YS Sharmila: భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల

విశాఖ: రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం భాజపాతో ములాఖత్‌ అయ్యాయని ఆరోపించారు..

విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ''భాజపాతో వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదు..

విశాఖకు ఏం చేశారు? రైల్వే జోన్‌ కూడా ఇవ్వలేదు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారు..

స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి.. కాంగ్రెస్‌ రావాలి'' అని పిలుపునిచ్చారు..

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మొన్ననే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగ్గా.. మళ్ళీ ఈరోజుఉదయం మింట్ కాంపౌండ్‌ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాల యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముద్రణా యంత్రాలు, పలు పుస్తకాలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది.

మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారి గాని, సిబ్బంది గాని రేవంత్‌ రెడ్డి,వద్ద పెట్టొద్దని సీఎం వోను ఐబీ ఆదేశించింది.

రేవంత్‌కి సంబంధించిన ప్రతీ సమాచారం లీక్‌ అవుతోందనే నేపథ్యంలోనే ఐబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.....

Purandeswari: జగన్‌ 'వైనాట్‌ 175' వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

విజయవాడ: సీఎం జగన్‌ 'వైనాట్‌ 175' వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు..

విజయవాడలో 'గావ్‌ చలో అభియాన్‌'ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైకాపా ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆ్రగహం వ్యక్తం చేశారు..

వీటిన్నింటినీ ప్రజలకు వివరించి జగన్‌ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం చేసిందొక్కటీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో పొత్తుల విషయం తమ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని పురందేశ్వరి తెలిపారు..

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..

ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..

చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం..

ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం.

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ

లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి

ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ

ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా వ్యవహరించిన టీఎంసీ

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో జరిగిన వైయస్సార్ ఆసరా సంబరాల్లో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.

25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని ఇక విశ్రాంతి తీసుకుంటానని సీఎం జగన్ కు చెప్పానన్నారు.

రాజకీయాల్లో విసిగిపోయానని పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని జగన్ కు ఇప్పటికే స్పష్టం చేశానన్నారు.

తనకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా జగన్ మాత్రం అంగీకరించడం లేదన్నారు.

పార్టీ కోసం ఈ ఒక్క సారి పోటీ చేయాలని సీఎం తనకు చెప్పారని ధర్మాన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు.

గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ రానున్న ఎన్నికల్లో పోటీకి దూరం?

28న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో బాటు టిడిపి నేతల తో భేటీ

ఓ ప్రవేట్ కళ్యాణ మంటపం టిడిపి నేతలకు ఆత్మీయ విందు.అంటున్న పార్టీ కార్యాలయ వర్గాలు

ఇప్పటికే టిడిపి అధిష్టానం కి సంకేతాలు పంపిన గల్లా జయదేవ్.

రెండు సార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపెందుకు సమావేశం.

కార్యక్రమంలో లోకేష్ .జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం

భారీగా ఏర్పాట్లు చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించ కపోవడం దురదృ ష్టకరం అని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం అని బీజేపీ ఎంపీ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారిమళ్లించింది అని ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకు న్నారు. అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు.. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు...

తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా డిఎస్సీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

ఈమేరకు ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య, త్వరలో పదవీవిరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు వంటివి అధికారులు సేకరిస్తున్నారు.

2023 ఆగస్టులో గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు ఐదువేల ఖాళీల భర్తీకి ఉద్దేశించిన ఈ నోటిఫికేషన్ కు అదనంగా ప్రస్తుత ఖాళీల సంఖ్యను జోడించి, భారీయెత్తున డిఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఏడాది 3,800 మంది టీచర్లు పదవీవిరమణ చేయనున్నారు. హైదరాబాద్ లో 370మంది, మేడ్చల్ లో 260మంది, ఖమ్మంలో 240మంది చొప్పున రిటైర్ కానున్నారు...