క్రీడల్లో విద్యార్థులు రాణించాలి: బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నాంపల్లి:
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తే, వారి బంగారు భవిష్యత్తుకు.. క్రీడలు దోహదపడతాయని బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా,  గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 50 లక్షలతో నియోజకవర్గంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాంపల్లి మండలంలోని మోడల్ స్కూల్, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నాంపల్లి, జడ్పీహెచ్ఎస్ పసునూరు, జడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లి పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్, షేటిల్, క్యారం బోర్డ్, చెస్ క్రీడలకు సంబంధించిన సామాగ్రిని కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న యువతకు కూడా త్వరలో క్రీడా సామాగ్రిని అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలని అన్నారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, మండల అధికార ప్రతినిధి పోగుల వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోరే యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, ఇట్టెం వెంకట్ రెడ్డి, యంపిటీసీ రామావత్ బుజ్జి చందూలాల్ , సర్పంచ్ లు గుండాల అంజయ్య , రామావత్ సుగుణ శంకర్ నాయక్ , పిఎసిఎస్ డైరెక్టర్ బెల్లి సత్తయ్య, కుంభం చరణ్ రెడ్డి, గౌరు కిరణ్, కర్నే యాదయ్య, ఎదుళ్ల యాదగిరి, గంజి సంజీవ, ఎదుల్ల సుందర్, మేకల దేవేందర్, ఆంజనేయులు, దండిగ సాలయ్య, నాంపల్లి నాగరాజు, ఒంటెద్దు సత్తిరెడ్డి, అందుగుల దేవయ్య, ఇర్గి వెంకటయ్య, దాచేపల్లి పాండు, పంగనూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు నిర్మించుకునే అసలైన నిరుపేదలకే మూడు లక్షలు ఇవ్వాలి: సిపిఎం మండల కార్యదర్శి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఇండ్లను, నిరుపేదలను గుర్తించి ఇవ్వాలని.. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకంలో అవకతవకలు జరగకుండా, పైరవీలకు తావు లేకుండా, అసలైన నిరుపేదలను గుర్తించి, ఇండ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షలు ఇవ్వాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు నిర్మించుకునే అసలైన నిరుపేదలకే మూడు లక్షలు ఇవ్వాలి: సిపిఎం మండల కార్యదర్శి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఇండ్లను, నిరుపేదలను గుర్తించి ఇవ్వాలని.. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకంలో అవకతవకలు జరగకుండా, పైరవీలకు తావు లేకుండా, అసలైన నిరుపేదలను గుర్తించి, ఇండ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షలు ఇవ్వాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి'
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం, పలు విద్యాసంస్థలలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడిగ వెంకటేష్* విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేవరకొండ లో మరియు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని అన్నారు. అదేవిదంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, కార్పొరేట్, ప్రైవేటు ఫీజులు నియంత్రణ చేయాలని దానికోసం ఫీజు నియంత్రణ చట్టం చేయాలని, రెండు నెలలు గడుస్తున్నటికి కూడా ఇంకా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లను అందించలేని పరిస్థితి ఉందని, తక్షణమే విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెజిబివిలు, మోడలల్ స్కూల్స్ లలో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. విద్యా రంగం సమస్యల పరిష్కారం కోసం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సమరుశీల పొరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. దేవరకొండ మండల కార్యదర్శి కుర్ర రాహుల్, కిరణ్, ఆంజనేయులు, రాజేష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు
NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జయంతి
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గ్రంథాలయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో నేడు, గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 131వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రంగనాథన్ గ్రంథాలయ సమాచార శాస్త్రం విశ్వ విద్యాలయాలలో ఏర్పాటు చేయుటలో , గ్రంథాలయాల నిర్వహణలో ఎంతగానో కృషి చేశారని, గ్రంథాలయ సమాచార శాస్త్రంలో మొదటగా పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తిగా రంగనాథన్ నిలిచారని తెలిపారు. రంగనాథన్ మొదటగా స్టాఫ్ మద్రాస్ లో గ్రంథపాలకులుగా పనిచేశారు, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ప్రొఫెసర్ గా గ్రంథాలయ సమాచార శాస్త్రాన్ని బోధించారు. ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం గా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కృష్ణ కౌండిన్య, యాదగిరి, సుబ్బారావు, దీపిక, యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనాథ్ పటేల్, శివరాణి, శిరీష, శ్రీధర్, నారాయణరావు, చంద్రయ్య, గ్రంథాలయ సిబ్బంది అసిస్టెంట్ లైబ్రేరియన్ మన్నెమ్మ, వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
విడుతల వారీగా సెప్టెంబరు 15 నాటికి రూ.లక్ష వరకు రుణ మాఫీ
TS: రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ ప్రక్రియను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై వారానికి కొంత మొత్తం చొప్పున నిధులు జమ చేస్తారు. ఈ నెల 3న రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ చేయగా, అదే రోజు రూ. 37 వేల- 41 వేల మధ్య ఉన్న రుణాలున్న 62,758 మంది రైతులకు మాఫీ చేస్తూ రూ.237.85 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసింది. రెండో విడతలో 5,86,270 మందికి రూ.1374.96 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 25.98 లక్షల మంది రైతులకు రూ.18,004 కోట్లు అందాల్సి ఉంది. వీటిని ఈ నెల నుంచి వచ్చే నెల రెండో వారం వరకు 5 విడతల్లో విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు రూ. 41 వేల వరకు రుణం ఉన్న వారికి చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన వారిని అయిదు కేటగిరీలుగా చేసి ప్రతి వారం నిధులు జమ చేయనున్నారు. మొత్తానికి సెప్టెంబరు 15 నాటికి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్థికశాఖకు నిర్దేశించినట్లు తెలిపారు.

రుణమాఫీపై  రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలో లబ్ధిపొందిన రైతుల జాబితాను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి రుణమాఫీ అయిన విషయంపై,  సీఎం కేసీఆర్‌ లేఖలు రాయనున్నట్లు సమాచారం.
NLG: అర్బన్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సుల పోస్టులు భర్తీ చేయాలి: బివి చారి
నల్లగొండ: PYL ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల అర్బన్ హాస్పిటల్ ను ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం, సందర్శించి సమగ్రంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.వీ చారి పాల్గొని మాట్లాడుతూ.. ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సర్వేలు నిర్వహిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా నల్గొండ పట్టణంలోని అర్బన్ హాస్పిటల్స్ లలో సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. పానగల్ రోడ్డులో గల అర్బన్ హాస్పటల్లో రోజుకు 150 నుండి 200 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారని,ఇద్దరు డాక్టర్లు,15 మంది నర్సులు ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒక్క డాక్టర్, ఆరుగురు నర్సులు మాత్రమే ఉన్నారని, దీంతో వారిపై మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు, వచ్చేరోగులు గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్పిటల్స్ లలో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని, హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కారణంగా అన్ని వార్డులలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యార్థులకు హెల్త్ చెకప్ లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా మురుగు వాడల్లో, కాలువలలో స్లమ్ ఏరియాలలో ఈగలు, దోమలు పందులు, స్వైరవిహారం చేస్తున్నాయని దీనితో చికెన్ గున్యా, టైఫాయిడ్, కలరా, మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం దోమల నివారణ చర్యలు చేపట్టాలని, పరిసరాలను రెగ్యులర్గా పరిశుభ్రంగా ఉంచాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు. హాస్పటల్ కు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్నిరకాల కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. గుండె, ఊపిరితిత్తులు తదితర రోగాలపై వెంటనే స్పందించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రతి హాస్పిటల్ కు ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని, హాస్పిటల్ లో 24 గంట సర్వీస్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో డిఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పివైఎల్ నాయకులు దాసరి నరసింహ, రావుల వీరేశం, జానపాటి శంకర్, చెవిల శంకర్, క్రాంతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
"నల్లగొండలో బహుజన విద్యార్థి గర్జన"
