TS: తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంతో పాటు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులు 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణ రావు, పొన్నం ప్రభాకర్, అనసూర్య సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు.

TS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తొలి సంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..

ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పైన తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీ లు ఈ విధంగా ఉన్నాయి

మహాలక్ష్మి పథకం 

పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.

గృహజ్యోతి 

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

రైతు భరోసా 

రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.

యువ వికాసం 

ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.

చేయూత 

రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.

ఇందిరమ్మ ఇళ్లు

ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

TS: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీల పైన తొలి సంతకం, దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం రెండవ సంతకం

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పక అమలు పరిచే అభయహస్తం‌పై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలైన రజినికి ఉద్యోగం ఇస్తానని ప్రచార సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి.. రజిని ఉద్యోగ నియామక పత్రం పైన రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని దివ్యాంగురాలు రజిని కి అందజేశారు.

అలాగే జ్యోతిరావు పూలే ప్రజా భవన్ ప్రగతి భవన్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అన్నారు. దానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

TS: రేవంత్ రెడ్డి అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్

హైదరాబాద్ : ఈరోజు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దకాలం గా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎదురుచూస్తున్న కలలు ఫలించాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది.

గవర్నర్ తమిళి సై ఆదేశాలతో సీఎస్ శాంతకుమారి ప్రకటించగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి అనే నేను భారత రాజ్యాంగం పట్ల అంటూ.. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఎల్ బి స్టేడియం మారుమోగింది.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జయజయ ధ్వానాలతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం హోరెత్తింది.

రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ఏఐసిసి పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రుల సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తెలంగాణలో జనవరి-ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ, సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై అధికారులు వివరాలు సేకరించారు. ఎన్నికల కమిషన్ కు వివరాలు పంపారు. 2024 జనవరి 31వ తేదీతో సర్పంచ్‌ ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో 2024 జనవరి, ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

NLG: అంబేద్కర్ కు నివాళులర్పించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సభ్యులు

నల్లగొండ జిల్లా:

దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు చిట్యాల గోపాల్ , ఉపాధ్యక్షుడు ఏకుల అంబేడ్కర్ ఆధ్వర్యంలో స్ధానిక అంబేడ్కర్ గ్రంథాలయంలో, డా. బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిట్యాల గోపాల్ మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ నవభారత నిర్మాణానికి పునాది వేశారు. బడుగు బలహీనవర్గాలకు, దేశ ప్రజల కోసం ఎంతో సేవ చేశారు అని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎప్పటి మరచిపోకూడదు అని అన్నారు. ఉపాధ్యక్షుడు ఏకుల అంబెడ్కర్ మరియు సభ్యులు క్రాంతి, రవి, సురేష్, మనోహర్ పాల్గొన్నారు.

NLG: అంబేద్కర్ 67 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా: 

చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన మేడి ప్రియదర్శిని

నకిరేకల్ ఎమ్మెల్యే గా పోటీ చేసిన బీఎస్పీ నాయకురాలు మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారతజాతి వైతాళికుడు, విజ్ఞాన గని, విశ్వవిజేత అని అంబేద్కర్ ను కొనియాడారు. కార్యక్రమంలో బిఎస్పి నాయకులు, తదితరులు పాల్గొన్నారు

TS: సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. మర్యాదపూరకంగా ఆమెను కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా తన పేరును ఖరారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లను తన ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పట్ల కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ.. సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ.. ఆయనపైనే నమ్మకం ఉంచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను భుజాలపై ఉంచారు. వారి నమ్మకాన్ని వమ్ముకానివ్వలేదు రేవంత్ రెడ్డి. పార్టీకి ఘన విజయాన్ని అందించారు.

రేవంత్ అభ్యర్థన మేరకు గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు రానున్నారు.

రామన్నపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బిఎస్పి నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా.. బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేడి సంతోష్ మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించదగిన ప్రముఖులలో ముఖ్యుడు మన అంబేద్కర్ అని, భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలకు రూపకల్పన చేసి మన దేశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, రాజ్యాంగ శిల్పి, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త అని తెలిపారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి కృషిచేసిన మహనీయుడని కొనియాడారు.

స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారతరత్న, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, కార్యదర్శి ఏర్పుల కృష్ణ, తుమ్మలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు రాజలింగం, భోగారం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి నరేష్, శోభనాద్రి పురం గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్ర నరేష్, ఎర్ర శివ పాల్గొన్నారు.

NLG: అంబేద్కర్ అందరివాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు: నాగిల్ల మారయ్య

నల్లగొండ జిల్లా:

డా.బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా, మర్రిగూడ మండలంలో మలమహానాడు మండల అధ్యక్షులు నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారయ్య మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ ను ఒకే వర్గానికి పరిమితం చేస్తున్నారు, కానీ ఆయన అందరివాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలు మర్చిపోవద్దు అన్నారు.యాదగిరి, అభి, చరణ్, శివరాజ్, అజయ్ పాల్గొన్నారు.