Mane Praveen

Aug 06 2023, 20:44

ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్లు: వేముల గోపీనాథ్  
ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్లు: వేముల గోపీనాథ్   నల్గొండ : సుదీర్ఘ కాలం పాటు విప్లవోద్యమం తో పాటు, ప్రజా ఉద్యమాలలో సాంస్కృతిక ఉద్యమాన్ని రగిలించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బుల్లెట్ లను  సైతం లెక్కచేయకుండా అలుపెరగని ప్రజా యుద్ధ పోరాట యోధుడు గద్దర్ అన్న మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వేముల గోపినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. గోపీనాథ్ ఆదివారం  మాట్లాడుతూ.. గద్దర్ అన్న మృతి పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ కు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా పేరు భావించబడిన గద్దర్, మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత గద్దర్ అన్న తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ వనరులు మాకే దక్కాలని.. మా నీళ్లు.. మా నిధులు.. మాకే దక్కాలని, గొంతు ఎత్తి ప్రతినిత్యం పాట పాడే ప్రజా గాయకుడు గొంతు మూగబోవడం, ఆయన లేని లోటు తీరనిదని, ప్రజా సమస్యలను పాలకులకు చేరవేయడంలో గద్దర్ అన్న పోరాటం  మరువలేనిది అన్నారు.

Mane Praveen

Aug 06 2023, 13:08

NLG: బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ 89వ జయంతి
నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి అని గౌరీశంకర్ అన్నారు. బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 89 వ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి.. తెలుగు అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్, టీఎన్జీవో నాయకులు శ్రవణ్ కుమార్, శ్రీనివాసాచారి, కిరణ్ కుమార్, ప్రదీప్ , కవులు రచయితలు మునాస వెంకన్న, కృష్ణకౌడిన్య, బుచ్చిరెడ్డి, వివిధ హోదాల ప్రజా ప్రతినిధులు  మరియు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు.  ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ అంచలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయ్యారన్నారు. అందరి హృదయాలలో నిలిన మహోన్నత వ్యక్తి ప్రో. జయశంకర్ సార్ అని అన్నారు.

Mane Praveen

Aug 06 2023, 12:28

NLG: ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 89వ జయంతి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రోపెసర్ కొత్తపల్లి జయశంకర్  89వ జయంతి కార్యక్రమాన్ని, జాతీయ సేవా పథకం మరియు వ్యాయమ విద్యా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. NSS PO యాదగిరి రెడ్డి, పిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, డా. కృష్ణ కౌండిన్య, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 22:36

ఎల్ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ ను విజయవంతం చేయాలి: బుర్రి వెంకన్న
TS: బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, ఆదివారం   హైదరాబాదులోని సైఫాబాద్ లో, సామ్రాట్ కమర్షియల్ కాంప్లెక్స్ యందు గల ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ లో జరగనున్న  'ఎల్ ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ' ను దిగ్విజయం చేయాలను, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఉద్యమ సన్నిహితుడు ఎల్ఆర్ బాలే,  పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నవాన్ షహర్ జిల్లాలోని షాహిద్ భగత్ సింగ్ నగర్ లో 1930లో జూలై 20న జన్మించారు. ఎల్ ఆర్ బాలే ఢిల్లీలో తపాల శాఖలో పని చేసేవారు. ఆయనకు ప్రతి సాయంత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ ను కలుసుకునే అవకాశం కలిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవనశైలి, దినచర్య, పుస్తక పఠనం రచన, వ్యాసంగం, సంభాషణ ఇవన్నీ సమీపము నుంచి పరిశీలించి ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడినారని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పని చేయడానికి ఎల్ ఆర్ బాలే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 1958 లో భీమ్ పత్రిక పక్ష పత్రికను ప్రారంభించారు. అలాంటి గొప్ప అంబేద్కర్ వాది ఎల్ఆర్ బాలే గారి సంతాప సభను  హైదరాబాదులో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని బుర్రి వెంకన్న తెలిపారు.

