NLG: విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని, విద్య అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర విద్యారంగ ప్రగతి అగిపోయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు.
నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర ఆదివారం దేవరకొండ కు వచ్చిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడులు మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లకు నోట్ బుక్ లు, యూనిఫామ్, పెట్టెలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, లెక్చరర్స్ లేరని గెస్ట్ లెక్చరర్స్ కు రెన్యూవల్ చేయలేదని, అన్నారు. గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనీ, సరైన సౌకర్యాలు లేక సరిపడా ముత్రశాలలు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆర్బాటాలు చేసి ఇప్పటీకీ పెంచిన మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24,000 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదని, పాఠ్యపుస్తకాలు లేకుండా, టీచర్లు లేకుండ ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. హస్టల్స్ విద్యార్ధులకు నెలకు అబ్బాయిలకు 62/- రూపాయలు, అమ్మాయిలకు 100/- రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థులు తమ అవసరాల ఆ డబ్బులు ఎలా సరిపోతాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి గురించి సాక్షతూ కెసిఆర్ మనుమడే ఈ మద్య చెప్పాడని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేసి కార్పోరేట్ ఫీజులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్ షిప్స్ & రీయంబర్స్ మెంట్స్ 5,177 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ మహత్మ గాంధీ యూనివర్శిటీకి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఛలో హైదరాబాద్ కార్యక్రమాని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ యాత్ర క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులు తెలుసుకోని, జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన లు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, కోర్ర సైదా నాయక్, రవిందర్, జగన్ రవి, అనిల్, వీరన్న, సాయి సంపత్, చంద్, నవదీప్, శ్రవణ్, రాహుల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ జిల్లా, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని, విద్య అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర విద్యారంగ ప్రగతి అగిపోయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు.
నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర ఆదివారం దేవరకొండ కు వచ్చిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడులు మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లకు నోట్ బుక్ లు, యూనిఫామ్, పెట్టెలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, లెక్చరర్స్ లేరని గెస్ట్ లెక్చరర్స్ కు రెన్యూవల్ చేయలేదని, అన్నారు. గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనీ, సరైన సౌకర్యాలు లేక సరిపడా ముత్రశాలలు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆర్బాటాలు చేసి ఇప్పటీకీ పెంచిన మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24,000 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదని, పాఠ్యపుస్తకాలు లేకుండా, టీచర్లు లేకుండ ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. హస్టల్స్ విద్యార్ధులకు నెలకు అబ్బాయిలకు 62/- రూపాయలు, అమ్మాయిలకు 100/- రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థులు తమ అవసరాల ఆ డబ్బులు ఎలా సరిపోతాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి గురించి సాక్షతూ కెసిఆర్ మనుమడే ఈ మద్య చెప్పాడని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేసి కార్పోరేట్ ఫీజులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు.

మణిపూర్ లో ఇటీవల గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ, ఆలిండియా సమతా సైనిక్ దళ్ మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ మాట్లాడుతూ.. మణిపూర్ లో జరిగిన అత్యంత పాశవిక ఘటనలో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేయడం దుర్మార్గం అని అన్నారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని, సభ్య సమాజం తలదించుకొనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
నల్లగొండ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధులు చేపట్టిన సిఐ జి. సత్యనారాయణ ను బిఆర్‌ఎస్‌వి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి, వారిని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్ర పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వి టౌన్ ప్రెసిడెంట్ అంబటి ప్రణీత్, బిఆర్‌ఎస్‌వి టౌన్ జనరల్ సెక్రటరీ కందుల సంపత్ కుమార్,
బిఆర్‌ఎస్‌వి టౌన్ వైస్ ప్రెసిడెంట్ పెరిక నవీన్ కుమార్, బిఆర్ఎస్వి నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ప్రేమ్, బిఆర్‌ఎస్‌వి ఎన్జీ కళాశాల నాయకులు సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.
HYD: తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌కు సాధారణ ఎన్నికలు (2023-2027) హైదరాబాద్‌లోని బిహెచ్ఇఎల్ రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్‌లో శనివారం జరిగాయి.
ఈ సందర్భంగా తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా డి.సతీష్ గౌడ్, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గా మాస్టర్ ఎ.ప్రవీణ్ కుమార్ లు నూతనంగా ఎంపికైనారు.
అదేవిధంగా తెలంగాణ తైక్వాండో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి గా అవకాశం కల్పించినందుకు కమిటీ కార్యవర్గానికి ఎం.డి యూనస్ కమాల్ తన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అంబటి ప్రణీత్, తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నల్లగొండ జిల్లా: పీఏ పల్లి మండల కేంద్రంలోని వద్దిపట్ల గ్రామంలో ఏనిక శారద భర్త వెంకటేశ్వర్లు ఎస్సీ మాల కులానికి చెందిన ఆమెను..శనివారం వారి వ్యవసాయ పొలం దగ్గర భూ వివాదంలో అదే గ్రామానికి చెందిన కొంత మంది, ఆమె పై దాడి చేసి ఆమె పండ్లు ఊడిపోయిన విధంగా కొట్టి గాయపరిచినారని, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ మరియు కెవిపిఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంబేద్కర్ అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయకుమార్, జిల్లా నాయకులు ధర్మాపురం శీను, వాస్కుల రాజ్ కుమార్, పర్వతం శివలింగం, బుడిగ గిరి, గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా, అనంతగిరి: మండలం బొజ్జగూడెం తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోదాడ ఎమ్మేల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండల టిబి, లెప్రసీ నోడల్ అధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం, మండలంలోని నర్సిరెడ్డి గూడ గ్రామంలో ఏసిఎఫ్ క్యాంపు నిర్వహించి, టీబీ వ్యాధి పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
టీబి వ్యాధి వ్యాపించే విధానం, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్ష కొరకు ఆసుపత్రికి పంపించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పి డాక్టర్ శ్రీనివాస్, ఎంపిహెచ్ఎ నవీన్, లక్ష్మీ, సునీత, ఆశాలు సుజాత, దుర్గమ్మ, మేరీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడకా విజయ్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి పబ్బతి శ్రీశేలం, మండల అధ్యక్షులు పల్స సైదులు , ఉపాధక్షులు రాంరెడ్డి, కార్యదర్శి కందికంటి ప్రకాష్, కోశాధికారి నకిరేకంటి మట్టపల్లి, గద్దల విమలమ్మా, శ్రీనివాస్, యాదయ్య, వెంకటమ్మ, అలివేలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
పట్టణంలో వివిధ వార్డులలో శిథిలావస్థకు చేరిన గృహాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు వహించాలని అన్నారు.
Jul 24 2023, 12:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k