చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు

హైద‌రాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది. వీధి కుక్క‌లు మ‌రో చిన్నారిని పొట్ట‌న‌పెట్టుకున్నాయి. నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి.ఈఘ‌ట‌న సమా ఎన్ క్లూ కాలనీలో జ‌రిగింది.

మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాడు.

అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న పెద్ద కుమారుడు నాగరాజును 20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చు కెళ్లాయి.

అర్ధరాత్రి కావడంతో ఇదంతా తల్లిదండ్రులు గమనించలేకపోయారు. కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికినా ఎక్కడ కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు.

పరుగెత్తుకుంటూ కుక్కలను తరిమి చూడగా చిన్నారి ఉలుకు పలుకు లేకుండా విగత జీవిగా పడివున్నాడు. చిన్నబాబుకు ఎమైందోనని గుండెలకు తల్లి హత్తుకున్నారు. బాబు వల్లంతా కుక్క కాట్లు ఉండడంతో నాగరాజు అంటూ లేపిన బాబు అప్పటికే మృతి చెందాడు.

బాబును విగతజీవిగా చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత ❓️

కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.47,65,768 కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎలాంటి కొత్త పథకాలు.. వరాలు.. వాతలు లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఓ సారి పరిశీలిస్తే.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.25,639 కోట్లు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు కేటాయించారు.

ఈసారి మరో రూ.2,239 కోట్లను పెంచింది. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు రానున్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థల గ్రాంటు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి.

ఈ మూడు పెద్ద పద్దులు తప్ప రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీలేవు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్లకు నిధులు కేటాయించాలని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు సంబంధించిన రూ.1800 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌కు కూడా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. ఈ అనుమతులిస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని ఆశించారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి, మెట్రో రైలు రెండో దశకు నిధులి వ్వాలని, యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్ల చొప్పున అదనంగా కేటాయించాలని కోరింది. కానీ, మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం వీటికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు...

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు.

గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విద్యుత్ లేని సమయంలో చిన్నారులు ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామం మొత్తం చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభ్యం కాలేదు.

గ్రామంలో సాయంత్రం 6 గంటల నుంచి ఇద్దరు గుర్తు తెలీని వ్యక్తులు టెంకాయ చెట్లకు ఇంజక్షన్లు వేస్తా మంటూ గ్రామంలో తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

వీరి నివాసం పక్కిరప్ప స్వామి దేవాలయంలో గ్రామం చివరిలో ఉండడం వల్ల విద్యుత్ లేని సమయంలో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఎస్ఐ మహ్మద్ రిజ్వాన్ కు ఫిర్యాదు చేయడంతో పోలీస్ డాగ్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు కొనసాగు తున్న గాలింపు చర్యలు చేపట్టారు..

జేసీఐ పురస్కారాలకు సామాజిక సేవకులు పలువురు ఎంపిక

పెద్దపల్లి జిల్లా జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేసీఐ సంస్థ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురిని ప్రోత్సహిస్తూ.. పురస్కా రాలు అందజేయడంలో జేసీఐ సంస్థ ఎప్పుడు ముందుంటుంది

దీనిలో భాగంగా 2023 సంవత్సరంలో పలు రంగాలలో సామాజిక సేవా దృక్పథంతో విశిష్ట సేవలు అందిస్తున్న పెద్దపల్లి జిల్లాలోని పలువురు సంఘ సేవకులు, వివిధ వృత్తు లలో రాణిస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసినట్లు జేసీఐ మంచి ర్యాల జిల్లా ఛాంబర్ అధ్యక్షులు ఆర్మూర్ల రాజు తెలిపారు.

ఎంపికైన వారిలో గోదావరిఖనికి చెందిన మురళీధర్ యాదవ్, సామాజిక విశ్లేషకులు, మాజీ పోలీస్ కానిస్టేబుల్, దళిత రత్న దేవి లక్ష్మీ నరసయ్య, బూస ప్రదీప్ - శ్రావణి దంపతుల ను పురస్కా రానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

అలాగే కాటారం మండలం లోని విలాసాగర్ ప్రైమరీ స్కూల్ లో ప్రధానోపా ధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న గోదావరిఖని పట్టణనికి చెందిన శాంతి లత, విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె రెండో సారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం...

యువరత్న అవార్డుకు దేవి రోహిత్, రాముల కార్తీక్, మంథని కి చెందిన పొట్ల శ్రీకాంత్ లను ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీరిని పురస్కా రాలతో ఘనంగా సత్కరిం చనున్నట్లు తెలిపారు.

జేసీఐ అవార్డులకు ఎంపికైన వీరిని పలువురు అభినందిస్తున్నారు..

Revanth Reddy: నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది..

ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మూడు పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు..

అయితే, ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు 'దళిత, గిరిజన దండోరా' పేరిట నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో రేవంత్‌ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు..

ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక, దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్‌రెడ్డిగా సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు..

500కు సిలిండర్, ఉచిత విద్యుత్ పై సీఎం రేవంత్ నేడు కీలక ఆదేశాలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పారు.

రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

ఇందుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని అన్నారు.....

కాటాపూర్ సర్పంచ్ ను ఘనంగా సన్మానించిన మహిళలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ తో పాటు ఉపసర్పంచ్ మేడిశెట్టి పుష్ప లకు గురువారం ఘనంగా సన్మానించారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ముగింపు సందర్భంగా అంగన్వాడీ మహిళలు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పుష్ప లకు పూలమాలలతో శాలు వాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ కాలంలో చేసిన సేవలను కొనియాడారు. కాటాపూర్ గ్రామానికి ప్రత్యేకత తీసుకొచ్చారని సర్పంచ్ గౌరమ్మను అభినందిం చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క, సరిత, సుజాత, నిర్మల, శ్రీకళ, వెంకటలక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసల జల్లు

టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి.

ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో.. సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటుంది.

ఇక ఇన్ట్సాలో కూడా ఉపాసన యాక్టింగ్ గానే ఉంటుంది. తన ఇన్ట్సా ద్వారా పలు ఆసక్తికర వియాలను పంచు కుంటుంది.

ఇప్పుడు తాజాగా మరో వార్తను పంచుకున్నారు ఉపాసన. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు సౌందరారాజన్ ను కలిసినట్టు తెలిపింది.

ఈనేపథ్యంలోనే ఆమె ట్రైబల్ వెల్ ఫేర్ కోసం చేస్తున్న పనులు నా మనసును హత్తు కున్నాయి.. మీరు చేస్తున్న పనికి ధన్యవాదములు మేడం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది... ఉపాసన

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కారు అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.

బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

ఉద్యోగుల‌కు 7 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాంపు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలక్క

వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటిం చారు.

ఇంతకుముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల వరకు మినహాయింపు ఉండేది. దాన్ని రూ.25 వేల వరకు పొడిగించారు. అంటే రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఇక కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను రాయితీ అమలవుతుంది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప‌న్ను చెల్లింపులు య‌థాత‌థం

ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.24 లక్షల కోట్ల ఆదాయం లభించిందన్నారు.

ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు...