బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త

Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.

ఇటీవలి పరిణామంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో సవాళ్లతో పోరాడుతున్న వ్యక్తులకు సహాయం చేసింది. అది వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు లేదా వాహన రుణాలు అయినా, రుణం తిరిగి చెల్లించే భారం తరచుగా రుణగ్రహీతలకు అధికం అవుతుంది. చాలా మంది తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చుకోలేక పోతున్నారు, ఇది భారీ జరిమానాలు మరియు చక్రవడ్డీల పెంపునకు దారి తీస్తుంది.

ఏదేమైనా, రుణ గ్రహీతలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఆర్‌బిఐ సంచలనాత్మక నియమాన్ని ప్రవేశపెట్టడంతో ఉపశమనం లభించింది. కొత్త ఆదేశం ప్రకారం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) చెల్లింపులు ఆలస్యం అయిన సందర్భాల్లో వడ్డీపై వడ్డీని వసూలు చేయకుండా బ్యాంకులు నిషేధించబడ్డాయి. రుణాలపై వడ్డీని నిర్ణయించేటప్పుడు స్థిర వడ్డీ రేట్లను మాత్రమే వర్తింపజేయాలని ఆర్‌బిఐ నొక్కి చెప్పింది.

అంతేకాకుండా, బ్యాంకులు ఇప్పుడు నెలవారీ EMIని ఏకపక్షంగా పెంచకుండా లేదా రుణగ్రహీత నుండి స్పష్టమైన సమ్మతిని పొందకుండా రుణ కాల వ్యవధిని మార్చకుండా నిరోధించే నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. రుణ గ్రహీతలతో సమయానుకూలంగా మరియు పారదర్శకంగా కమ్యూనికేట్ చేయడాన్ని RBI తప్పనిసరి చేస్తుంది, రుణ పదవీకాలం యొక్క ఏదైనా పొడిగింపు లేదా EMIలో మార్పులను వెంటనే తెలియజేయాలని నిర్ధారిస్తుంది. ఈ చర్య రుణగ్రహీతల హక్కులను కాపాడుతుంది మరియు వారి రుణ ఒప్పందాలకు ఏకపక్ష మార్పులను నిరోధిస్తుంది.

అదనంగా, RBI రుణగ్రహీతలను ఎప్పుడైనా పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పించడం ద్వారా వారికి అధికారం ఇస్తుంది. ముఖ్యంగా, EMI చెల్లింపులు ఆలస్యమైన సందర్భాల్లో, ఆలస్యమైన చెల్లింపుల సాకుతో బ్యాంకులు వడ్డీని వసూలు చేయకుండా నిషేధించబడ్డాయి.

ఈ విప్లవాత్మక నియమాల సెట్, జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది, వినియోగదారులను రక్షించడానికి మరియు సరసమైన రుణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి రూపొందించబడింది. రుణగ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించడంలో RBI యొక్క నిబద్ధత ఈ నిబంధనలలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇది దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా వర్తిస్తుంది. ఫలితంగా, ఆర్‌బిఐ ఆలోచనాత్మకమైన జోక్యానికి ధన్యవాదాలు, రుణగ్రహీతలు ఇప్పుడు తమ ఆర్థిక బాధ్యతలను మరింత సులభంగా నావిగేట్ చేయవచ్చు.

నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా

నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా

డబ్బు సంచులతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే దొంగలను తరిమి కొట్టాలి.. 

కేవలం ఐదేళ్ళ కాలంలోనే కరోనా మహమ్మారిని ఎదిరించి నల్గొండను అభివృద్ధి గడ్డగా మార్చానని , మరో దఫా గెలిపిస్తే నల్గొండను అభివృద్ధిలో బంగారు గడ్డగా మారుస్తానని BRS MLA అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

తిప్పర్తి, మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచర్ల గారు మాట్లాడుతూ.. గతంలో మట్టి రోడ్లకు కూడా నోచుకోని ఈ పల్లెలన్నీ నేడు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు 20 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏం లేకనే .. ప్రజల మధ్య డబ్బు సంచుల చిచ్చు పెడుతున్నారని .. వాళ్ళకు అది తప్ప మరోటి తెలియదని ఎద్దేవా చేశారు.

