Oommen Chandy: ఐదు దశాబ్దాలుగా అదే నియమం.. అందుకే ఆదర్శ నాయకుడిగా..
![]()
మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ (79) (Oommen Chandy) ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది..
ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు.
ఊమెన్ చాందీ ఎన్నడూ పార్టీ మారలేదు. 2020 సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఆయన ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు..




Jul 18 2023, 10:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.4k