IRR Case: సుప్రీంలో చంద్రబాబుకు ఊరట.. ఐఆర్‌ఆర్ కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది..

చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్‌ను త్రోసిపుచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం వ్యాఖ్యానించింది.

ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

420 సెక్షన్ చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17 ఏ సెక్షన్‌తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా? అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.

కాగా ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

బాణ సంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు:ముగ్గురి దుర్మ‌ర‌ణం

కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలోని ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఆదివారం అర్ధ రాత్రి ఈ పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. . ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది.

సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరిం టెండెంట్ సీబీ రిషియంత్‌ తెలిపారు.

ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసు కుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు...

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

YSR జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని ఆకృతి షాపింగ్ మాల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది.

షాపింగ్ మాల్‌లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థలికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ద‌ట్ట‌మైన పొగ కార‌ణంగా అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌నను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

టాలీవుడ్ హీరో వేణు ఇంట్లో విషాదం

ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో వేణు ఇంట విషాదం నెలకొంది.

ఈరోజు తెల్లవారుజామున వేణు తండ్రి కన్ను మూయడంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.

ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు కన్నుమూయ డంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నేటి మధ్యాహ్నం ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి...

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది.

పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

అడ్వకేట్‌ జనరల్‌ నియా మకంపై తొలి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం....

ప్రభుత్వ స్టాప్ నర్సుల పరీక్ష ఫలితాలు విడుదల

రాష్ట్రంలో 7,094 స్టాఫ్‌ నర్సుల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా తుది ఫలితాలు విడుదలయ్యాయి.

కటాఫ్‌, ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌, సెలెక్షన్‌ లిస్ట్‌ ను రాష్ట్ర మెడికల్‌, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. 7094 పోస్టుల్లో 6956 మందిని ఎంపిక చేసినట్లు మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ప్రకటించింది.

జోన్ల వారీగా రిజర్వేషన్‌, కటాఫ్‌లను పొందుపరుస్తూ మెరిట్‌ లిస్టును విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌ సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

గతేడాది ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు 40 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన సంగతి తెలిసిందే. నూతనంగా నియమించబడిన స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలను ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ ఎల్‌.బీ.స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ హాజరు కానున్నారు.

గంగ మౌనికకు మొదటి ర్యాంకు…

తాజా ఫలితాల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన గంగ మౌనిక రాష్ట్రంలో మొదటి ర్యాంకు, హైదరాబాద్‌ కు చెందిన లూత్‌ మేరీ మూడో ర్యాంకు సాధించినట్టు- నిధ్యా నర్సింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ కవితా రాథోడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తమ అకాడమీ నుంచి మొదటి, మూడో ర్యాంకుతో పాటు- ఫైనల్‌ మెరిట్‌ లిస్టులో 3,800 మంది ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన లూత్‌ మేరీ రాష్ట్ర 3ర్యాంకు సాధించారు.ఏకంగా 3800 మంది అభ్యర్థులు నీధ్యా నర్సింగ్‌ అకాడమీ నుంచి ఎంపికయ్యారు..

షర్మిలతో సమావేశమైన సునీత

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు.

వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

గుర్తుతెలియని లారీ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్‌ (32) హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా..

అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), మహేశ్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్‌ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు.

మహేందర్‌ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తరువాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు..

మేడారంలో భారీగా ట్రాఫిక్‌ అంతరాయం తరలివస్తున్న భక్తులు

మేడారం జనసంద్రమవు తున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విరసిల్లు తున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు.

రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తు న్నారు.

భక్తుల రద్దీతో నిన్న,ఈరోజు మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. జంపన్న వాగు నుంచి చింతల్ x రోడ్డు వరకు రద్దీ కొనసాగు తున్నది. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు...

కేసీఆర్ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో గజ్వేల్ నియోజ వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గత కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడం తో ప్రమాణ స్వీకారం చేయలేక పోయారు. వచ్చేనెల ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

119 సీట్లున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేసీఆర్ ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.