది.

ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

420 సెక్షన్ చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17 ఏ సెక్షన్‌తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా? అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.

కాగా ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.