TS: జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తాం: మంత్రి గంగుల కమలాకర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, ఫకీర్ పేట, జూబ్లీ నగర్ ఏరియాల్లో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచే రేషన్ కార్డులు లేని అర్హులందరికీ కొత్త కార్డులు అందజేస్తామన్నారు. 

కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి అందించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ తోనే ఇక్కడి ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు.

RR: కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించిన మల్ రెడ్డి రంగారెడ్డి

ఆదిభట్ల మున్సిపాలిటీ లోని ఆదిభట్ల గ్రామం,గంగా నగర్ కాలనీ,బొంగులూరు, మంగళపల్లి , సాహెబ్ గూడ,ఎంపీ పటేల్ గూడ,కొంగరకలాన్, కొంగరకలాన్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించారు

1) మహాలక్ష్మి:

- మహిళలకు ప్రతీ నెల ₹2500,

- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.

- ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.

2) రైతు భరోసా:

- ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ₹15,000.

- ₹12,000 వ్యవసాయ కూలీలకు.

- వరి పంటకు 500 బోనస్.

3) గృహ జ్యోతి:

- ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

4) ఇందిరమ్మ ఇళ్లు:

- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.

- ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.

5) యువ వికాసం:

- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు.

- ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.

6) చేయూత:

- వృద్ధులు,వితంతువులు, వికలాంగులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,కల్లుగీత కార్మికులు,నేత కార్మికులు,ఎయిడ్స్,ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.

- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.

ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

లెంకలపల్లి: నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నాది: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సిపిఐ నాయకులు కార్యకర్తలు కోలాటం కళాకారులు స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను గెలిపిస్తే 500 రూపాయలకు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత నాది, నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నాది అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్, సిపిఐ, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కేతేపల్లి: బహుజనుల రాజ్యాధికారం తోనే అభివృద్ధి సాధ్యం: బిఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని

పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బహుజనుల రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని నకిరేకల్ బిఎస్పి అభ్యర్థి మేడి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం కేతేపల్లి మండలం చీకటి గూడెం, ఇప్పలగూడెం, తుంగతుర్తి, బీమరం, కొప్పోలు, ఉప్పాల పహాడ్ గ్రామాల్లో బహుజన రాజ్యాధికారం కోసం నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో బిఎస్పి అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

బి ఎస్ పి రాజ్యాధికారంలోకి వస్తే కాన్సి యువ సర్కార్, బహుజన రైతు భీమా, దొడ్డి కొమరయ్య భూ హక్కు, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి, షేక్ బంద్ కి గృహజ్యోతి, పూలే విద్య దీవెన, బ్లూ జాబ్ కార్డ్,100 సంవత్సరాల ఆరోగ్య భీమా కార్డు లాంటి బృహత్తర పథకాలు అమలు చేసి తీరుతామని ఈ పథకాలను విస్తృతంగా ప్రచారం అయ్యేవిధంగా ప్రజలు చైతన్యవంతులై జరగబోయే ఎన్నికల్లో బి.ఎస్.పి పార్టీకి ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కార్యదర్శి చందుపట్ల శృతి, మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మండల ఉపాధక్షులు నాగిల్ల జానకిరామ్, జోగు శేఖర్, దాస్,చింత శ్రీకాంత్, కార్యదర్శి దుర్గం వెంకన్న,యస్వంత్, జగపతి, శ్రీరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

TS: ఓట్లు మావి.. సీట్లు మీకా.. : డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీ లను కూలుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా.. అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ... ''కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో 1,50,000 కోట్లు గోదావరి పాలయ్యాయి. ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది

అని విమర్శించారు.మీ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవంబరు 30వ తేదీన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలి. బీర్లు, క్వార్టర్లు మా పేదలకు.. డబ్బులు పదవులు మీకా.. అని ఫైర్ అయ్యారు. అన్ని కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే అని తెలిపారు.

