TS: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీల పైన తొలి సంతకం, దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం రెండవ సంతకం
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పక అమలు పరిచే అభయహస్తంపై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలైన రజినికి ఉద్యోగం ఇస్తానని ప్రచార సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి.. రజిని ఉద్యోగ నియామక పత్రం పైన రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని దివ్యాంగురాలు రజిని కి అందజేశారు.
అలాగే జ్యోతిరావు పూలే ప్రజా భవన్ ప్రగతి భవన్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అన్నారు. దానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.











Dec 07 2023, 16:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.8k