TS: అధ్యాపకుడు మామిడి లింగస్వామికి 'విద్యా సేవా రత్న అవార్డు'
హైదరాబాద్: జగతిఆర్ట్స్ వారు ప్రతి సవత్సరం విద్యాసేవారత్నా , నృత్యసేవారత్న అవార్డులను ప్రకటిస్తారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్-2023 ను పురస్కరించుకొని, పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
అదేవిధంగా ఈ సంవత్సరముకు గానూ వివిధ రంగాలల్లో సేవలందించిన మహోన్నతమైన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా విద్యారంగంలో సేవకు గాను నల్లగొండ జిల్లా కు చెందిన అధ్యాపకుడు మామిడి లింగస్వామి ని విద్యాసేవారత్న అవార్డు కు ఎంపిక చేసి త్యాగరాయ గానసభ లో అవార్డును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గీత రచయిత డాక్టరు సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. ప్రముఖ న్యూమరాలజిస్టు దైవజ్ఞశర్మ మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమా చేతుల మీదుగా విద్యా సేవారత్న అవార్డును అందచేశారు. అవార్డు గ్రహీత మామిడి లింగస్వామి మాట్లాడుతూ.. ముందుగా నాకు విద్యా నేర్పి, నన్ను తీర్చిదిద్దిన గురువులందరికి నా నమస్కారాలు పాదాబివందానాలు. 'విద్యాసేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నన్ను చదివించిన తల్లిదండ్రులకు ఎప్పటికి ఋణపడి ఉంటానని, పేదరికంలో అణగారిన వర్గంలో ఉన్న నన్ను గుర్తించి అవార్డును ప్రదానం చేసిన జగతి ఆర్ట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని తెలిపారు

















నల్లగొండ జిల్లా: 

బహుజన రాజ్యం బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని, నకిరేకల్ బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్ధి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం మొడుగు గూడెం, గోరింకలపల్లి, గ్రామాలల్లో ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లు నిర్మించినా.. పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.

Nov 17 2023, 15:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.5k