సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధిస్తాం: రామావత్ రమేష్ నాయక్
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ  నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో,  పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ కార్యక్రమంలో పాల్గొని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికారం ఎట్లా ఉంటదో రూచి చూపించినటువంటి మహనీయుడు బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్, తను చిన్ననాటి నుండే మహా మేధావి, గౌడ సామాజిక వర్గంలో పుట్టి మనము ఎన్ని నాళ్ళు దోరల కింద బానిసవుగా ఉండాలని తన చిన్ననాడే తల్లితో చెప్పిన పాపన్న, తను పెద్ద అయ్యాక సైన్యాన్ని ఏర్పరచుకొని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని, సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో శివాజీ మహారాజు వలె మొగలులను వణికించిన ధీరుడు కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి, తెలంగాణ తొలి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన రారాజు,బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు అని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బాలునాయాక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, కోశాధికారి మాతంగి జాన్, హేమంత్, రవి నాయక్, దత్తు నాయక్, అనిల్, జెస్సిక, తదితరులు పాల్గొన్నారు
NLG: రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
నల్గొండ: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ యందు గురువారం రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌతమి స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పోలీసులు వివరించి అవగాహన కల్పించారు. ఈ  అవగాహన కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: రెండవ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయండి: పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండోవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ కలక్టర్ కార్యలయం ముందు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..  గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను, న్యాయ బద్దంగా ఆలోచించి పర్మినెంట్ చేయాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న నేటికి పర్మినెంట్ చేయకపోవడం విచారకరమని అన్నారు. రెండవ  ఏఎన్ఎం  ల బాధలు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకొని, వెంటనే వారిని  పర్మనెంట్ చేయాలని దేవేందర్ రెడ్డి కోరారు. కరోనా కాలంలో ప్రాణాలు సహితం పణంగా పెట్టి పనిచేసిన ఏఎన్ఎం ల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. చేసే పని ఒకే విధానమైనప్పుడు,, వేతనాల వ్యత్యాసం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.  పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే వారికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదు అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 4000 మంది పనిచేస్తున్నారు. వారందరినీ పర్మినెంట్ చేయకుండా మళ్లీ కొత్త నోటిఫికేషన్ వేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. 50 ఏళ్ల వయస్సులో పోటీ పడి ఎగ్జామ్ ఎలా రాస్తారని  ఏఎన్ఎం లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం న్యాయం కాదని,  తక్షణమే ప్రస్తుతం పని చేస్తున్న ANM లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, 2 వ ANM ల సంఘం జిల్లా నాయకులు రత్నకుమారి, బి.నాగమణి, అరుణ, అండాలు, వసంత, అలివేలు, సులోచన, గీత, అరుణ  సుప్రియ, వరలక్ష్మి, అనిత, రేణుక, భవాని, సంతోష, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ప్రొఫెషన్స్ అవార్డులు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎం.ఆర్. వి ప్రసాద్ మరియు ఎంఏ భవాని ల ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కళాశాలలో చదివినటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహంగా విశ్రాంత అధ్యాపకులు కీర్తిశేషులు ఎం రవి ప్రసాద్ సంస్మరణ అర్థం ప్రొఫెషన్స్ అవార్డులను వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా విద్యను అభ్యసించినటువంటి కళాశాల విద్యార్థులకు ఫిజిక్స్ విభాగంలో సాధించినటువంటి మార్కు లకు గాను ప్రోత్సాహకం గా బహుమతితో పాటు గోల్డ్  మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందించారు. అమెరికాలో నివసిస్తున్నటువంటి రవి ప్రసాద్ గారి కుమారుడైన సుబ్రహ్మణ్య కుమార్ మరియు వారి కుమార్తె మరియు స్థానిక గవర్నమెంట్ టీచర్  శేఖర్  సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ట్రస్ట్ ద్వారా విద్యార్థుల విద్యార్థులకు సుమారుగా 25 వేల రూపాయలు  ప్రోత్సాహక బహుమతి రూపంలో అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్ మాట్లాడుతూ..  మారుతున్న కాలానికి  అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ అంతటి శ్రీనివాస్, ఎం ఆర్ వి ప్రసాద్ కుమారుడైన సుబ్రమణ్య కుమార్, వారి కుమార్తె  వైదేహి, వారి ప్రియ శిష్యుడు శేఖర్, విశ్రాంత భౌతిక శాస్త్ర అధ్యాపకులు బండి రాఘవ రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తెలుగు ఆచార్యులు  కృష్ణ కౌండిన్య, సుబ్బారావు,  లైబ్రేరియన్ ఆనందం దుర్గాప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె చేపట్టిన సెకండ్ ఏఎన్ఎంలు

నల్లగొండ: జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో.. జిల్లాలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు, తమను రెగ్యులరైజ్ చేయాలని నేటి నుండి నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ... గత 16 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని గతంలో పలుమార్లు నిరసనలు వ్యక్తం చేసి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. కానీ నేటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియూసి ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని నేడు నిరవదిక సమ్మె చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లను ఎక్కడివారిని అక్కడే రెగ్యులర్ చేయాలని, నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, ఎగ్జామ్ లేకుండా భేషరతుగా తమ ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎం లు పద్మ ,అనురాధ, సుచిత్ర, రోజా, మంజుల, సరిత, స్వప్న, మమత, రాములమ్మ, సుమలత, అరుణ, హారతి ,అండాల, జానకి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
దేవరకొండ: స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండాను ఎగరవేశారు. బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి బానిసత్వం నుంచి అనేక రకాలైనటువంటి అసమానత నుంచి సమానత్వంలోకి నడిపించినటువంటి మహనీయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ బహుజనుల బతుకులు ఇంతవరకు మారలేదని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా నూతన పథకాలు ప్రవేశపెట్టి  సామాజిక న్యాయం జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి వెంకటయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, బహుజన నాయకులు అంబేద్కర్ వాది డాక్టర్ ఏకుల రాజారావు, ఆల్ ఇండియా సమతా సైనిక్ డళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు రాచమల్ల నాగయ్య, సిపిఎం నాయకులు  కంబాలపల్లి ఆనంద్ తదితులున్నారు.
గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ: జిల్లా కేంద్రంలోని జీవి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం, 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో  సరోజిని భాయి, మహాత్మా గాంధీ, భరతమాత వివిధ మహనీయులుగా విద్యార్థులు వేషధారణ చేసి మహనీయులను గుర్తు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను గుర్తుచేస్తూ వారికి స్ఫూర్తిగా ఉండాలని మరియు గొప్ప చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి పాల్గొని మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వారి కష్టాన్ని గుర్తించి విద్యార్థులు, బాగా చదువుకొని ఒక జాబ్ చేసి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నారు. ఆ స్కూల్ కమిటీ పేరెంట్స్ మరియు పేరెంట్స్ కమిటీ జిల్లా నాయకుడు బొజ్జ పాండు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి
TS: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ మండలం తుర్కపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, చిన్న లారీని ఓవర్ టేక్ చేసిన వివాదంలో కండక్టర్ బస్సు దిగి రోడ్డుపై మాట్లాడుతుండగా,, వెనుక నుండి కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ,  కండక్టర్ బాల నర్సింహ (47)ను ఢీకొని రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాల నర్సింహ అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్న లారీ డ్రైవర్, బస్సు లోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు సిద్దిపేట జిల్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి కి జోహార్లు: బుడిగ వెంకటేష్
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమ యువకిశోరం కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి 42వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే  అమర జీవి రాగిరెడ్డి వీరారెడ్డి,  పేదల భూముల కోసం రాయినిపాలెం గ్రామంలో అసువులు బబాసిన వీరుడు అని అన్నారు. చిన్నతనం నుండి ఆయన విద్యార్థి సమస్యలు పరిష్కరించబడాలని, వసతి గృహాలలో సరైన వసతి సౌకర్యాలు కావాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ఎస్ఎఫ్ఐలో చాలా తీవ్ర స్థాయిలో కృషి చేసిన్నారని తెలిపారు. విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క వీరారెడ్డి  ఎస్ఎఫ్ఐ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మిర్యాలగూడ డివిజన్ లో బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపట్టారని, ఆ తర్వాత రాయినిపాలెం గ్రామంలో మిగులు భూములు,  గ్రామంలో ఉన్న పేదలకు చెందాలని ఆ పేదల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని, మిగులు భూములలోనే అసువులు బాసిన ధీరుడు అని అన్నారు. ఎర్రజెండాకు వన్నె తెచ్చి మిర్యాలగూడ డివిజన్లో ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్నో విధాలుగా కృషి చేసిన వ్యక్తి వీరారెడ్డి అని, ఆ అమరుడికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను సాధించడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్ర రాహుల్, కిరణ్, హేమంత్, గణేష్, రాజేష్, శ్రవణ్, హేమ శంకర్, హరీష్, అఖల్, తదితరులు పాల్గొన్నారు
'అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందటానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి'
సూర్యాపేట జిల్లా, నాగారం మండలం ఈటూరు గ్రామంలో ప్రతిభ యూత్ ఆధ్వర్యంలో, నేడు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ యూత్ అద్యక్షులు బోడ పరుశరాములు మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని కులాలకి మతాలకి అతీతంగా జరుపుకోవాలని తెలియజేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న సంధర్బంగా, దేశంలో అంటరాని తనం, ఆకలి, అసమానతలు ఉండకూడదన్నారు. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందటానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. కులాల పేరుతో మతాల పేరుతో ఘర్షణలను, హింసను ఎవరు ప్రోత్సహించవద్దని అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా 3000 రూపాయల విలువ చేసే 10 మహనీయుల ఫొటోలను యూత్ కి ఇప్పించిన ప్రతిభ యూత్ కార్యదర్శి బోడ ఉపేందర్ కి అందరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, టెక్నో డీడ్ ఐటీ కంపెనీ చైర్మన్ వంగూరి దామోదర్, 4వ వార్డు మెంబర్ బోడ రమేశ్, కవి గాయకులు పేరాల యాదగిరి, మాజీ వార్డు సభ్యులు, తాపీ యూనియన్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ప్రతిభ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.