నేడు బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం

బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమా వేశాలు నిర్వహించను న్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిం చనున్నారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు.

ఈ సమావేశాలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌ రమణ హాజరుకానున్నారు.

తెలంగాణభవన్‌లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్‌సభనియోజకవర్గాలవారీగా సన్నాహక సమావే శాలను నిర్వహించింది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.

ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులనుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలోనూ సమావేశాలు నిర్వహిం చాలని నిర్ణయించారు.

ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించను న్నారు.

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది.

ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ.. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది.

ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? వంటి వివరాలను కమిటీ చర్చించనున్నది.

పోడు భూములు, పట్టాలు, రికార్డుల నిర్వహణ తదితరు అంశాలపై వివరాలు సేకరించనున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విధానంపై ఆరా తీయనున్నది...

YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు..

బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు..

Ra Kadalira: నేడు ఉరవకొండ చంద్రబాబు.. 'రా.. కదలిరా' పేరుతో పర్యటన..

నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 'రా.. కదలిరా' సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని..

11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు. పీలేరులో 11:50 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ చంద్రబాబు 'రా.. కదలిరా' సభలో పాల్గొంటారు.

ఆ వెంటనే రోడ్డు మార్గం ద్వారా పీలేరు మండలంలోని వేపులబైలు గ్రామానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ సాయంత్రం 5:30 వరకూ చంద్రబాబు సభ నిర్వహిస్తారు.

ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5:30 వరకూ టీడీపీ నిర్వహించే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు..

బేగంపేట పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు..

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజీ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్‌ హాస్టల్‌ బాత్రూమ్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు..

గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు..

ఈ ఘటనపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది.

ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న నేతలతో ఏపీలో ప్రచారం చేయించనున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని పాతతరం నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వారికి ఉన్న గుర్తింపు ఉపయోగప డుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.నోటిఫికేషన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి వస్తే మొదటి వారంలోనే తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని, వేర్వేరు దశల్లో వస్తే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నది.

సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెనర్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో రేవంత్‌రెడ్డితో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయి

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ త్వరలో ఏపీలో పర్యటిస్తా రని సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఆమె భేటీ అవుతారని తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వానికి, టీటీడీకి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్టు తెలిసింది.

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం

మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో మరింత స్పీడు పెంచింది. ఈ నెల 31వ తేదీ లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు.

ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీవరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది.

ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుండి కోటి 50 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క – కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు.

ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు.

గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు..

SB NEWS

Streetbuzz News

బీహార్‌లో రాజకీయ గందరగోళం మధ్య, తేజస్వి నితీష్‌కి సవాలు

•'తిరుగుబాటును సులభంగా జరగనివ్వను'

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే పక్షాన చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత బీహార్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది.ఢిల్లీ నుంచి పాట్నా వరకు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.. మరోవైపు తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు సవాల్‌ విసిరారు. నితీష్‌ కుమార్‌కు ఈసారి తిరుగుబాటు అంత సులభం కాదని తేజస్వీ యాదవ్‌ అన్నారు.

నితీష్ వైపు మారుతుందనే ఊహాగానాల మధ్య, తేజస్వి శుక్రవారం రోజంతా తన కోర్ కమిటీ సభ్యులతో దీనిపై చర్చించారు. మూలాల ప్రకారం, తేజస్వి యాదవ్ తన సభ్యులలో తాను మళ్లీ అంత సులభంగా పట్టాభిషేకం చేయడానికి అనుమతించబోనని చెప్పాడు.

అదే సమయంలో, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ తనకే మెజారిటీ ఫిగర్ అని ప్రకటించారు. నితీష్ కుమార్ కూటమిని విచ్ఛిన్నం చేస్తే, అతను తన కార్డులను బయటపెడతాడు. ఇవాళ జరగనున్న ఆర్జేడీ శాసనసభా పక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీ.

బీహార్‌లో రాజకీయ గందరగోళం మధ్య, RJD శిబిరం పూర్తిగా యాక్టివ్‌గా మారింది మరియు కూటమి విచ్ఛిన్నమైతే, తేజస్వి యాదవ్ నాయకత్వంలో RJD ఈ రోజు 1 గంటకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్లెయిమ్ చేయగలదని మూలాల నుండి చెప్పబడింది.

ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన 114 మంది ఎమ్మెల్యేలతో పాటు జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

జితన్‌రామ్‌ మాంఝీ తనయుడు సంతోష్‌ సుమన్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు, AIMIM నుండి ఒక ఎమ్మెల్యే మరియు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహాయంతో, RJD మెజారిటీ సంఖ్య 122 కంటే రెండు సీట్లు తక్కువగా చేరుకుంటుంది, అంటే 120 సీట్లు. అదే సమయంలో కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలు విడిపోయారని ఆర్జేడీ కూడా వాదిస్తోంది.

CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది..

ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు..

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..

ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన..

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం..

డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం..

తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు..

డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం..

ఏపీ విద్యావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై శకటం..

16 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన..

గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు..