Mane Praveen

Aug 09 2023, 16:32

NLG: మంత్రిని కలిసిన చర్లగూడెం భూ నిర్వాసితులు

మర్రిగూడెం: మండలంలోని చర్లగూడెం  భూ నిర్వాసితులు బుధవారం హైదరాబాదులో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తమకు  పునరావాస ఇంటి స్థలం, ఉపాధి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వారం పది రోజుల్లో పునరావాస ఇంటి స్థలాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లగూడ గ్రామస్తులు వల్లపుదాస్ కేశవ్ గౌడ్, సంకబుడ్డి శ్రీనివాస్ యాదవ్, తొడేటి వెంకన్న, ఎరుకల శేఖర్ గౌడ్, శంకరయ్య, ముంత నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 09 2023, 14:48

NLG: గృహలక్ష్మి దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక
మర్రిగూడెం: గృహలక్ష్మి పథకానికి చివరి తేదీ ఈ నెల 10. రేపే చివరి తేదీ కావడంతో, దరఖాస్తుదారులు మీసేవ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, అప్లికేషన్ ఫారాలను నింపుతూ హడావిడిగా ఉన్నారు. దరఖాస్తు ఫారం లో కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికెట్ అని ఉండగా అభ్యర్థులు ఆందోళన చెందుతూ.. కులం ఆదాయం సర్టిఫికెట్లు అప్లై చేయడానికి, మీసేవ సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే మర్రిగూడ మండల ఎమ్మార్వో మహేందర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. గృహలక్ష్మి దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థులు తమ వద్ద ఉన్న పత్రాలను జతచేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. కులం ఆదాయ సర్టిఫికెట్ వెంటనే తీయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటివి ప్రస్తుతం అభ్యర్థుల దగ్గర ఉన్న సర్టిఫికెట్లను జత చేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. తర్వాత వెరిఫికేషన్ సమయంలో  మిగతా సర్టిఫికెట్లు అందిస్తే సరిపోతుందని అన్నారు.

Mane Praveen

Aug 08 2023, 22:01

పెద్దవూర: నూతన ఎస్సై అజ్మీరా రమేష్ నాయక్ కు ఘన సన్మానం
నల్గొండ జిల్లా, పెద్దవూర మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అజ్మీరా రమేష్ నాయక్ ను మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి,  వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో పెద్దవూర మండల బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుడుం రాకేష్, సంగారం 11వ వార్డు మెంబర్ తరి వెంకటయ్య, పోతునూరు ప్రధాన కార్యదర్శి ఎర్ర చంద్రయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వంగూరి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 08 2023, 21:47

NLG: కస్తూరిబా బాలికల విద్యాలయాలకు చేయుతనిస్తున్న కస్తూరి ఫౌండేషన్
గుర్రంపోడ్: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా కస్తూరి ఫౌండేషన్ వారు తెలుసుకొని సుమారు 3 లక్షల వ్యయంతో సానిటరీ వర్క్స్ మరమ్మత్తులు చేపట్టినారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో పుష్పలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ఘన సన్మానం నిర్వహించారు. శ్రీ చరణ్ మాట్లాడుతూ.. 2017లో కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించినపుడు విద్యారంగాన్ని సేవా రంగంగా ఎంచుకొని 6 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో తమ ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ.. మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులకు సూచించారు. మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారన్నారు. కస్తూరి శ్రీ చరణ్  చేతుల మీదగా  పాఠశాలోని విద్యార్దినులకు స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్, గ్రామర్ బుక్స్, డిక్షనరీ బుక్స్, మైక్ సెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, మహేష్, పిన్నింటి నరేందర్ రెడ్డి, సమ్మిడి నవీన్ రెడ్డి, వీరమళ్ల కార్తీక్ గౌడ్, రవి, టీచర్లు హేమలత, జ్యోతి, కవిత, ఉమాదేవి, నేహా, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 08 2023, 21:15

చౌటుప్పల్: జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం నియోజకవర్గంలోని యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 మరియు 13 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మేల్యే అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులైన చౌటుప్పల్ మెయిన్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను ఎమ్మేల్యే పర్యవేక్షించారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 08 2023, 19:48

NLG: గట్టు నెమలిపూర్ రైతుల సమస్యలు పరిష్కరించాలి: రామావత్ రమేష్ నాయక్
నల్లగొండ జిల్లా, పెద్దఅడిశర్లపల్లి: బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్, పెద్ద అడిశర్లపల్లి మండలంలోని గట్టునెమలిపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు, వారి సమస్యను రామావత్ రమేష్ నాయక్ దృష్టికి తీసుకెళ్ళారు, వారి సమస్యను విని అనంతరం రామావత్ రమేష్ మాట్లాడుతూ..   ధరణి అనే పోర్టల్ తీసుకువచ్చి, ధరణి పొరపాట్ల వల్ల, రైతుల్ని పొలాల్లో ఉండనివ్వకుండా ఎమ్మార్వో ఆఫీసులో చుట్టూ తిరిగేటట్టు చేసిన ప్రభుత్వం తప్పిదం వల్ల, ఎంతో మంది రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గట్టు నెమలిపూర్ గ్రామస్తుల భూ సమస్యను పరిష్కరించాలని, లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ ఆర్డీవో ఆఫీస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాలునాయాక్, సాయి, లోకేష్, కృష్ణయ్య, దత్తు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 08 2023, 17:31

చర్లపల్లి: గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు స్పాట్ అడ్మిషన్స్
నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు, స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్.కె. సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. 2023- 2024 విద్యాసంవత్సరానికి గాను  మొదటి సంవత్సరం ఎంపిసి, ఎం.ఎస్.డి.ఎస్, ఎం.ఎస్.సి.ఎస్, ఎం.పి.సి.ఎస్ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుందని, 2022- 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థినిలు.. తమ ధ్రువీకరణ పత్రాలతో కళాశాల లో తేదీ 09-08-2023 నుండి 10-8-2023 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 11-8-2023 న మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.

Mane Praveen

Aug 08 2023, 16:02

NLG: లెంకలపల్లిలో తల్లిపాల వారోత్సవాలు
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పద్మ మాట్లాడుతూ.. శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల, శిశువు ఆరోగ్య ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు.   స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ, ఆశా వర్కర్లు ఏర్పుల పద్మ, సైదాబీ, మహిళా సంఘం సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 08 2023, 07:29

ప్రజా యుద్ధనౌక' ప్రయాణాన్ని కొనసాగిద్దాం: టివివి, డిటిఎఫ్, కెవిపిఎస్ నేతలు
NLG: రాజ్య హింస పైన, ప్రజా సమస్యలపై ప్రజా ఆకాంక్షల కోసం రాజ్యంతో యుద్ధం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రయాణాన్ని కొనసాగిద్దామని డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. గద్దర్ అకాల మరణం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం గద్దర్ చిత్ర పటం ముందు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన గళంతో ఉర్రూతలూగించి, కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న  ప్రజా ఉద్యమ గొంతుక మూగబోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. నాలుగు దశాబ్దాల పోరాట జీవితంలో, ఏనాడు కూడా పాలకులకు తలవంచ లేదన్నారు. గద్దర్ ఆడితే తెలంగాణ ఆడిందని, గద్దర్ పాడితే తెలంగాణ పాడిందని, గద్దర్ కదిలితే తెలంగాణ యావత్ సమాజం కదిలిందన్నారు. ఎంతోమంది కవులను, కళాకారులను తయారుచేసి తెలంగాణ ఉద్యమానికి అందించిన గొప్ప యోధుడు గద్దర్ అన్నారు. సాంస్కృతిక విప్లవోద్యమానికి గద్దర్ చేసిన మార్గ నిర్దేశం విప్లవ పోరాటాలలో మైలురాయి గా నిలిచిందని అన్నారు. అజ్ఞాతంలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా, నిరంతరం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నారు. తన జీవిత ప్రయాణంలో ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యను పాట రూపంలోకి మలిచి ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో గద్దర్ దిట్ట అన్నారు. రాజ్యం తుపాకితో కాల్చినా, హత్య చేయడానికి ప్రయత్నం చేసినా, సమాజంలో జరుగుతున్న ఆడపిల్లల హత్యల పైన, అత్యాచారాల పైన, దోపిడీ పీడల పైన గొంతు విప్పడంలో ఏనాడు వెనకంజ వేయలేదని తెలిపారు. గద్దర్ హృదయం ఉద్యమాల హృదయముగా పేరుగాంచిందన్నారు. గద్దర్ పోరాట పఠిమను, వారి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల పై ఉందని అన్నారు. గద్దర్ ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణలోని కవులు, కళాకారులు మేధావులు, విద్యావంతులు, బుద్ది జీవులందరి పైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖుర్షీద్ మీయా, పి.వెంకులు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, కార్యదర్శి పెరుమాల వెంకటేశం, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాశయ్య, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ఏఎం.ఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ చిన్న, ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, కత్తుల చందన్, సోహేల్, సామాజిక కార్యకర్త పలస యాదగిరి, డి టి ఎఫ్ జిల్లా బాధ్యులు టి.వెంకటేశ్వర్లు, ఈద అంజయ్య, ఇమ్మడి జగతి, కె.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 20:33

TS: గద్దర్ పార్ధీవదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
హైద‌రాబాద్: ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్ధీవదేహానికి సోమవారం సాయంత్రం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌ లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సిఎం కేసీఆర్ చేరుకొని గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించి, వారి కుటుంబ స‌భ్యులను ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి బాల‌కిష‌న్,  బాల్క సుమ‌న్, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, తదితరులు  నివాళుల‌ర్పించారు.