చేరికల హోరు .. బీఆర్‌ఎస్‌ జోరు

చేరికల హోరు .. బీఆర్‌ఎస్‌ జోరు

మున్సిపల్ చైర్మన్ వార్డ్ లో ప్రతి పక్షాలు ఖాలీ 

మంత్రి జగదీష్ రెడ్డి కే మా మద్దతు అంటున్న యువత

సూర్యాపేట పట్టణం లోనీ 9, 21వ వార్డ్ లనుండి భారీగా చేరిక

కాంగ్రెస్, బిజెపి లను వీడి బీఆర్ఎస్ లో చేరిన 400 మంది యువకులు, మహిళలు

గులాబి కండువా తో స్వాగతం పలికిన మంత్రి

మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, అబ్దుల్ రహీమ్ ఆద్వర్యం లో చేరిక

డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్

డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కిన్నెర పరమేష్  జాతీయస్థాయి యుజిసి - జెఆర్ ఎఫ్ పరీక్షలో అర్హత సాధిoచి చరిత్ర విభాగంలో "తెలంగాణలో కోయ జాతి - సామాజిక ,ఆర్ధిక పరిస్థితులు" అనే అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  లో  పిహెచ్ డి పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌందర్యరాజన్ ఆద్వర్యం లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పద్మ శ్రీ డా. శాంతన్ నారాయణ్ ఎడోబ్ అమెరికా సిఇవొ, మరియు ప్రో. రవీందర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డ్ అందుకున్నారు. వీరు గ్రూప్ 1 లో సైతం సెలక్ట్ కావడం తో  పరమేష్ ను 35 వ వార్డులో జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు జ్యోతి కరుణాకర్, పిఆర్ టియు జిల్లా కార్యదర్శి లింగయ్య తో పాటు పలువురు ప్రముఖులు అభి‌నందనలు తెలిపారు.

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్ నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా చివ్వెంల మండలం గుంపుల గ్రామానికి చెందిన మున్నా మధు యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మున్న మధు యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మున్నా మధు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కు తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కొల్లూరి ఈ దయ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు

ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

[11/1, 10:25 PM] miryalakirankumar89: Telangana | ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే శాఖ కూడా అవడంతో రిలాక్సేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

TS: నామినేషన్ దాఖలుకు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10వేలు, SC, ST అభ్యర్థులు రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా 4సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. అఫిడవిట్ను అసంపూర్తిగా నింపి ఇస్తే, దానిని సవరించాలని అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులిస్తారు. ఒకవేళ అభ్యర్థి నోటీసులకు స్పందించకపోతే నామినేషన్ తిరస్కరించే అధికారం ఆ అధికారికి ఉంటుంది.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన&విద్యార్థి నాయకులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన&విద్యార్థి నాయకులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన నాయకుడు ఆలకుంట్ల శేఖర్ గారికి బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఈరోజు వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరియు నల్గొండ పట్టణంలో విద్యార్థి విభాగం నాయకుడు ఎండి షోయాబ్ గారి తండ్రి ఇటీవలి కాలంలో మరణించగా పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి తండ్రి గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు. 

ఈ కార్యక్రమంలో

సర్పంచ్ భాస్కర్ రెడ్డి,మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి,సుంకుషాల రవి,మైనం యుగేందర్,బొంత అంజిబాబు,కంచర్ల రఘురాం రెడ్డి,ఆలకుంట్ల సైదులు,మైనం మధు కట్టా శ్రీనివాస్,కొండాపురం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

వివిధ పార్టీల నుండి నల్గొండ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు..

వివిధ పార్టీల నుండి నల్గొండ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్, గారు రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గారు ఆస్ట్రేలియా NRI వినయ్ సన్నీ గౌడ్ గారు కోండురు సత్యనారాయణ గారుఆధ్వర్యంలో 24 వ వార్డు కు చెందిన 100 మంది కార్యకర్తలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది..

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు

చేరిన వారు కత్తుల యశ్వంత్, చంటి, సిద్దూ, సాయి, బబ్లు, గణేష్, మహేష్, నితిన్, మని, సాయి గిరి వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు:

ఈరోజు బీరంగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యతలపై అవగాహన కల్పించడంలో భాగంగా "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క పాఠ్యాంశాలలో ఉన్న అంశాలతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ విద్య లో తప్పక నైపుణ్యత కలిగి ఉండేటట్లుగా కృషి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ విద్య కు సంబంధించిన ప్రాథమిక అవగాహన కొరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా తరగతుల నిర్వహణ త్వరలోనే జరుపుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత గారు, ఉపాధ్యాయురాలు స్రవంతి  తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల ఆశయాలపై పోరాడుదాం:న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

అమరవీరుల ఆశయాల కై పోరాడుదాం.అమరవీరుల ఫొటోలకు స్థూపలకు పూల మాలలతో చర్ల మండలంలో నివాళులర్పించిన న్యూడెమోక్రసీ శ్రేణులు.

 CPI (M-L) న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ అమరవీరులకు

పూల మాలలతో విప్లవ జోహార్లు చర్ల మండలం ప్రజలతో నాయకులతో అర్పిండం జరిగింది  న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ 

 భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను నులివెచనైనా రక్తాన్ని అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని,ఉద్యోగాలని,కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డి పోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడే ఆదివాసి,గిరిజన,దళితులకు హక్కులను తెలియజేసి లక్షలాది ఎకరాల భూములను పంచి వెనకబడిన గ్రామాలకు విద్య, వైద్యం, విద్యుత్తు, రోడ్డు, రవాణా, కనీస సౌకర్యాల కోసమే పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర ఈ నక్సల్ల్బారి ,

ప్రతిఘటన ఉద్యమానిదేనని వారన్నారు.కామ్రేడ్ వెంపటాపు సత్యం,ఆదిభట్ల కైలాసం,భత్తుల వెంకటేశ్వరరావు,

నీలం రామచంద్రయ్య,

పొట్ల రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నుండి మొదలుకొని గుండాలలో జరిగిన కామ్రేడ్ పూనెం లింగన్న ఎన్ కౌంటర్ వరకు ఎందరో వీరులు ప్రాణాలు ఇచ్చారని వారన్నారు. నల్లగొండ జిల్లాలో కామ్రేడ్ యానాల మల్లారెడ్డి,విక్రమన్న,వీరారెడ్డి, బూరుగు అంజన్న,పలస బిక్షం,జెన్ను సార్,తోట సోమన్న లాంటి ఎందరో అమరులయ్యారని, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాట చరిత్ర ఉందని అది నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని వారన్నారు అమరవీరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు. విప్లవకారుల పోరాటాలను చరిత్రను,నక్సల్ భరీ పోరాటాలను చరిత్రను,అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని విద్యార్థి,యువకులు అమరుల ఆశయాలతో రాబోయే తరానికి కాబోయే వారసులుగా నిలబడాలని ఉద్యమాలకు ఊపిరిగా నిలబడాలని పిలుపునిచ్చారు.అమరవీరుల స్పూర్తితో BRS మతోన్మాద BJP దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని సతీష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కణితి బానుప్రకాష్ బొర్ర సమ్మక్క సప్కా నాగలక్ష్మి ఇర్ప సమ్మక్క కనకమ్మ నాగలక్ష్మి సీతమ్మ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా ఒకపక్క తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార విపక్షాలు ఎవరికి వారు పోటాపొటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పదవులు పొందాలని అభ్యర్థులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.. ఓటర్ల మెప్పుకోసం తలకిందులుగా తపస్సులు చేస్తున్నారు! ఈ సమయంలో గుడిలో విగ్రహం కోసం ఉన్న పదవిని వేళానికి పెట్టాడు ఒక సర్పంచ్.. ఆ వెలంలో వచ్చిన సొమ్ముతో ఆ గ్రామంలోని గుడిలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాడు.

అవును... గ్రామంలో కొత్తగా కట్టిన పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏకంగా తన పదవిని వేలానికి పెట్టారు ఒక సర్పంచ్. విగ్రహ ప్రతిష్ఠకు సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని లెక్క కట్టి మరీ వేలం పాట నిర్వహించడం మరొకెత్తు. దీంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. ఎన్నికల సీజన్, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది!


వివరాళ్లోకి వెళ్తే... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం అంకుషాపురంగ్రామంలో కొత్తగా పోచమ్మ గుడి కట్టారు. అయితే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. చందాలు వేసుకొని పోచమ్మ గుడి అయితే నిర్మించుకున్నాం కానీ.. మళ్లీ అంతపెద్దమొత్తంలో విగ్రహానికంటే కష్టం అనే మాటలు వినిపించాయి!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకూ సేకరించిన చందాల ద్వారా వచ్చిన మొత్తం గుడి నిర్మాణానికే సరిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు.

దీంతో... గ్రామంలోని పెద్దలంతా స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని వేలం పాట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3 లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేల దగ్గర ముగిసింది. పాటలో ఆరుగురు పాల్గొనగా.. ఓ కుల సంఘం పెద్ద ఈ పదవి దక్కించుకున్నాడని అంటున్నారు! దీంతో విషయం అధికారులకు చేరింది.. మేటర్ సీరియస్ అయ్యిందని సమాచారం.

ముందుగా ఈ వేలంపాట విషయాలు పంచాయతీ సెక్రటరీకి తెలిసాయని, న్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో)కి సమాచారం అందించారని సమాచారం. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఎస్ఐ సిబ్బందిని పంపించగా.. అప్పటికే అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో... ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో చెబుతున్నారు.