TSNews

Jun 09 2021, 13:46

కరోనా థర్డ్ వేవ్‌కు సిద్ధం... 
 

 హైకోర్టుకు డీహెచ్ నివేదిక 


రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక అందించారు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని ఆయన నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 66,79,098 టీకా డోసులు ఇచ్చామన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పెషేంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రయివేటు ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయన్నారు. దీంతో పాటు కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీహెచ్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిగతా 15 వేల పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో 132 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చామన్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల కోసం 4 వేల పడకలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సిబ్బంది పెంపు, శిక్షణకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు తెలంగాణ కేబినెట్ కూడా మంగళవారం కరోనా థర్డ్ వేవ్‌పై చర్చించింది. థర్డ్ వేవ్ సన్నాహక చర్యలపై ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖకు సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి విధాన నిర్ణయాలు తీసుకున్నది.

TSNews

Jun 09 2021, 11:17

ప్రైవేట్‌‌ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ రేట్లు ఫిక్స్ 
 


 ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సిన్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ప్రైవేట్ సెంటర్లలో ప్రజల నుంచి కొవిషీల్డ్‌‌కు రూ.780, కొవాగ్జిన్‌‌కు రూ.1410, స్పుత్నిక్‌‌కు రూ.1145 కంటే ఎక్కవ తీసుకోకూడదని మంగళవారం ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు కొవిషీల్డ్ ఒక్కో డోసు రూ.600, కొవాగ్జిన్ రూ.1200, సుత్నిక్ వి రూ.948 చొప్పున ఇస్తుండగా.. దానిపై దానిపై ఐదు శాతం జీఎస్టీతో పాటు రూ.150 సర్వీస్‌‌ చార్జ్ కలిపి ఈ రేట్లను కేంద్రం నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువ చార్జ్ చేయకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ వికాస్ శీల్ రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాశారు.

TSNews

Jun 09 2021, 11:10

జూరాల జలాశయానికి వరద
 


జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు వరద ప్రవాహం ప్రారంభమైంది. 

రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్‌ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. 

దీంతో జలాశయానికి వరద వస్తున్నది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

 ప్రస్తుతం ప్రాజెక్టుకు 25,400 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే, జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

 జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.651 టీఎంసీల నీరుంది. ఇదిలా ఉండగా.. రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించగా.. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

 ఇప్పటికే పలు చోట్ల తొలకరి జల్లులు పడడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. దుక్కులు దున్ని అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

TSNews

Jun 09 2021, 11:04

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య 
 

 
 భద్రాచలం :

  మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన భద్రాచలం మన్యంలోని దుమ్ముగూడెం మండలం కె.మారేడుబాక గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కుంజా భీమయ్య(65) భార్యతో కలిసి కె.మారేడుబాకలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు, మిడియం శ్రీనుల కుటుంబసభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. తెల్లం శ్రీను భార్యకు నాలుకపై పుండ్లు ఏర్పడి తగ్గకపోవడం, లక్ష్మీనారాయణ పెద్దకొడుకు 2 నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో చనిపోవడం, రాజారావు తల్లికి చాలా రోజుల నుంచి కాళ్లు, చేతులు వాపు రావడం, మిడియం శ్రీను తండ్రి చనిపోవడం తదితర ఘటనలతో కుంజా భీమయ్యపై అనుమానం పెంచుకున్నారు. దీంతో మే 12న రాత్రి పథకం ప్రకారం భీమయ్యను గుడ్డ తాడుతో పీకకు ఉరి వేసి చంపేశారు. తర్వాత నర్సాపురం గ్రామం వద్ద గోదావరి ఇసుకలో పాతిపెట్టారు. ఏమీ తెలియనట్లుగా ఊరిలో తిరుగుతున్నారు. ఊళ్లో జరిగే పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుంజా భీమయ్య రాకపోవడంతో దుమ్ముగూడెం పోలీసులకు ఆయన కొడుకు తిరుపతిరావు ఫిర్యాదు చేశాడు. మే 15న మిస్సింగ్‍ కేసుగా నమోదు చేశారు. విచారణలో ఈ నలుగురు చంపినట్లు తేలడంతో వారిని వెంట పెట్టుకుని మంగళవారం నర్సాపురం గోదావరి ఇసుకలోకి వెళ్లారు. తహసీల్దారు, సీఐ, ఎస్సైల సమక్షంలో తవ్వి చూడగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహం కన్పించింది. డాక్టర్లు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురిపై కేసు ఫైల్​ చేసి రిమాండ్​ చేశారు.

TSNews

Jun 09 2021, 10:49

థర్డ్‌వేవ్‌ ముప్పు పై పలువురు నిపుణుల భిన్నాభిప్రాయాలు... 
 

 కొత్త మ్యుటేంట్...? 
 
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన బీభత్సంతో భారత్‌ చిగురుటాకులా వణికిపోయింది. ఒక దశలో రోజూవారీ కేసులు దాదాపుగా 4 లక్షల చేరువకు వచ్చాయి. దీంతో పాలకులతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, గతకొద్ది రోజులుగా రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, కరోనా థర్డ్‌వేవ్‌ (మూడోదశ ఉద్ధృతి) రాబోతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కానీ, ఈ మూడోదశ విజృంభణపై పలువురు నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. థర్డ్‌వేవ్‌ ఖచ్చితంగా వస్తుందని కొందరు చెబుతుండగా, వచ్చే అవకాశంలేదని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వానికి ప్రధాన శాస్త్ర సలహాదారుడిగా వ్యవహరిస్తున్న కె.విజయ్‌ రాఘవన్‌ మాత్రం దేశంలో మూడోవేవ్‌ ముప్పు అనివార్యమన్నారు.

