ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
దేవరకొండ: స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండాను ఎగరవేశారు. బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి బానిసత్వం నుంచి అనేక రకాలైనటువంటి అసమానత నుంచి సమానత్వంలోకి నడిపించినటువంటి మహనీయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ బహుజనుల బతుకులు ఇంతవరకు మారలేదని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా నూతన పథకాలు ప్రవేశపెట్టి  సామాజిక న్యాయం జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి వెంకటయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, బహుజన నాయకులు అంబేద్కర్ వాది డాక్టర్ ఏకుల రాజారావు, ఆల్ ఇండియా సమతా సైనిక్ డళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు రాచమల్ల నాగయ్య, సిపిఎం నాయకులు  కంబాలపల్లి ఆనంద్ తదితులున్నారు.
గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ: జిల్లా కేంద్రంలోని జీవి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం, 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో  సరోజిని భాయి, మహాత్మా గాంధీ, భరతమాత వివిధ మహనీయులుగా విద్యార్థులు వేషధారణ చేసి మహనీయులను గుర్తు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను గుర్తుచేస్తూ వారికి స్ఫూర్తిగా ఉండాలని మరియు గొప్ప చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి పాల్గొని మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వారి కష్టాన్ని గుర్తించి విద్యార్థులు, బాగా చదువుకొని ఒక జాబ్ చేసి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నారు. ఆ స్కూల్ కమిటీ పేరెంట్స్ మరియు పేరెంట్స్ కమిటీ జిల్లా నాయకుడు బొజ్జ పాండు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి
TS: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ మండలం తుర్కపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, చిన్న లారీని ఓవర్ టేక్ చేసిన వివాదంలో కండక్టర్ బస్సు దిగి రోడ్డుపై మాట్లాడుతుండగా,, వెనుక నుండి కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ,  కండక్టర్ బాల నర్సింహ (47)ను ఢీకొని రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాల నర్సింహ అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్న లారీ డ్రైవర్, బస్సు లోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు సిద్దిపేట జిల్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి కి జోహార్లు: బుడిగ వెంకటేష్
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమ యువకిశోరం కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి 42వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే  అమర జీవి రాగిరెడ్డి వీరారెడ్డి,  పేదల భూముల కోసం రాయినిపాలెం గ్రామంలో అసువులు బబాసిన వీరుడు అని అన్నారు. చిన్నతనం నుండి ఆయన విద్యార్థి సమస్యలు పరిష్కరించబడాలని, వసతి గృహాలలో సరైన వసతి సౌకర్యాలు కావాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ఎస్ఎఫ్ఐలో చాలా తీవ్ర స్థాయిలో కృషి చేసిన్నారని తెలిపారు. విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క వీరారెడ్డి  ఎస్ఎఫ్ఐ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మిర్యాలగూడ డివిజన్ లో బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపట్టారని, ఆ తర్వాత రాయినిపాలెం గ్రామంలో మిగులు భూములు,  గ్రామంలో ఉన్న పేదలకు చెందాలని ఆ పేదల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని, మిగులు భూములలోనే అసువులు బాసిన ధీరుడు అని అన్నారు. ఎర్రజెండాకు వన్నె తెచ్చి మిర్యాలగూడ డివిజన్లో ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్నో విధాలుగా కృషి చేసిన వ్యక్తి వీరారెడ్డి అని, ఆ అమరుడికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను సాధించడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్ర రాహుల్, కిరణ్, హేమంత్, గణేష్, రాజేష్, శ్రవణ్, హేమ శంకర్, హరీష్, అఖల్, తదితరులు పాల్గొన్నారు
'అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందటానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి'
సూర్యాపేట జిల్లా, నాగారం మండలం ఈటూరు గ్రామంలో ప్రతిభ యూత్ ఆధ్వర్యంలో, నేడు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ యూత్ అద్యక్షులు బోడ పరుశరాములు మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని కులాలకి మతాలకి అతీతంగా జరుపుకోవాలని తెలియజేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న సంధర్బంగా, దేశంలో అంటరాని తనం, ఆకలి, అసమానతలు ఉండకూడదన్నారు. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందటానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. కులాల పేరుతో మతాల పేరుతో ఘర్షణలను, హింసను ఎవరు ప్రోత్సహించవద్దని అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా 3000 రూపాయల విలువ చేసే 10 మహనీయుల ఫొటోలను యూత్ కి ఇప్పించిన ప్రతిభ యూత్ కార్యదర్శి బోడ ఉపేందర్ కి అందరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, టెక్నో డీడ్ ఐటీ కంపెనీ చైర్మన్ వంగూరి దామోదర్, 4వ వార్డు మెంబర్ బోడ రమేశ్, కవి గాయకులు పేరాల యాదగిరి, మాజీ వార్డు సభ్యులు, తాపీ యూనియన్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ప్రతిభ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడ మండల బీఎస్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాగిళ్ల మారయ్య
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ బీఎస్పీ అధ్యక్షునిగా కొనసాగుతున్న నాగిళ్ల మారయ్య, ఈ రోజు బీఎస్పీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగా నాగిళ్ల మారయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ నాయకులు  తీసుకున్న ఏకాపక్ష నిర్ణయాలు తన మనసును కలచివేసిందని, మండలంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రశ్నించవలసిన అవసరం ఉందని  నియోజకవర్గ నాయకులకు తెలుపుతే, ఎవరూ పట్టించుకోలేదు. తనకు తెలియకుండా రచ్చబండ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణలో  తనను కాదని వేరే ఒకరి ఫోటో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్, మర్రిగూడ మండలానికి రావడం జరిగింది. అప్పుడు కూడ మండల అధ్యక్షుడు కి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, నియోజకవర్గ  నాయకుడు ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ విధివిధానాలు ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నందువల్ల రాజీనామా చేయవలసి వచ్చిందని నాగిళ్ల మారయ్య తెలిపారు.
