నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఈరోజు ఉదయం భేటి అయ్యారు.
వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.
దీంతో పాటు హైదరాబాద్ లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతి వ్వాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు...











Feb 06 2024, 10:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.6k