గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం ...పాఠశాలకు రూ. 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి
గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం .... పాఠశాలకు 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి... నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామ పరిధిలో యుపిఎస్ గౌస్ నగర్ పాఠశాలలో బుధవారం ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశంను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరితా దేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌస్ నగర్ స్పెషలాఫీసర్ అంబిక హాజరై, మాట్లాడారు. ఎర్రంబెల్లి, గౌస్ నగర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాటుగా గ్రామంలోని పుర ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ , వర్క్ బుక్స్ నోట్ బుక్స్ ను అందజేశారు. పాఠశాలకు విరాళంగా 25000 ఎలిమినేటి వెంకటరెడ్డి అందజేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో ఉత్తమ ప్రతిప కనబరచిన తెలుగు, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరితా దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, అంజన్ కుమార్, తాజా మాజీ ఉపసర్పంచ్ సాయి రెడ్డి పోసి రెడ్డి, శ్రీకృష్ణ గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్, గడసందుల సత్తయ్య, పాక వెంకటేష్ యాదవ్, భూషబోయిన నరసింహ, భూష బోయిన శ్రీశైలం, గడసందుల కృష్ణ, నల్ల మాస్ కుమార్, గడసందుల మధు , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Jun 14 2024, 14:44