సూర్యాపేటలో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు..
కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు
బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు
మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు
బారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి
చివ్వేంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో బిజెపి , కాంగ్రెస్ లు ఖాళీ
అభివృద్ధి కి ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరికలు
గులాబీ కండువాలతో స్వాగతం పలికిన మంత్రి
సూర్యాపేట
సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.


కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు


ఎన్నికలకోడ్
బిఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్
ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో పట్టున్న నేతగా కాసాని జ్ఞానేశ్వర్‌కు గుర్తింపు ఉన్నది.
వాట్సాప్‌లో మెసేజ్ చేసినా వెళ్లడం లేదా.. కారణమిదేనేమో! 
ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా పాటలను రిలీజ్ చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు
రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్ మహిళల కోసమే
చేరికల హోరు .. బీఆర్‌ఎస్ జోరు
డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌందర్యరాజన్ ఆద్వర్యం లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పద్మ శ్రీ డా. శాంతన్ నారాయణ్ ఎడోబ్ అమెరికా సిఇవొ, మరియు ప్రో. రవీందర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డ్ అందుకున్నారు. వీరు గ్రూప్ 1 లో సైతం సెలక్ట్ కావడం తో పరమేష్ ను 35 వ వార్డులో జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు జ్యోతి కరుణాకర్, పిఆర్ టియు జిల్లా కార్యదర్శి లింగయ్య తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్ నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
ఈ సందర్భంగా మున్నా మధు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కు తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కొల్లూరి ఈ దయ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు
Nov 04 2023, 18:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.7k