TS: రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు

ఉమ్మడి నల్లగొండ జిల్లా:

నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో 85.49% పోలింగ్ నమోదయింది. 

నల్గొండ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాం లో ఈవీఎంలను భద్రపరిచారు, అక్కడే కౌంటింగ్ ఉంటుంది.

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలో 84.83 % పోలింగ్ నమోదయింది. 

సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేట లోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం కు తరలించారు. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు లలో 90.03% పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు అయింది. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య

నల్గొండ నియోజకవర్గం

పురుష ఓటర్లు: 1,19,434.

మహిళ ఓటర్లు: 1,24,972

ఇతరులు: 54.

Total: 2,44,446.

పోలింగ్ కేంద్రాలు...284.

మిర్యాలగూడ నియోజకవర్గం

పురుషు ఓటర్లు.1,13,911

మహిళ ఓటర్లు..1,17,455

ఇతరులు.25

Total..2,31,391.

పోలింగ్ కేంద్రాలు..263..

నకిరేకల్ నియోజకవర్గం

పురుష ఓటర్లు..1,24,668.

మహిళ ఓటర్లు..1,25,876.

ఇతరులు.4

Total...2,50,542.

పోలింగ్ కేంద్రాలు...305...

:::::

దేవరకొండ నియోజకవర్గం

పురుష ఓటర్లు..1,27,181.

మహిళా ఓటర్లు.1,24,425.

ఇతరుల..16.

Total..2,51622.

పోలింగ్ కేంద్రాలు..310..

::::::

మునుగోడు నియోజకవర్గం

పురుష ఓటర్లు..1,26,223

మహిళలు..1,26,421.

ఇతరులు.4.

Total..2,52,648

పోలింగ్ కేంద్రాలు..307..

:::::::

నాగార్జున సాగర్ నియోజకవర్గం

పురుషు ఓటర్లు..1,14,752.

మహిళలు..1,18,690.

ఇతరులు.20.

Total...2,33,412..

పోలింగ్ కేంద్రాలు..299...

.....

సూర్యాపేట నియోజకవర్గం

పురుషు ఓటర్లు...1,15,628.

మహిళలు..1,19,526..

ఇతరులు.17.

Total...2,35,221..

పోలింగ్. కేంద్రాలు...271...

::::::

కోదాడ నియోజకవర్గం

పురుష. ఓటర్లు..1,17,257.

మహిళలు..1,21,017.

ఇతరులు.15.

Total..2,37,289.

పోలింగ్ కేంద్రాలు..296..

::::::

హుజుర్నగర్ నియోజకవర్గం

పురుషు ఓటర్లు..1,13,056.

మహిళలు..1,17,299.

ఇతరుల..4..

Total...2,30,359.

పోలింగ్ కేంద్రాలు..308...

::::::

తుంగతుర్తి నియోజకవర్గం

పురుషు ఓటర్లు...1,27,578.

మహిళలు..1, 27,431.

ఇతరుల.8.

Total...2,55,017..

పోలింగ్ కేంద్రాలు..326..

::::

భువనగిరి నియోజకవర్గం

పురుషు ఓటర్లు..1,05,404.

మహిళలు..1,05,958.

Total...2,11,362..

పోలింగ్ కేంద్రాలు..257..

:::::

ఆలేరు నియోజకవర్గం

పురుషు ఓటర్లు 1,16,708.

మహిళలు..1,16,539

ఇతరులు.19.

Total..2,33,266.

పోలింగ్ కేంద్రలు.309..

....

మహాత్మ జ్యోతిరావు పూలే భారత దేశ మొదటి సంఘసంస్కర్త : ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

నల్లగొండ జిల్లా:

కొండమల్లేపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా.. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ఉపాధ్యక్షులు యేకుల సురేష్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు చిట్యాల గోపాల్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ మొదటి సంఘసంస్కర్త అని కొనియాడారు. పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు . 1873 సెప్టెంబరు 24న, పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి ,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయుడు అని తెలిపారు. అదేవిదంగా అన్ని మతాలు, కులాల ప్రజల కోసం పాటుపడిన సామాజిక సంస్కరణ ఉద్యమకారుడు పూలే అని కొనియాడారు. పూలే, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలు మొదలు పెట్టిన మొట్ట మొదటి మహాను బావులు అని పూలే సేవలను కొనియాడారు. అదేవిదంగా ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడన్నారు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న మహనీయుడని కొనియాడారు. 