KCR గారి పాలనలో రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందని ఇళ్ళే లేదని.. అందరూ సంక్షేమ పథకాలను పొందుతున్నారని అన్నారు.

కఠిక చీకటిని చీల్చివేసిన అభివృద్ధి వెలుగు మన భూపాలన్న అని... ఈ భూపాలన్న గెలుపు .. మా గెలుపని... అందుకే కారునే గెలిపించుకుంటామని పలు గ్రామాల సర్పంచులు అన్నారు

ఈ కార్యక్రమంలో మాడ్గులపల్లి MPP పోకల విద్య రాజు, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పాలుబట్ల బాపయ్య , Ex.ZPTC తండు సైదులు గౌడ్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ , వైస్ MPPలు సూదిరెడ్డి సుమలత శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, కందుల రేణుక లక్ష్మయ్య (PACS వైస్ ఛైర్మన్), MPTC వెన్న గోవర్దనమ్మ , మాడ్గులపల్లి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, సర్పంచులు బొర్రొజు సైదమ్మ సైదులు, బెల్లి శ్రీను , శివ , యర్రమాద కవితా నరేందర్ రెడ్డి, నాగయ్య, సిరిగిరి పద్మ , సాలమ్మ శ్రీను....., నాయకులు డాక్టర్ చెరుకు సుహాన్, జీడిపల్లి వెంకట్ రెడ్డి, యరమాద నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, వల్లపురెడ్డి యాదగిరి రెడ్డి, మర్రి శ్రీను , మర్రి మధు , ఎస్.కె. కరీం, కమాల్ , రంజాన్, దొంత రాములు, బొస్క మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి

బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.

నల్లగొండ జిల్లా:

నాగార్జునసాగర్ నియోజకవర్గం.....

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా....

గుర్రంపోడు మండలం,మైల పురం,కాచారం,బ్రాహ్మణ గూడెం, కొనాయి గూడెం, పల్లిపాడు,చేపురూ గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో....

స్థానిక ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారితో కలిసి పాల్గొన్న.....

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ.....

జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బి.ఆర్.యస్ పార్టీ తరుపున పోటీ చేసే నాగార్జునసాగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కెసిఆర్ గారిని ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో.....

స్థానిక ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి,పలువురు సర్పంచ్ లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కౌగిలి కోసమే శంకరా చారి బిఎస్పి కి మోసం చేసాడు--బిఎస్పి మునుగోడు నాయకులు పెండెం ధనుంజయ్ నేత

బిఎస్పి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి అందోజు శంకరా చారి నామినేషన్ విత్డ్రా.

బరిలోంచి మొదటి గుర్తు ఏనుగు పరారీ.... ఏనుగు స్థానంలో కారు.

గజరాజు జాడ తెలువక సతమతం అవుతున్న బహుజన అభిమానులు.

మొదటి నుండే దొంగగా పేరున్న శంకరా చారికి టికెట్ ఇవ్వటం పట్ల, మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బిఎస్పి నేత పెండెం ధనుంజయ్ నేత.

బిఎస్పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే ఇంతటి దారుణం...! బహుజన ముసుగులో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాడా అంటూ కామెంట్స్...!

కాంగ్రెస్ కౌగిలి కోసమే శంకరా చారి బిఎస్పి కి మోసం చేసాడు--బిఎస్పి మునుగోడు నాయకులు పెండెం ధనుంజయ్ నేత.

బరిలో నుండి ఏనుగు తొలగింపు... ఇక బిఎస్పి మద్దతు మునుగోడులో ఎవరికి...!

ఓటు బ్యాంకింగ్ ఉన్న పెండెం ధనుంజయ్ నేత మద్దతు ఎటు...!

ప్రశ్నించే బహుజన వాదిగా పెండెం... పలు కార్యక్రమాలలో ప్రజల మనసులు గెలుచుకున్న ధనుంజయ్ నేత...