బీఎస్పీ పార్టీ అధికారంలోకి ఓస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రోడ్డెక్కితే ప్రజలు రాళ్లతో కొడుతున్నారు. కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో గద్దె దించాలి. కోయ, లంబాడి చిరు ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్‌తో వస్తున్నాను. రేపటి రోజున బహుజనులే హెలిక్యాప్టర్లకు ఓనర్లు అవుతారు'' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు..

TS: కాంగ్రెస్ లో చేరిన దామరచర్ల ఎంపీపీ నందిని రవితేజ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ లోకి మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యనాయక్ కుమారుడు స్కైలాబ్ నాయక్ మరియు దామరచర్ల ఎంపీపీ నందిని రవితేజ, బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినారు.

శ్రీవారిని దర్శించుకున్న 67,140 మంది భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.

నిన్న శ్రీవారిని 67,140 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,870 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు.

TS: కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గాంధీభవన్ లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అభయ హస్తం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ.. 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో అభయహస్తం మేనిఫెస్టో రూపొందించి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ ల పేరుతో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అభయ హస్తం మేనిఫెస్టోను కూడా జనాల్లోకి తీసుకుకెళ్లనుంది.

కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

ప్రతి రోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ ఏర్పాటు 

రైతులకు రెండు లక్షలు రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం

మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను పొందుపరిచారు.

ఎంఎన్ఆర్ఇజిఎస్ పనులు వ్యవసాయానికి అనుసంధానం

దళిత, గిరిజనులకు మేలు చేకూర్చేలా మ్యానిఫెస్టో ఉందన్నారు.

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు చేపడతాం.

రైతులకు 24గంటలు ఫ్రీ కరెంట్.

కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం.ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం.

ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 వరకూ గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్.

రాష్ట్రంలో కొత్తగా ట్రిపుల్ ఐటీలు నిర్మిస్తాం.

విత్తనాలు, ట్రాక్టర్లు, ఎరువులు కొనుగోలుపై సబ్సీడీ అందిస్తాం.

18ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ.

నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం.

ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్

ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు

ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం

ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షల రూపాయల నిధులు

ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10 పాస్ అయితే 10వేలు, ఇంటర్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పాస్ అయితే 25000, పీజీ పాస్ అయితే లక్ష అందజేత

3 ఎస్సీ కార్పొరేషన్ లో ఏర్పాటు ఒక్కొక్క కార్పొరేషన్ కు ఏడాదికి 500 కోట్ల నిధులు

జూన్ 2న నోటిఫికేషన్.. సెప్టెంబరు 17 లోపు ఉద్యోగాల భర్తీ.

నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి

రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం.

రైతు కూలీలకు రూ. 12వేలు ఆర్థిక సాయం

అన్ని పంటలకు మద్దతు ధర

చక్కెర కర్మాగారాలు తెరవడం, పసుపు బోర్డు ఏర్పాటు.

భూమి లేని రైతులకు సైతం రైతు భీమా.

ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్

టీఎస్పీఎస్సీ ప్రక్షాళన.. యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ

అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు రూ.25 వేలు గౌరవ వేతనం

అమరవీరుల కుటుంబంలో ఒకరికి సర్కార్ కొలువు.

విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం.

ఆరోగ్య శ్రీ పథకం రూ. 10లక్షలకు పెంపు

ప్రతి విద్యార్థికి రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు.

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10వేలకు పెంపు.

