NLG: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా జాతీయ ర‌హ‌దారి 65 పై మ‌ల్కాపూర్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ని ఏర్పాటు చేయాల‌ని ప్రధాన మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

NLG: విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం: బీసీ విద్యార్థి సంఘం
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో  నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీక్షని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు  అయితగోని జనార్దన్ గౌడ్  కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే  విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ ను పెంచాలి. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/- రూపాయలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/- నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బిసి గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతూ, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని అన్నారు.

SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టైఫండ్" మంజూరు చేయాలి.
బిసి సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి
బి.సి స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలోనల్గొండ మండల వైస్ ఎంపీపీ జిల్లాపళ్లి పరమేష్, యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీ చందు యాదవ్, కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపల్లి గౌతమ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్ ,రమేష్, మహేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు..
విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఎంఈఓ కు వినతి
నల్లగొండ జిల్లా, దేవరకొండ: సమస్యలు పరిష్కారం చేయకుండా 'విద్యాసంస్థల్లోకి  విద్యార్థి సంఘాలు, మీడియా  రావొద్దని' నోటిసులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి  బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో‌, కెజిబివిలలో పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు. ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.

కేజీబీవి, మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు, లెక్చరర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, జిల్లాలో కేజీబీవి పాఠశాలలో ఉండాల్సిన సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు, కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ అన్నారు.

రాష్ట్రంలో 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు, తప్ప కనీసం విచారణ లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన  తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా,  మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని, తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్, దేవరకొండ మండలం కుర్ర రాహుల్, మూడవత్ వినోద్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు
నిడమనూరు: ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
నల్లగొండ: జిల్లా నిడమనూరు మండలంలో సెకండ్ ఏఎన్ఎం లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎమ్ లను,  శుక్రవారం పోలీసులు   హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేస్తున్న తమ ను  జీవో నెంబర్ 16 ప్రకారం, హెల్త్ అసిస్టెంట్ లను ఏ రకంగానయితే రెగ్యులర్ చేశారో అదేవిధంగా  రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు సెకండ్ ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేశారు.

ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను,  ఇబ్బందులను  ఇప్పటికే చాలాసార్లు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించామని, తమ విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఏఎన్ఎంలు సుచిత్ర, మంజుల ఉన్నారు.



నులిపురుగుల వ్యాధి నివారణ మాత్రలు పంపిణీ చేసిన సర్పంచ్ పాక నగేష్ యాదవ్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం  మండలం లెంకలపల్లి గ్రామంలో, జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా.. మండల ప్రభుత్వ ఆసుపత్రి సూచనల మేరకు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్  మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగుల వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో మేతరి శంకర్, ఏఎన్ఎం నక్క జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, స్కూల్ హెడ్మాస్టర్ యాదగిరి, ఉపాధ్యాయుడు యాదయ్య, టీచర్ అపర్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
గట్టుప్పల్: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మునుగోడు: నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ చేయడం పట్ల.. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గట్టుప్పల్ చౌరస్తాలో,  సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసరెడ్డి గట్టుప్పల్ లోని 15 యూత్ అసోసియేషన్లకు మరియు హై స్కూల్ లోని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు క్షేమం కోరుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, రైతుల కష్టాల గురించి సీఎం కెసిఆర్ కు తెలుసు కాబట్టే రైతు బందు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.
రైతులకు బ్యాంకు లలో ఉన్నటువంటి క్రాప్ లోన్ లను లక్ష వరకు మాఫీ చెయ్యడం పట్ల తెలంగాణ రైతాంగం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలలో విజయాలు సాధించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని అన్నారు.
నల్లగొండలో బహుజన విద్యార్థి గర్జన పోస్టర్ ఆవిష్కణ
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ
కళాశాలలో స్వెరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ మరియు స్వెరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్  గురువారం కళాశాల విద్యార్థులతో కలిసి, ఎస్టీ ఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ చేతుల మీదుగా, ఆగస్టు 10న నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో జరగబోయే బహుజన విద్యార్థి గర్జన
పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో బహుజన విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
108, 102 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
యాదాద్రి జిల్లా: భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండల కేంద్రంలో  నూతన 108, 102 అంబులెన్స్ వాహనాలను  భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీబీ నగర్  ప్రజలకు,  ఈ అంబులెన్స్ వాహనాలు 24 గంటలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: శాసనసభ సమావేశంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి: జనార్దన్ గౌడ్
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న బిసి ఏ  సంక్షేమ హాస్టల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మొదటగా విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి, బిసి సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంతభవనాలు ఎర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని,  ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన చేసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వాన్ని, పోరాట పట్టిమ పెంచుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించకపోవడం చాలా దుదుష్టకరమని  ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిరంతరం విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారని, సంక్షేమ వసతి గృహాలైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందంటే  ఆర్ కృష్ణయ్య  పోరాట ఫలితమే అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంక్షేమ కమిటీలు వేస్తామని అన్నారు. ఈరోజు బీసీ ఏ హాస్టల్లో కమిటీని వేయడం జరిగింది. హాస్టల్ అధ్యక్షుడిగా ఏ. వేణు, ఉపాధ్యక్షుడిగా కే. నాగరాజు, జనరల్ సెక్రెటరీగా కే .హరీష్ , సెక్రటరీగా బి .ఉదయ శంకర్ ,కార్యదర్శిగా వి .అఖిల్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు  కొంపల్లి రామన్న గౌడ్, మహేష్, కుమార్, సురేష్ , పృధ్విరాజ్, శంకర్ మణికంఠ, రమేష్, రాఘవేంద్ర, హరి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
HYD: జాతీయ స్థాయి పోటీల్లో నిజాంపేట్ విద్యార్థికి కాంస్య పతకం
హైద్రాబాద్: జూలై 28 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో రాజధాని లో జరిగిన ఆరవ టైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్ - 2023 లో  ఛాంపియన్స్ మార్షల్ ఫిట్నెస్ అకాడమీ  నిజాంపేట్ విద్యార్థిని నాగసాయి అరుషి (14).. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి  కాంస్య పతకం సాగించడం పట్ల, తెలంగాణ హోం మినిస్టర్  మొహమ్మద్ మహమూద్ ఆలీ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బుధవారం  నాగసాయి అరుషి  ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ మధుసూదన్, అసిస్టెంట్ కోచ్ బన్నీ అరుణ్, తల్లిదండ్రులు పవన్ కుమార్, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.