నియోజకవర్గ వ్యాప్తంగా తన సామాజిక వర్గం మద్దతు ఉన్న పెండెం ధనుంజయ్ నేత...!

పలు పార్టీల వల... పార్టీ మారాలంటూ అభ్యర్థన....!

పెండెం ధనుంజయ్ మద్దతు బిఆర్ఎస్ కి ఉంటుందా...! తన గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపా

నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర* *సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి

నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర

 సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి

   నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా గుర్తింపు రావడానికి ఎస్ఎల్ బీసీ నీటి ద్వారానే సాధ్యమని గ్రహించిన కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నేడు నల్లగొండ జిల్లా కొంతమేర అభివృద్ధి జరిగిందని అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని సిపిఎం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు 

      బుధవారం 1,2,3,18,19 వార్డులలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి సిపిఎం పార్టీ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయమని కోరారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న కమ్యూనిస్టులు నేడు అసెంబ్లీలో లేకపోవడంతో అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాము నియంతృత్వనికి దారి తీస్తుందని అన్నారు కాకతీయులనాడు ఏర్పడ్డ పానగల్లు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ ద్వారా పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పానగల్లులో చేపట్టలేదని ఆరోపించారు. పానగల్లును పర్యాటక కేంద్రంగా మారుస్తామని గొప్పలు చెప్పడం మినహా చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు పానగల్లులో పశుపోషణ గొర్రెల మేకల పెంపుకు దారులు అధికంగా ఉన్నందున ప్రస్తుతం ఉన్న పశు వైద్యశాల ఆధునికరించి 24 గంటలు డాక్టర్లు వైద్య సేవలు అందజే విధంగా ప్రభుత్వంపై పోరాడుతామని హామీ ఇచ్చారు పట్టణ పేదలు కార్మికుల హక్కుల రక్షణ కోసం కనీస వేతనాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం మహిళలు మైనార్టీల రక్షణ కోసం సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సమస్యల పట్ల కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు

  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం మాట్లాడుతూ రైతు నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధిలో సాగు త్రాగునీరు సాధన కోసం d39,40,41 పిల్ల కాలువల నిర్మాణం కోసం పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగిన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 

      *ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్, ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మైల యాదయ్య ఆకిటి లింగమ్మ రుద్రాక్ష శేఖర్ రుద్రాక్ష యాదయ్య దండెంపల్లి దశరథ బుజ్జమ్మ కొండ చంద్రకళ జిట్టా సైదులు దండెం పల్లి సరోజ,భూతం అరుణ, అద్దంకి నరసింహ సలివోజు సైదాచారి , మధుసూదన్ రెడ్డి ,కోట్ల అశోక్ రెడ్డి మారగోని నగేష్ చెనగోని వెంకన్న శ్రావణ్ తరుణ్ కర్నాటి శ్రీరంగం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గoడమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కార్తీక మాసములో నియమ నిబంధనలు పాటిస్తూ నలబై రోజుల పాటు దీక్షలో వుండే అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, ఇతర దీక్షా స్వాములకు  డిసెంబరు 31 వరకు ప్రతిరోజూ శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వెనకభాగంలో నిర్వహించే అన్నదానం కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలందరిపై వుండాలని, అయ్యప్ప స్వామి అందరిని చల్లగా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వూర రామ్మూర్తి, మద్ది శ్రీనివాస్ యాదవ్, శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి సభ్యులు అంతటి విజయ్, యర్రంశెట్టి ఉపేందర్, రాచకొండ దేవయ్య, రాచకొండ క్ర్రష్ణ, చీపూరి క్ర్రష్ణ, వెంపటి పురుషోత్తం, కొండ్లె రంగయ్య, గుండా శ్రీధర్, పందిరి ఉపేందర్, దేశోజు నాని, గాలి క్ర్రష్ణ, ఎర్ర వెంకన్న, వెంపటి శభరినాధ్ తది తరులు పాల్గోన్నారు.