కరోనా మూల వైరస్‌ ఉత్పరివర్తనాలు చెందిన తర్వాత ఏర్పడిన బీ.1.617.2 వేరియంట్‌ (డెల్టా) కారణంగా దేశంలో సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి మొదలైందన్నారు. అలాగే, వైరస్‌ మరోసారి ఉత్పరివర్తనం చెందితే థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు.

మరోవైపు, వచ్చే ఫిబ్రవరి - ఏప్రిల్‌ మధ్యలో దేశంలో మూడో వేవ్‌ రావొచ్చని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్‌టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో ఒకరు, కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. అయితే, మూడోవేవ్‌ రావడానికి గల కారణాలను మరింత లోతుగా విశ్లేషించాలన్నారు. ఇంకోవైపు, ఫస్ట్‌వేవ్‌ లాగానే సెకండ్‌ వేవ్‌ కూడా అంతే తీవ్రంగా ఉండొచ్చని ఎస్బీఐ నిపుణుల నివేదిక అంచనా వేసింది. ఇది దాదాపుగా 98 రోజుల పాటు కొనసాగవచ్చని పేర్కొన్నారు.

TSNews

Jun 09 2021, 10:36

భారత్‌లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. 
 

 ఈ రోజు అప్డేట్స్... 
 
 
భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. కానీ పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...2,219 మంది మృతి చెందారు.
నిన్న ఒక్కరోజే 1,62,664 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం 12,31,415 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకున్నారు. కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 3,53,528 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది. ఇప్పటి వరకు 23,90,58,360 మందికి కరోనా టీకాలు వేయించుకున్నారు.

TSNews

Jun 09 2021, 09:04

ఈ రోజు పెట్రోల్ & డీజిల్‌ ధరలు... 
 

Date : 09-06-2021

  తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగాయి.
  
  దేశవ్యాప్తంగా ధరలు ఈ విధంగా... 

▪️ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.94.76 

డీజిల్‌ ధర రూ.85.66.
 .
▪️ముంబైలో పెట్రోల్‌ రూ.100.98

డీజిల్ రూ.92.99

▪️చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.96.23 
 
డీజిల్‌ రూ.90.38

▪️కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.94.76

డీజిల్‌ ధర రూ.88.51 

▪️బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.97.92 

డీజిల్‌ రూ.90.81 

▪️హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర.98.48
 
డీజిల్‌ రూ.93.38 

▪️విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 

డీజిల్‌ రూ. 95.91 

▪️విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.99.69 
 
డీజీల్ ధర రూ.94.03

TSNews

Jun 09 2021, 08:45

చరిత్రలో ఈరోజు... 
 

Date 9-06-2021

▪1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు.

▪1964 : భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.

▪2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి.

▪1899: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)

▪1912: ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

▪1931: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006)

▪1947: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)

▪1949: కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త.

▪1951: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014)

▪1954: ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు.

▪1959: జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

▪1977: రూపా మిశ్రా, భారతీయ సామాజిక కార్యకర్త, 2003-2004 IAS లో ప్రథమురాలు.

▪1949: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867)

▪1995: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (జ.1900)

▪2011: ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారుడు. (జ.1915)

▪2012: పాలపర్తి వెంకటేశ్వర్లు, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేశాడు.

▪2017: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936)

▪2019: బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"ను ప్రారంభించాడు. (జ.1933)

TSNews

Jun 09 2021, 08:40

卐 ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 卐 
 

 卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐

ఈ రోజు రాశిఫలాలు...
 బుధవారం, జూన్ 9, 2021 

 మేషం : సకాలంలో పనులను పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీ రామ నామ జపం శ్రేయోదాయకం.

 వృషభం : మధ్యమ ఫలితాలున్నాయి. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

 మిథునం : మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం.

 కర్కాటకం : మంచి పనులు చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది.

 సింహం : సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 కన్య : చిత్తశుద్ధితో చేసే పనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయకూడదు. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

 తుల : అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.

 వృశ్చికం : మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

 ధనస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

 మకరం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే అన్ని రకాలుగా మంచిది.

 కుంభం : మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 మీనం : అవసరానికి తగిన సహా

 • TSNews
   @TSNews 
  మీనం : అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి. 
TSNews

Jun 09 2021, 08:35

卐 ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 卐 
 

 卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐 

ఈ రోజు పంచాంగం...
 బుధవారం, జూన్ 9, 2021 

    శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు 
  వైశాఖ మాసం - బహుళ పక్షం 

తిధి  : చతుర్దశి మ1.08
       తదుపరి అమావాస్య 

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : కృత్తిక ఉ8.32
        తదుపరి రోహిణి 

యోగం : సుకర్మ ఉ7.04
        తదుపరి ధృతి  

కరణం : శకుని మ1.08
        తదుపరి చతుష్పాత్ రా2.08
      ఆ తదుపరి నాగవ  

వర్జ్యం  : రా2.17 - 4.04
 
దుర్ముహూర్తం : ఉ11.32 - 12.24 &
            రా10.52 - 11.36

అమృతకాలం: ఉ5.52 - 7.39 

రాహుకాలం  : మ12.00 - 1.30 

యమగండం/కేతుకాలం: ఉ7.30 - 9.00

సూర్యరాశి: వృషభం 
చంద్రరాశి: వృషభం

సూర్యోదయం: 5.28 
సూర్యాస్తమయం: 6.29

 సర్వేజనా సుఖినోభవంతు 
   శుభమస్తు 
  
      గోమాతను పూజించండి
      గోమాతను సంరక్షించండి