ఈ సంతాప సభకు మాజీ జాతీయ అధ్యక్షులు బాబా సాహెబ్ అంబేద్కర్ తో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తులు కూడా వస్తున్నారని వారు తెలియజేశారు.  అంబేద్కర్ వాదులంతా విచ్చేసి ఈ  సంతాప సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక దళ్ సంస్థలో పనిచేయడం చాలా గర్వకారణమని అన్నారు.

Mane Praveen

Aug 05 2023, 21:42

నల్లగొండ జిల్లా కోర్టులో భూ చట్టాలపై వర్క్ షాప్
నల్లగొండ: జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం 'LAND AND REVENUE LAWS' (భూమి మరియు రెవెన్యూ చట్టాలు) పై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు ముఖ్యఅతిథిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూమి సునీల్ కుమార్ స్పీకర్ గా విచ్చేసి మాట్లాడుతూ.. రెవెన్యూ అమెండ్మెంట్స్, రెవెన్యూ చట్టాల మీద క్లుప్తం గా వివరించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు ఏ.జయరాజు, బి.తిరుపతి, జి.సంపూర్ణ ఆనంద్, ఇతర న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి, ప్రధాన కార్యదర్శి జెనిగల రవికుమార్, సీనియర్ న్యాయవాదులు ఏ.సతీష్ కుమార్, ఎం.ఆదిరెడ్డి, మామిడి ప్రమీల, జెనిగల రాములు, ఇతర న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 19:07

పిడిఎస్యు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించాలి: మధు
నల్గొండ: పట్టణంలో  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడించిన పిడిఎస్యు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించాలని పి.డి.ఎస్.యు  జిల్లా ఉపాధ్యక్షుడు మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న 5వేల కోట్ల పైచిలుకు స్కాలర్ షిప్స్, రీయంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చేయాలని, DSE డైరెక్టర్ దేవసేన ప్రభుత్వ విద్య సంస్థల్లోకి మీడియాను/విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని, సంక్షేమ హాస్టళ్స్ సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యాసంస్థలు/ప్రైవేటు యూనివర్సిటీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అభివృద్ది చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడించిన పిడిఎస్యు నాయకులను విడుదల చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమం లో నాగేంద్రబాబు, నరేష్, గౌతమ్  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 18:47

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నల్లగొండలో రెండు రోజుల దీక్ష ప్రారంభం
నల్లగొండ: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని  చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, శనివారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ  మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్.. ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి., డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే SC / ST / BC / EBC విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ రేటు రూ. 1800/- నుండి 15,000/- రూపాయలకు పెంచాలి.
SC / ST / BC కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/ - రూపాయలకు, పాఠశాల SC / ST / BC హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/ - నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బి.సి.లకు 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతున్నామని, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని జనార్దన్ గౌడ్ అన్నారు. అదేవిధంగా SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టెఫాండు" మంజూరు చేయాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి.
బి.సి. స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి శివకుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయితరాజు సిద్దు ,కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపెళ్లి గౌతమ్, మనీ, పృద్వి, మౌనిక, మనీషా, లక్ష్మి , శ్రీదేవి, సౌందర్య, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, రమేష్ ఆక మహేష్, అబ్బనబోయిన స్వామి, కిరణ్, అంజి, మహేష్, రాజు  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 06:35

TS: నూతనంగా పోస్టులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులు గా గుర్తించింది. అదే విధంగా పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టుల కు అసెంబ్లీ సమావేశాల్లో  రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది విఆర్‌ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్‌ను వర్తింప జేసింది.

Mane Praveen

Aug 05 2023, 05:58

నల్గొండ: నూతన డిఎస్పి ని కలిసిన జిల్లా మైనార్టీ నాయకులు
నల్గొండ:  పట్టణంలో నల్గొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ని, శుక్రవారం సాయంత్రం  నల్లగొండ జిల్లా 'యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్'  మైనార్టీ నాయకులు  మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు  డీఎస్పీ  ని శాలువాతో సత్కరించి, స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ అధ్యక్షుడు నజీర్, జావిద్, రియాజ్, అబ్దుల్ మాజిద్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 04 2023, 22:18

NLG: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా జాతీయ ర‌హ‌దారి 65 పై మ‌ల్కాపూర్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ని ఏర్పాటు చేయాల‌ని ప్రధాన మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.