NLG: దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి:

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ శాఖ, దేవరకొండ నియోజక వర్గం ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి చౌరస్తాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షలు సురేష్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ పాల్గొని స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏకుల సురేష్, చిట్యాల గోపాల్ మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందన్నారు. 

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు హక్కులను రాజ్యాంగం ప్రకారం అందించాలని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజక వర్గం ఉపాధ్యక్షుడు యేకుల అంబేద్కర్, జిల్లా కోశాధికారి అంబికా శ్రీను, సభ్యులు చలిసిమల పర్వతాలు, పెరుమాళ్ళ హరి, రామవత్ సేవా నాయక్,హరినారాయణ, మనికంట, లోకేష్, అధిరాల రాము, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేవరకొండలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నేడు దేవరకొండ పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, స్వాతంత్ర్యం నకు పూర్వం దేశ ప్రజలకు.. వలస పాలకుల, రాజరికపు పాలకుల పాలనలో కేవలం వాళ్ళు చెప్పిందే అమలయ్యేదని.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశంలోని కోట్లాదిమంది ప్రజలకు విద్య, వైద్యం, సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు.

భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయకుమార్, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు రాములు, రాజేష్, రాజ్ కుమార్, గిరి తదితరులు పాల్గొన్నారు

నేడు రాజ్యాంగ దినోత్సవం

నేడు దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం, గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు అంటే 1949 నవంబర్ 26న, ఈ రోజు న ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

NLG: మర్రిగూడ మండలం లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో, నేడు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు సమర్పించారు. 

ఈ సందర్భంగా నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగిందని, ఆరోజును గుర్తు చేసుకుని భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. 

రాజ్యాంగ ప్రాధాన్యత అంబేద్కర్ ఆశయాల పై అవగాహన కల్పిస్తూ, ప్రపంచ దేశాలలో అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం ఉన్నదని అన్నారు. 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26 ను రాజ్యాంగం దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వల్లపు కేశవ్ గౌడ్,  రాజేందర్ నాయక్, ఆవుల ప్రభుదాస్, ఈద అభి సందేశ్, వంపు చరణ్, కోరే అజయ్, మహేశ్వరం శివరాజ్, ఈద యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు

NLG: రోడ్డు ప్రమాదంలో మరణించిన జంగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా: 

చింతపల్లి మండలం, గొల్లపల్లికి చెందిన కె. జంగయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎటు తోచని వారి కుటుంబానికి.. పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు తన వంతు సాయంగా, జంగయ్య భార్య భాగ్యమ్మకు ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకొని నేనున్నానని దైర్యం చెప్పారు. నిరంతరం సేవలు చేసే పగడాల ముత్తు సుఖంగా జీవించాలని స్థానిక ప్రజలు దీవిస్తున్నారు. ఎనలేని ప్రజల మన్ననలు పొందుతున్న పగడాల మత్తుకు జనం జేజేలు పలికారు.

TS: నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ రెండవరోజు పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు ప్రియాంక గాంధీ పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు లో ప్రియాంక రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి లో కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు.

అదేవిధంగా మధ్యాహ్నం 2.40 గంటలకు మధిర కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.

NLG: డబ్బును ఓడించండి.. నిజాయితీని గెలిపించండి:: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా:

నకిరేకల్ నియోజకవర్గం, రామన్నపేట పట్టణం: నిర్నేముల, శోభనాద్రిపురం, లక్ష్మాపురం ల, కొత్తగూడెం నిదానపెళ్లి గ్రామాలల్లో బి ఎస్ పి అభ్యర్థి మేడి ప్రియదర్శిని శుక్ర వారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో షాప్ టు షాప్, గ్రామాల్లో గడప గడప తిరుగుతూ డబ్బును ఓడించండి నిజాయితీని గెలిపించండి అంటు నోటు ఇవ్వండి ఓటు వెయ్యండి అంటూ తిరిగారు.

మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రతి ఒక్కరూ ప్రోలోభావాలకు గురికాకుండా ఓటు వేయాలని తన ఎన్నికల ఖర్చులను కూడా ప్రజల నుండే సేకరిస్తున్నట్టు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,మండల అధ్యక్షులు మేడి సంతోష్, మండల ఉపాధక్షులు గుని రాజు, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల కార్యదర్శి బందెల అనిత, మండల కోశాధికారి గట్టు రమేష్, నాయకులు నన్నెపక రామ్ కుమార్,మల్లేష్, వినయ్, మల్లికార్జున్, ఉదయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

TS: రైతు బంధు పంపిణీకి తొలగిన అడ్డంకులు

తెలంగాణలో ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ కు ఊరట లభించింది. రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగడం తో, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిధుల విడుదలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

TS: ఈనెల 25న మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శనివారం, 3 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రచార సభలలో పాల్గొనున్నారు.

రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు మొదట బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారు.

ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.

TS: రేపు 4 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. రేపు 4 నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.

ఉదయం 10 గంటలకు జుక్కల్ బహిరంగసభ

ఉదయం 11.30 గంటలకు షాద్ నగర్ బహిరంగసభ

మధ్యాహ్నం 12.30 గంటలకు ఇబ్రహీంపట్నం బహిరంగసభ

మధ్యాహ్నం 2గంటలకు కల్వకుర్తి బహిరంగసభ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.