అదేవిదంగా భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని ఈ సందర్బంగా గుర్తుచేసారు. ఈలాంటి గొప్ప మహాత్ముని దేశ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకొని అయన ఆచరణలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షిత్ కుమార్, ఠాగూర్, రమేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

HYD: ఈ నెల 29, 30వ తేదీలలో అన్ని విద్యా సంస్థలకు సెలవు

HYD: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 దృష్ట్యా, ఈ నెల 29, 30వ తేదీలలో హైదరాబాద్ జిల్లా లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. 1 డిసెంబర్ 2023 న పునః ప్రారంభమవుతాయని అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.

నేడు మల్కాజిగిరి లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం

నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం తారా సాయికి చేరింది. ఈ నేపథ్యంలో నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

నేడు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ... హైదరాబాద్ లోని మల్కాజిగిరి లో గల ఆనంద్ బాగ్ చౌరస్తా నుండి ఉమ్మడి రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

TS: నేడు 3 నియోజకవర్గాలలో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ లో నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సీఎం కేసీఆర్ ఈ రోజు మూడు నియోజకవర్గాలలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

ముందుగా వ‌రంగ‌ల్ ఈస్ట్, వ‌రంగ‌ల్‌ వెస్ట్ ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం చేస్తారు. అనంత‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లో సాయంత్రం ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు.

ఎన్నికల ప్ర‌చారం చివ‌రి రోజు కావ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ ప్ర‌సంగం ఎలా ఉంటుందోన‌ని ఉత్సాహాంతో ఎదురు చూస్తున్నారు. అలాగే స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశారు. అటు పోలీసులు కూడా భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

మునుగోడు నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని మార్రిగూడ మండలంలోని శివన్న గూడెం గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిఐటియు కార్మికులను కలిసి నర్సిరెడ్డి ని గెలిపించాలని కోరారు. 

కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిరంతరం ప్రజాసేవకే అంకితమై 35 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితాన్ని కార్మికులకు అందించిన ఘనత కామ్రేడ్ నర్సిరెడ్డి దని, మునుగోడు నియోజకవర్గం నుండి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, గడగోటి వెంకటేష్, పిట్టల రమేష్, అప్పనగోని యాదయ్య, పల్లి నరసింహ, జనిగల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన నిరుపేద విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసిన YRP ఫౌండేషన్

అనుముల మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి గార్లపాటి భరత్ కు వై ఆర్ పి ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవి ప్రసాద్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఫీజు మొత్తం 35 వేల రూపాయల నగదును చెక్ రూపంలో ఈరోజు నల్గొండ పట్టణంలోని YRP ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం నందు పంపిణీ చేయడం జరిగింది.

అనుముల మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత విద్యార్థి గార్లపాటి భరత్ నల్గొండ పట్టణంలోని మాధవ్ నగర్ ప్రభుత్వ JBS హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి, చదువుల్లో రాణిస్తూ, హైదరాబాద్ మహావీర్ కాలేజీలో పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తీర్ణుడై, ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం అదే కాలేజీలో స్థానం సంపాదించాడు.

ఈ సందర్భంగా గార్లపాటి భరత్ తల్లిదండ్రులు గార్లపాటి ఊశయ్య- అంజమ్మలు నిరుపేద వ్యవసాయ కూలీలు కావడం వారికి కుమారుడి ఇంజనీరింగ్ చదువు ఫీజు కట్టే స్తోమత లేకపోవడం వల్ల JBS హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు బొమ్మపాల గిరిబాబు సహకారంతో వైఆర్పి ఫౌండేషన్ వారిని సంప్రదించగా వారు విద్యార్థి స్థితిగతులను, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని భరత్ కు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుకై అవసరమైన 35వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

ఎలిశాల రవి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాల దశనుండే క్రమశిక్షణ, మంచి నడవడికతో, ప్రణాళికాబద్ధంగా చదువుల యందు శ్రద్ధను చూపెడితే యుక్త వయసులోనే మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా గార్లపాటి భరత్ ఉన్నత చదువులకు మా YRP ఫౌండేషన్ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. 

అనంతరం చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలిశాల రవి ప్రసాద్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి శమీమ్అక్తర్, ఎలిశాల శరత్ చంద్ర, యామా దయాకర్, ఎలిశాల వెంకటేశ్వర్లు,పారేపల్లి భరత్, బొమ్మపాల గిరిబాబు, మద్ది కర్ణాకర్, మారేపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మెగా రక్త దాన శిబిరం

NCC డే సందర్భంగా ఈ రోజు నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల లో NCC మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున కళాశాల NCC ఆఫీసర్ చిలుముల సుధాకర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. NCC క్యాడెట్లు దేశ నిర్మాణం పట్ల,దేశ రక్షణ పట్ల, కళాశాల స్థాయి నుంచి నిబద్ధత కలిగినటువంటి దేశ పౌరునిగా తయారు అయ్యేటందుకు NCC దోహదపడుతుందని, ఇది విద్యార్థులలో యువతలో క్రమశిక్షణ, నాయకత్వం మరియు సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని, సమాజానికి సానుకూలంగా సహకరించేలా వారిని సిద్ధం చేస్తుంది.

