వలిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్
వలిగొండ మండలం 37 గ్రామపంచాయతీ లతో జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉండడంతోపాటు విద్యుత్,వ్యవసాయ మోటర్లపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మండల రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం మండల కేంద్రంలో అందుబాటులో లేక భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు రామన్నపేటకు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లడానికి రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని వేలాది రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తుందని వెంటనే వలిగొండలో స్థానిక సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం కోసం డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగాపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన దొడ్డు,సన్న తేడా లేకుండా అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని,రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక గ్రామాలకు లింక్ రోడ్లుగా ఉన్న గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలను ప్రయాణికులను,రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు వెంటనే సుంకిశాల నుండి వెల్వర్తి వరకు, వెలువర్తి నుండి ఆరూరు వరకు, కెర్చిపల్లి నుండి పులిగిల్ల వరకు,గోకారం నుండి నెలపట్ల వరకు,అరూర్ నుండి తుర్కపల్లి వరకు, బీటి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా ధర్మారెడ్డి పల్లి కాలువ వెంట ఉన్న కల్వర్టులను,తూములు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు నూతన కల్వర్టులు,తూములను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు,కందడి సత్తిరెడ్డి,మొగిలిపాక గోపాల్, వాకిటి వెంకట్ రెడ్డి,కొండే కిష్టయ్య,కర్ణ కంటి యాదయ్య, కవిడే సురేష్,దుబ్బ లింగం,భీమనబోయిన జంగయ్య,చీర్క మల్లారెడ్డి,దయ్యాల సత్యరాములు తదితరులు పాల్గొన్నారు.
Jun 12 2024, 18:52