TS: సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
జనగామ: జిల్లాలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఇరుగు, పొరుగువారు గమనించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామానికి చెందిన గురు, సునీత భార్యాభర్తలు. తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జాజిరెడ్డిగూడెం: నూతన పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా వంగూరి రాములు ఎంపిక
సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం: మండలంలోని టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో, శనివారం పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు వగ్గు సోమన్న, పాఠశాల ప్రిన్సిపల్ కె. శమంతకమణి  అధ్యక్షతన  సమావేశం నిర్వహించి, నూతన పేరెంట్స్ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీ సభ్యుల వివరాలు
అధ్యక్షులు: వంగూరి రాములు
ఉపాధ్యక్షులు: జి. సైదులు
ప్రధాన కార్యదర్శి: కె. మంజుల
కోశాధికారి: మచ్చ బిక్షం
సహాయ కార్యదర్శి: ఒగ్గు సోమన్న
ఆర్గనైజింగ్ కార్యదర్శి:కె.మధుసూదన్ అదేవిధంగా ఎడ్యుకూటి మెంబర్స్ గా ఎం. రవి, జి.వెంకన్న, డి. శంకర్, ఎల్. శ్రీనివాస్, రమ్యకృష్ణ, మమత లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం: బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు
నల్లగొండ జిల్లా: గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హైదరాబాదులో నేడు చేపట్టిన సత్యాగ్రహ కార్యక్రమానికి వెళ్లకుండా తిరుమలగిరి సాగర్ బీఎస్పీ నాయకులను,  తిరుమలగిరి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో తిరుమలగిరి మండల అధ్యక్షులు ఆంగోత్ శివ నాయక్ ఉన్నారు.
మిర్యాలగూడ: గురుకుల పాఠశాల లో నూతన పేరెంట్స్ కమిటీ ఎన్నిక
నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రవీంద్ర సాగర్ ఆధ్వర్యంలో మరియు పేరెంట్స్ కమిటీ సమక్షంలో  శనివారం, నూతన పేరెంట్స్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో నూతన పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్, ఉపాధ్యక్షులుగా రవికుమార్, కార్యదర్శిగా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ట్రెజరర్ గా వల్లపు దాసు నాగయ్య, అడ్వైజర్లు సంధ్య,  సైదులు, తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
DVK: ముందస్తు అరెస్టు అయిన బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు
దేవరకొండ: ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ గన్ పార్క్ వద్ద గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ చేపట్టనున్న సత్యగ్రహ దీక్ష నేపథ్యంలో, దేవరకొండ బీఎస్పీ నాయకులు దీక్షకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం.. బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ ను, ఆయన ఇంటి వద్ద నుండి పోలీసులు బలవంతంగా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
TS: డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
కరీంనగర్: జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని, శుక్రవారం కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ల తెలిపారు. పూర్తి వివరాలు ఇలా.. జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె  ప్రదీప్తి, ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఆమెకు చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు తల్లిందండ్రులకు ముందుగానే సూచించినా,  ఆర్థికస్తోమత లేక వారు మిన్నకుండిపోయారు.
మర్రిగూడ: బీఎస్పీ నాయకుల ముందస్తు అరెస్టు
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ, నేడు చేపట్టనున్న సత్యగ్రహ దీక్షకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం, బహుజన్ సమాజ్ పార్టీ మర్రిగూడ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్యను మర్రిగూడ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హైదరాబాదులో హౌస్ అరెస్టు చేశారని, ఆయన తన ఇంట్లోనే దీక్షను చేపడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న సత్యాగ్రహ దీక్షకు వెళ్లకుండా చేసిన అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బీఎస్పీ నల్లగొండ జిల్లా ఈసీ మెంబర్ పల్లేటి రవీందర్, గ్యార వెంకటేష్ ఉన్నారు.
సబండవర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో వెనుకబడిన కులాలకు చెందిన వృత్తిదారులకు 294 మందికి ఒక్కొక్కరికి,  లక్ష చొప్పున 2 కోట్ల 94 లక్షల రూపాయల విలువ గల చెక్కులను శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సబండవర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని, బీసీలకు లక్ష రూపాయల సాయం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో విద్యార్థులు రాణించాలి: బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నాంపల్లి:
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తే, వారి బంగారు భవిష్యత్తుకు.. క్రీడలు దోహదపడతాయని బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా,  గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 50 లక్షలతో నియోజకవర్గంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాంపల్లి మండలంలోని మోడల్ స్కూల్, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నాంపల్లి, జడ్పీహెచ్ఎస్ పసునూరు, జడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లి పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్, షేటిల్, క్యారం బోర్డ్, చెస్ క్రీడలకు సంబంధించిన సామాగ్రిని కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న యువతకు కూడా త్వరలో క్రీడా సామాగ్రిని అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలని అన్నారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, మండల అధికార ప్రతినిధి పోగుల వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోరే యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, ఇట్టెం వెంకట్ రెడ్డి, యంపిటీసీ రామావత్ బుజ్జి చందూలాల్ , సర్పంచ్ లు గుండాల అంజయ్య , రామావత్ సుగుణ శంకర్ నాయక్ , పిఎసిఎస్ డైరెక్టర్ బెల్లి సత్తయ్య, కుంభం చరణ్ రెడ్డి, గౌరు కిరణ్, కర్నే యాదయ్య, ఎదుళ్ల యాదగిరి, గంజి సంజీవ, ఎదుల్ల సుందర్, మేకల దేవేందర్, ఆంజనేయులు, దండిగ సాలయ్య, నాంపల్లి నాగరాజు, ఒంటెద్దు సత్తిరెడ్డి, అందుగుల దేవయ్య, ఇర్గి వెంకటయ్య, దాచేపల్లి పాండు, పంగనూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు నిర్మించుకునే అసలైన నిరుపేదలకే మూడు లక్షలు ఇవ్వాలి: సిపిఎం మండల కార్యదర్శి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఇండ్లను, నిరుపేదలను గుర్తించి ఇవ్వాలని.. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకంలో అవకతవకలు జరగకుండా, పైరవీలకు తావు లేకుండా, అసలైన నిరుపేదలను గుర్తించి, ఇండ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షలు ఇవ్వాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.