TS Politics: ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు..

వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది..

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది..

బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు..

పలు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ''155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్‌ సాప్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నాం. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాలి.

ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది. పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్‌లో ప్రమోద్ కుమార్, మాదాపూర్‌లో సందీప్‌ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇళ్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశాం'' అని రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ వివరించింది..

Vijayawada: జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ?.. విజయవాడలో నిరుద్యోగుల దీక్ష

విజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..

10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు..

Chandrababu: పీలేరు సభలో జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తిరుపతి : ''రా.. కదలిరా'' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పీలేరులో ''రా..కదలి రా'' బహిరంగ సభలోనూ జగన్‌పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న ''సిద్ధం'' సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

యుద్ధం మొదలు.. మేమూ సిద్ధమే..

జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ''యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి మేము సిద్ధం'' అని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు.

రతనాల సీమ కోసం...

''నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం'' అని చంద్రబాబు వెల్లడించారు.

బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా❓️

బీహార్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.

పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో వెళతారని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది.

లాలూ యాదవ్ నేతృత్వం లోని ఆర్‌జెడితో కూడిన మహాఘటబంధన్ మహాకూటమి ప్రభుత్వం నుండి నితీష్ కుమార్ విడిపోయి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరడంపై ఊహా గానాలు చెలరేగుతు న్నాయి.

జెడి(యు)-బిజెపి కూటమికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయవచ్చని, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ తిరిగి డిప్యూటీగా వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి...

కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?

ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి ముందు పురుగుల మందు తాగింది. భార్యమరణం తట్టుకోలేక భర్త విజయ్ కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే విజయ్ మరణించాడు.

గతేడాది మేలో పల్లవి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.....

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

ప్రకాశం : గుండ్లకమ్మ ప్రాజెక్టును (Gundlakamma Project) ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) శనివారం ఉదయం పరిశీలించారు..

ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ (YCP Government)నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ మంత్రికి డ్యాన్సులు తప్ప.. ఏమీ పట్టించుకోరు...

జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ (YSR) గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీటితో పాటు 12 మండలాలకు తాగు నీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. 16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని.. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు.

ఐదు సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.

ప్రాజెక్టు మెయింటెనెన్స్ చెయ్యని తమరు.. వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు జగనన్న అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేశారు తప్ప... ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ఈపాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు. కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకి తట్ట మట్టి కూడా వైసీపీ వెయ్యలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తాయని షర్మిల పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

వరద ప్రవాహానికి ఏడాది క్రితం ప్రాజెక్టు 6వ నంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడిచినప్పటికీ గేటు ఏర్పాటు చేయడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తాజాగా రెండు నెలలు క్రితం మూడో నెంబర్ గేట్ సైతం కొట్టుకుపోయింది. రెండు టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్ళు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు. ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకి కొత్త గేట్లు ఏర్పాటు చేయటంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వైఎస్ షర్మిల ప్రాజెక్టును సందర్శించారు..

BJP Telangana: రేపు తెలంగాణకు అమిత్ షా.. ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన..!

BJP Telangana: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది..

అమిత్ షా టూర్ షెడ్యూల్…

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌ వెళ్లారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఆ తర్వాత కరీంనగర్ వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సభ అనంతరం హైదరాబాద్ చేరుకుని… సికింద్రాబాద్ పార్లమెంట్‌లో పార్టీ నిర్వహిస్తున్న మేధావుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోపై చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

నేడు బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం

బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమా వేశాలు నిర్వహించను న్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిం చనున్నారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు.

ఈ సమావేశాలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌ రమణ హాజరుకానున్నారు.

తెలంగాణభవన్‌లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్‌సభనియోజకవర్గాలవారీగా సన్నాహక సమావే శాలను నిర్వహించింది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.

ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులనుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలోనూ సమావేశాలు నిర్వహిం చాలని నిర్ణయించారు.

ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించను న్నారు.

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది.

ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ.. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది.

ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? వంటి వివరాలను కమిటీ చర్చించనున్నది.

పోడు భూములు, పట్టాలు, రికార్డుల నిర్వహణ తదితరు అంశాలపై వివరాలు సేకరించనున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విధానంపై ఆరా తీయనున్నది...