మునుగోడు: ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు పట్టణంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రతి గడప గడప కు వెళ్లి, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మునుగోడు లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.
570 కోట్ల రూపాయలతో మునుగోడు ప్రగతికి పునాదులు వేశామని, ప్రతి ఇంటికి సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీలు ఏర్పాటు చేశామని, నూతనంగా హాస్పిటల్ లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నానని, మీలో ఒక కుటుంబ సభ్యుడీగా సేవ చేస్తున్నానని, మరొక్క సారి అవకాశం ఇస్తే మునుగోడును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.











నల్లగొండ జిల్లా: 

బహుజన రాజ్యం బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని, నకిరేకల్ బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్ధి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం మొడుగు గూడెం, గోరింకలపల్లి, గ్రామాలల్లో ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లు నిర్మించినా.. పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.






Nov 16 2023, 10:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.9k