'పౌరులందరూ నీతి నిజాయితీ తో ఓటు వేసి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలి'
నల్లగొండ: తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఫలాలు సామాన్యులకు అందుతాయని నాడు ఆశ పడ్డాం,, కానీ నేడు గద్దెనెక్కిన మన పాలకులు  మన దేశ గౌరవాన్ని సైతం పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నారని అన్నారు కార్పొరేట్ అధినేతలకు గులాం గిరి చేస్తున్న రాజకీయ పార్టీల అధినేతలారా.. ఇకనైనా దేశ ఆత్మ గౌరవాన్ని  నిలబెట్టేందుకు, స్వదేశీ స్వవలంబన విధానాలను అమలు చేయాలని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన పౌరులందరూ నీతి నిజాయితీ తో ఓటు వేసి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీరావత్ వీర నాయక్, యువజన సమితి జిల్లా అధ్యక్షులు మేకల శివ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించిందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. అనంతరం ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్పుల నగేష్ ఆధ్వర్యంలో, ఏర్పుల గణేష్.. ఉత్తమ ప్రతిభ క్రమశిక్షణ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ. 2500, ద్వితీయ బహుమతి రూ. 2000 మరియు షీల్డ్ లను, ఫౌండేషన్ సభ్యుడు ఏర్పుల చంద్రశేఖర్ ద్వారా అందజేశారు.
అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరికొంతమంది విద్యార్థులకు పాఠశాల తరపునుండి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాదగిరి, పాఠశాల చైర్మన్ గుండెపూరు శ్రీను, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
నారాయణపురం: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
యాదాద్రి జిల్లా: మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన ఇతర పార్టీకి చెందిన కార్యకర్తలు, నేడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 25 మందికి 6 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా లచ్చమ్మగూడం గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ కి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
NLG: కౌలు రైతులకు అండగా కస్తూరి ఫౌండేషన్
దామరచర్ల: దేశానికి వెన్నుముక అయిన రైతులను, కౌలు రైతులను ఆదుకునేందుకు కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుండి నూతనంగా చేయూత కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు కస్తూరి ఫౌండేషన్ సభ్యులు మెండే వెంకట్ అన్నారు. ఆదివారం మండలంలోని వాచ్యాతండ గ్రామంలో ఆర్థికబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న రెండు కౌలురైతు కుటుంబాలకు అన్నపూర్ణ సేవా సమితి సూచనతో, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మెండే వెంకట్ మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీ చరణ్ తను కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న సమయంలో, పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన కస్తూరి ఫౌండేషన్ పేరుతో ఒక సేవ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు, పాఠశాలల మరమ్మతుల కోసం చేయూతనిస్తూ వస్తున్నారు. 2017 నుంచి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న గొప్ప సేవా తత్పురుషుడు కస్తూరి శ్రీ చరణ్ అని అన్నారు. అందులో భాగంగా దేశానికి వెన్నుముక అయిన రైతులు, నేడు చాలా దీనావస్థలో ఉన్నారని గ్రహించి, వారిని ఆదుకోవడం కోసం  తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో, రైతన్నలకు చేయూత అనే నూతన కార్యక్రమానికి ఈ ఏడాది నుండి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగా మొదటగా దామరచర్ల మండలం వాచ్యా తండ గ్రామంలోని కౌలు రైతులు అయిన రామావతు లచ్చు, ధరావత్ చంద్రులు మృతి చెందిన విషయాన్ని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు శ్రీకాంత్ కస్తూరి ఫౌండేషన్ కు సమాచారం అందించగా వెంటనే స్పందించిన కస్తూరి శ్రీ చరణ్ వారి ఒక్కొక్క కుటుంబానికి  కుటుంబ సభ్యులు అయిన రామావత్ పూరి, ధరావత్ నాగులకు రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల 3 వేల రూపాయల చొప్పున అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేయూతనివ్వడం, నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన కస్తూరి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కస్తూరి ఫౌండేషన్ సహకారంతో తమ అన్నపూర్ణ సేవా సమితి రానున్న రోజుల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలను చేస్తామన్నారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం 5000 రూపాయల  చెక్కును అందించారు. వాచ్యా తండా ఎంపీటీసీ లావురి లక్కీ సింగ్ మాట్లాడుతూ.. తమ గ్రామంలోని రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కస్తూరి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని యువత గ్రామ అభివృద్ధికి పాటుపడితే రైతు అనేవాడు ధైర్యంగా బతుకుతాడని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తేజ నాయక్, అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు తిరుమలేష్, కస్తూరి ఫౌండేషన్ మీడియా ప్రతినిధి చెన్నూరి రవికుమార్, వాచ్యా తండా యూత్ సభ్యులు బాలకోటి, బాలాజీ, రవి, రమేష్ తదితరులు ఉన్నారు.