ప్రతి మండలానికి మార్కెట్ యార్డ్

వరి ధాన్యం కొనుగోలు తరుగు తొలగింపు

పాల ఉత్పత్తిదారులకు లీటర్కు ఐదు రూపాయలు ప్రోత్సాహకం

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ అమలు

ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశ వర్కర్లకు వేతనం పెంచి ఉద్యోగ భద్రత 

మైనార్టీలకు మైనార్టీ డిక్లరేషన్

పిహెచ్డి ఎం.ఫిల్ పూర్తి చేసిన మైనార్టీలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం

మత బోధకులకు గౌరవ వేతనం 10,000 నుంచి 12,000

నూతన వధువుకు ఒకటి 1.6లక్షలు

ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఐదు లక్షల ఆర్థిక సహాయం

పై వాటితో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు:

1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్‌ పిలిండర్‌, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌

3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం

5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్‌, రూ. 10 లక్షల వరకూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ భీమా

అదేవిధంగా బీసీలకు మేలు జరిగేలా పలు అంశాలతో * బీసీ డిక్లరేషన్*

విద్యా పరంగా చూస్తే మండలానికి ఒక గురుకుల పాఠశాల

ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు.

పేదింటి ఆడబిడ్డ వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మరియు 10 గ్రాముల బంగారం.

మరిన్ని వివరాలకు పూర్తి కాంగ్రెస్ మేనిఫెస్టోను సంప్రదించవచ్చు

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన

నల్గొండ: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా.. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, ఈరోజు కళాశాల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ రకాలైన పుస్తకాలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్, జనరల్ నాలెడ్జ్, చరిత్ర, డిగ్రీ పుస్తకాలు, సాహిత్య రంగానికి చెందిన మరియు అన్ని రకాలైన మ్యాగజైన్స్, జర్నల్స్ మరియు ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం జరిగింది. 

కళాశాలలో విద్యనభ్యస్తున్న 2300 మంది విద్యార్థినిలు పుస్తక ప్రదర్శనను తిలకించి సంతోషం వ్యక్తపరిచారు. విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాల గ్రంథాలయంలో అన్ని రకాలైన పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు, మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, చరిత్ర మరియు సాహిత్యం రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పోటీ పరీక్షలు మరియు ఉన్నత విద్యకు సంబంధించిన ఎంట్రెన్స్లలో తాము ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. 

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తమ కళాశాలలో గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజా రామ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. 

డాక్టర్ సుంకరి రాజా రామ్ మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శన ద్వారా విద్యార్థినులలో చదువుల పై ఆసక్తి మరియు పుస్తకాలపై మక్కువ పెరుగుతుందని తద్వారా ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి తమకు కావలసిన పుస్తకాలను ఎంచుకొని విజయం సాధించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

TS: అధ్యాపకుడు మామిడి లింగస్వామికి 'విద్యా సేవా రత్న అవార్డు'

హైదరాబాద్: జగతిఆర్ట్స్ వారు ప్రతి సవత్సరం విద్యాసేవారత్నా , నృత్యసేవారత్న అవార్డులను ప్రకటిస్తారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్-2023 ను పురస్కరించుకొని, పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

అదేవిధంగా ఈ సంవత్సరముకు గానూ వివిధ రంగాలల్లో సేవలందించిన మహోన్నతమైన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా విద్యారంగంలో సేవకు గాను నల్లగొండ జిల్లా కు చెందిన అధ్యాపకుడు మామిడి లింగస్వామి ని విద్యాసేవారత్న అవార్డు కు ఎంపిక చేసి త్యాగరాయ గానసభ లో అవార్డును ప్రదానం చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గీత రచయిత డాక్టరు సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. ప్రముఖ న్యూమరాలజిస్టు దైవజ్ఞశర్మ మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమా చేతుల మీదుగా విద్యా సేవారత్న అవార్డును అందచేశారు. అవార్డు గ్రహీత మామిడి లింగస్వామి మాట్లాడుతూ.. ముందుగా నాకు విద్యా నేర్పి, నన్ను తీర్చిదిద్దిన గురువులందరికి నా నమస్కారాలు పాదాబివందానాలు. 'విద్యాసేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నన్ను చదివించిన తల్లిదండ్రులకు ఎప్పటికి ఋణపడి ఉంటానని, పేదరికంలో అణగారిన వర్గంలో ఉన్న నన్ను గుర్తించి అవార్డును ప్రదానం చేసిన జగతి ఆర్ట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని తెలిపారు