TS: రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు
ఉమ్మడి నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో 85.49% పోలింగ్ నమోదయింది.
నల్గొండ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాం లో ఈవీఎంలను భద్రపరిచారు, అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలో 84.83 % పోలింగ్ నమోదయింది.
సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేట లోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం కు తరలించారు. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు లలో 90.03% పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు అయింది. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది










తెలంగాణ లో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సీఎం కేసీఆర్ ఈ రోజు మూడు నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.







Dec 02 2023, 08:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.8k