NCC క్యాడెట్లు దేశ రక్షణతో పాటుగా ఒక పౌరుని ఆపద సమయంలో రక్తం దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో NCC సుబేదార్ చంకోర్ సింగ్, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యులు మందడి నర్సిరెడ్డి మరియు క్యాడెట్లు వంశీ, జయంత్, సాయి మాధవ్, సంపత్ ఆదిత్య, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

TS: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఈవీఎంల పరిశీలన పూర్తి

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సరిగ్గా మరో 3 రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి గందరగోళం కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్ డ్యూటీలో ఉండగా, లక్షా 60 వేల మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌‌ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అందులో 56 వేల మంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబర్ 29 లోపు మరో లక్ష మంది ఎలక్షన్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్‌లో చెప్పింది ఒకటైతే, గ్రౌండ్ లెవల్‌​లో పోస్టల్ ​బ్యాలెట్ ప్రక్రియ మరోలా జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే, ఈ సారి అంగన్​వాడీలకు కూడా ఈసీ ఎన్నికల విధులు అప్పగించింది. వారికి సొంత పోలింగ్ స్టేషన్ల పరిధిలో కాకుండా ఇతర పోలింగ్​ కేంద్రాల్లో విధులు కేటాయించారు. దాంతో ఈ ఎన్నికల్లో దాదాపు 30 వేలకు పైగా అంగన్​వాడీలు, ఇతర సిబ్బంది తమ పోస్టల్​ బ్యాలెట్‌ వినియోగించుకోలేక పోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

పోలింగ్‌ విధుల్లో ఎక్కువగా టీచర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొంటారు. అయితే వారికి సరిపడా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బందిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల గందరగోళం వ్యవహారం.. ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పరిస్థితులను బట్టి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని టిఎస్ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అందులో భాగంగా ప్రత్యేక పరిశీలకుల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లు సహా ఎన్నికల సంబంధిత అంశాలపై సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇప్పటికే హోం ఓటింగ్ పూర్తి అయిందని ఆయన తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్లలో ఒక లక్ష 31 వేల ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు, వెయ్యికి పైగా నాన్ గవర్నమెంటు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సీఈవో వెల్లడించారు. మొత్తం లక్ష 65వేల పోస్టల్ బ్యాలెట్ ఆమోదం తెలిపామన్న ఆయన, ఇప్పటి వరకు 95వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అలాగే హోం ఓటింగ్ ద్వారా 26వేల మంది ఓటింగ్ పూర్తి చేసుకున్నారన్నారు.

అలాగే రాష్ట్రంలో ఎన్నికల ఉల్లంఘన కింద భారీ ఎత్తున నగదు దొరుకుతోందని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రూ. 709 కోట్ల సీజ్ చేశామన్నారు. అందులో రూ. 290కోట్ల వరకు నగదు ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సీఈవో ఓటర్ల నిష్పత్తి 1000:1002 గా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందుకోసం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. EVM లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి, 54 లక్షల 13వేల EPIC ప్రింటింగ్ పూర్తి అయిందన్నారు. ఓటరు ఐడెంటీ కార్డులు బూత్ లెవ్ అధికారుల ద్వారా ఇంటింటికి పంపిణి జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఈవో వికాస్ రాజ్, మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఇందులో 221 మహిళా అభ్యర్థులు ఉన్నారన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామని సీఈవో తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, హైదరాబాద్ జిల్లాలో 14, ఒక్కో జిల్లాలో ఒక్కొకటి చొప్పున ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న ఆయన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో CCTV, వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీ గా ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించేందుకు 45వేల తెలంగాణ పోలీసు విధుల్లో ఉన్నారని, 196 కేంద్ర బలగాలు వచ్చాయి, ఇతర రాష్ట్రాల నుంచి 24వేల హోం గార్డ్స్‌లను కూడా విధుల్లోకి తీసుకున్నామన్నారు.

దివ్యాంగులు, వృద్దులు ఓటే వేసేందుక అన్ని చర్యలు తీసుకున్నామన్న సీఈవో.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటికే 80వేల వీల్ చైర్లను అయా జిల్లాలకు పంపామని తెలిపారు. పోలింగ్ సమాయానికి 48 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఈవో తెలిపారు. 48 గంటల ముందే స్థానికేతరులు అయా ప్రాంతాలను విడిచి బయటకు వెళ్లిపోవాలన్నారు. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదన్నారు.