NLG: మాలల ఐక్యత చాటి చూపిద్దాం: నాగిల్ల మారయ్య

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కేంద్రంలో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ఈరోజు నాగిల్ల మారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మాల కులస్తులకు అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా మాలలను ఓట్లు వేయడానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్స్ స్థానాలలో కూడా పెత్తందారులు కలగజేసుకుని మాలలను చిన్నచూపు చూడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాలలకు 2,50,000 ఓట్లు ఉన్నా, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో 21,000 ఓట్లు ఉన్నా.. మునుగోడు నియోజకవర్గంలో పదివేల ఓట్లు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ.. విద్యావంతులు, మేధావులు అయినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం మాలలో ఐక్యత లోపించడమేనని మాలలు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మాలల ఐక్యత వర్ధిల్లాలని మాలల వ్యతిరేక శక్తుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, ఇండిపెండెంట్ అభ్యర్థి కోరే యాదయ్య, మరో అభ్యర్థి వి ఆర్ పి ఎమ్మేల్యే అభ్యర్థి నూనె సురేష్, శ్రీకాంత్, మహిపాల్, ఈద అభి సందేశ్, వంపు చరణ్, రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RR: కాంగ్రెస్ పార్టీలో చేరిన కురిమిద్ద గ్రామ సర్పంచ్ బందే రాజశేఖర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం:

యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ బందే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

TS: బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తాం: సీఎం కేసీఆర్

నల్లగొండ: సీఎం కేసీఆర్ నేడు, నల్లగొండ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే హక్కు.. మీ ఓటు, ఆ ఓటు సద్వినియోగం అయితే రాష్ట్రానికి మీకు మంచి జరుగుతుందని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాయి ఏదో రత్నమేదో గుర్తించండి. అభ్యర్థులు వారి వెనకున్న పార్టీల చరిత్ర చూడాలి. గతంలో నల్లగొండలో ఆముదం పంటలే ఉండేవి, ఇప్పుడు బ్రహ్మాండంగా వరి పంటలు పడుతున్నాయి. ప్రస్తుత 10 ఏళ్ల పాలన, గతంలోని 50 ఏళ్ల పాలన ను బెరోజి వేసుకోవాలని కోరారు.

నల్లగొండను కెసిఆర్ దత్తత తీసుకున్నట్లు ప్రజలకు గుర్తు చేశారు. నల్లగొండ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. 1400 కోట్ల నిధులతో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారని, నల్లగొండకు ఐటి టవర్, మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చారని, అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కెసిఆర్ తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయిందని, ఉదయసముద్రం గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తామని అన్నారు. ధరణి వల్ల డైరెక్ట్ గా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు.

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పేదలకు మంచినీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ నియోజకవర్గ ఇంకా తన దత్తత లోనే ఉందని, రాబోయే రోజుల్లో పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని కెసిఆర్ అన్నారు. ఆర్టీసీ ని గవర్నమెంట్ లో కలిపినాము, తమ ప్రభుత్వం వస్తె, ఆటో వాళ్లకు ఫిట్నెస్ టాక్స్ రద్దు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కెసిఆర్ తెలిపారు.

నల్గొండ: వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు బహుకరణ

నల్గొండ పట్టణ కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల, గ్రంథాలయ సమాచార శాస్త్రం మరియు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా.. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, రీడతన్ , పుస్తక ప్రదర్శన, పుస్తక సమీక్ష, క్విజ్ పోటీలో నిర్వహించారు. వివిధ పోటీలలో పాల్గొన్న విజేతలకు పుస్తక బహుమతులు మరియు సర్టిఫికెట్ ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.వి గోనా రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో మరియు ప్రపంచ ఉపాధ్యాయ ఫోరం సెక్రటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల గ్రంథాలయాన్ని మరియు సమాచార వనరులని వినియోగించుకొని, వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలని, డిగ్రీ చదువుతున్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీతత్వం పై అవగాహన పెంచుకోవాలని, ఉన్నత విద్యలో పరిశోధనలో విద్యార్థులు రాణించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, కృష్ణ కౌండిన్య, యాదగిరి, లవెందర్ రెడ్డి, నాగుల వేణు, శివరాణి, యాదగిరి రెడ్డి, తదితర అధ్యాపకులు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయకుమార్, గ్రంథాలయ సిబ్బంది సూదిని వెంకట్ రెడ్డి, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: ఇంటర్ యూనివర్సిటీ యోగ పోటీలకు ఎంపికైన వి.కోమల

నల్లగొండలో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి, ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. 

అందులో భాగంగా ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని వి. కోమల యోగ విభాగంలో, ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మరియు అధ్యాపకులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

మునుగోడు నియోజకవర్గం: నరసింహులగూడెం గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ లో చేరిక

మునుగోడు నియోజకవర్గం:

ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాను కప్పి మాట్లాడారు.

సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న ప్రజల ప్రభుత్వం మైన బీఆర్ఎస్ పార్టీని.. ప్రజలందరూ గెలిపించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ,రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తూ సబ్బండ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం తెలంగాణ లో మాత్రమే అన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన మునుగోడు బీఆర్ఎస్ పార్టి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ అధిక మొత్తంలో నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించి, గ్రామాల్లో నేడు అధిక సంఖ్యలో సిసి రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ప్రజలందరూ గ్రహించి కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మాడపు నరసింహారావు, సర్పంచ్ బల్గూరి విష్ణువర్ధన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సభావత్ సర్దార్ నాయక్ నడింపల్లి యాదయ్య బెక్కం రమేష్, బాల్లూరి విజయ్, ఉపసర్పంచ్ బెల్లంకొండ నరసింహా, జాల వెంకటయ్య, బీసు వల్లయ్య, బలుగురి జనార్దన్, కొమ్మానబోయిన యాదయ్య, జెట్టి అంజయ్య, జినుకల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: కోమటిరెడ్డి ని గెలిపించాలని తెలంగాణ జన సమితి ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని.. భారీ మెజార్టీ తో గెలిపించాలని తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.

SRPT: వట్టే జానయ్య పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో, బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు. ప్రత్యర్థులు వట్టే జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు . దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడు కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉదృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

నల్గొండ: నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు.

నల్గొండలో సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ముందస్తుగానే ఖరారు కావడంతో ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు జనసమీకరణలో నిమగ్నమవుతున్నారు.బీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలతో పాటు, సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.

TS: బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే బోయ లను గిరిజనులు గా ప్రకటిస్తామని: కేసీఆర్

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. వాల్మీకి బోయ లను బీసీ లో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే బోయ లను గిరిజనులు గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 200 ఉండే పింఛన్‌ ను రూ. 2వేలకు పెంచామని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ను గెలిపించినట్లయితే అన్ని రకాల లాభాలు జరుగుతాయని అన్నారు.