శ్రీలంకలో భారీ భూకంపం

శ్రీలంకలో భారీ భూకంపం

శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. భయాందోళనలకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..

Neredumet:ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది.. కానీ ఆ తరువాత కుటుంబంలో ఆర్థిక సమస్యలతో గొడవలు మొదలయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం ఆమె అద్దె ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు భర్త మహేందర్.. ఈ క్రమంలోనే..


హైదరాబాద్, నవంబర్14; దీపావళి పండుగ రోజే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను హత్య చేసాడు కట్టుకున్న భర్త…కులాలు వేరే అయిన కలిసి జీవించాలి అనుకున్నారు.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.. సుఖ సంతోషాలతో కలిసి జీవించాలి అనుకున్న ఆ ఇద్దరి మధ్య అనంతర కాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త ప్రవర్తనలో మార్పులు రావడం తో ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసాయి.. క్రమ క్రమంగా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవ్వడంతో పుట్టింటికి వెళ్ళింది భార్య. అయినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత బలపడ్డాయి… పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన మార్పు మాత్రం రాలేదు. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేశాడు ఓ భర్త. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది.


నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి రోజున ఇంటి ఇల్లాలిని హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరి పల్లి కి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది. మహేందర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్ లోని కందిగూడా లో నివసిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొడవలు చోటు చేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతా నగర్లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకెళ్లి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్త పై ఆగ్రహం వ్యక్తం చేసింది స్రవంతి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేందర్ కోపంతో భార్య స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అనంతరం ఆమె మెడకు చున్ని చుట్టి తీసుకెళ్లి మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

వస్తువుల్ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి చెల్లి తిరిగి రాకపోవడంతో స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి డోర్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడివుంది. దీంతో పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఈ విధంగా హత మార్చడంతో స్రవంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?

Telangana Election: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు. స్వతంత్ర అభ్యర్థి పోటీకి విశేషమేంటి..? ఎన్నికల అధికారులు ఎందుకు అవాక్కయ్యారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!


యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జా రాంచంద్రా రెడ్డి సామాజిక కార్యకర్త. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేస్తూ ఉంటాడు. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి ఆలేరు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడంలో ఎలాంటి విశేషం కూడా లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా అభ్యర్థులు ఎవరైనా ఈ డిపాజిట్‌ను చెల్లిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ప్రజల నుంచి ఒక్కో రూపాయి నాణెలను విరాళంగా సేకరించారు. ఇలా పదివేల నాణెలు పోగు చేసిన మూటతో నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చాడు. నాణెల మూటను చూసి ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పదివేల రూపాయల నాణాలను లెక్కించడానికి ఎన్నికల అధికారులకు రెండు గంటల సమయం పట్టింది.


రామచంద్రారెడ్డి ఇలా 2009 నుంచి ఇప్పటివరకు వరసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిసారి ప్రజల నుంచి విరాళంగా రూపాయి కాయిన్స్ సేకరించి డిపాజిట్ చెల్లిస్తుంటాడు. ప్రస్తుతం.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, ఇందులో ఓటర్లు పావులుగా మారారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవా రంగంగా ఉండాల్సిన రాజకీయ రంగాన్ని పార్టీలు వ్యాపారంగా మార్చి వేశాయని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల నుంచి ఒక్కో రూపాయను విరాళంగా సేకరించి ఎన్నికల్లో డిపాజిట్ చెల్లిస్తుంటానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలిపిన ఆయన. ఆలేరు నియోజకవర్గ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

గొప్ప నటునికి తెలుగులో సంతాపం తెలిపిన ప్రధాని...

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేని శూన్యతను కలిగించిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వారి ఉత్తమమైన నటన మరియు ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేన ఒక శూన్యతను కలిగించింది. నా ఆలోచనలు వారి కుటుంబం మరియు అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని ఇంగ్లిష్‌లోనూ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, మహేశ్ బాబు తదితర సినీ ప్రముఖులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న చంద్రమోహన్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.