TS: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్ లో విద్యకు 60 వేల కోట్లు కేటాయించి, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వేరోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ (SSU) ఆధ్వర్యంలో లక్ష్మీ గార్డెన్లో జరిగిన "బహుజన విద్యార్థి గర్జన" సభకు ముఖ్య అతిధిగా ఆర్ఎస్పి హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో విద్యకు నిధులు కేటాయించమంటే, మద్యానికి అధిక నిధులు కేటాయించి మద్యం అమ్మకాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపారని ఆరోపించారు. మద్యం టెండర్లలో స్వయంగా మంత్రులే బినామీ పేర్లతో టెండర్లు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న  ప్రభుత్వం.. పేద విద్యార్థులు చదువే పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ ద్వారా విదేశీ విద్య అభ్యసన, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. విద్యకు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారో ముఖ్యమంత్రితో చర్చించుటకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. బహుజనుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థి ముఖ్యమంత్రి అయినట్టేనన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. పేద ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి ఈ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. 99శాతమున్న పేదలకు సంపద, రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల చేయడంతో లక్షలాది మంది గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విన్నపం మేరుకు మరో మూడు నెలలు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు, గురుకుల ఉద్యోగాలకు మధ్య ప్రిపరేషన్ కు మధ్య కాల వ్యవది తక్కువ ఉండడంతో లక్షలాదిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నరన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే "మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా" పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నిర్మిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడతామన్నారు. జాంబావ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 వేల గ్రామాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఏసీ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఉద్యోగ హక్కు చట్టం తీసుకువచ్చి, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో యువజన సహకార సంఘాలకు 25 శాతం కాంట్రాక్టులు కేటాయించి లక్షల కోట్ల బడ్జెట్ ను యువతుల చేతిలో పెడతామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ఆధిపత్య వర్గాలకు మాత్రమే కాంట్రాక్టులు కేటాయిస్తుందని విమర్శించారు. 'యువతను కాంట్రాక్టర్లుగా మార్చే ఏకైక పార్టీ బీఎస్పీ' నే అని అన్నారు. మాన్యశ్రీ కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది, స్థానిక సంస్థల్లో యువతకు 30% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. యువతకు మంత్రివర్గంలో తర్ఫీదునిస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జానపద కళలు, గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహిస్తామన్నారు. శ్రీకాంతాచారి ఉద్యోగహామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పేపర్ లీకేజీ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఎంవిఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అందరికీ విద్య అనేది దురదృష్టవశాత్తు రాజకీయాలతో ముడిపడి, ప్రధాన సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు. పేదల విద్యపై ఆధిపత్య పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థి, యువత కోసం బడ్జెట్ లో 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని బీఎస్పీ హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మంత్రిత్వశాఖలను నియంత్రించేలా విద్యార్థులను షాడో మంత్రులుగా నియమిస్తానని బీఎస్పీ ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. విద్యా సంక్షోబానికి పాలకులే కారణమన్నారు.

సభ ప్రాంగణానికి రావడానికి కంటే ముందుగా, నార్కట్ పల్లి-అద్దంకి బైపాస్ నుండి లక్ష్మీ గార్డెన్ వరకూ విద్యార్థులు ఆర్ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. సభకు స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ అధ్యక్షత వహించగా, సభలో రాష్ట్ర అధ్యక్షులు మొగిలిపాక నవీన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిగొండ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర ఇంచార్జ్ మాధవి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అందే అజయ్, నల్లగొండ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఆకులపల్లి నరేష్, మోసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు కట్టెల శివ, మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్ఎస్పీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ మల్లికార్జున్ కు డాక్టరేట్.
నల్లగొండ: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకులు  మల్లికార్జున్,  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల మోనాడు యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టులో పీహెచ్డీ అవార్డు పొందారు. "ఆన్ ఎనలిటికల్ స్టడీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ఫెమినైన్  సప్రేషన్ అండ్ ప్యాట్రియార్కి ఇన్ ద ఇండియన్ సొసైటీ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్టెడ్ ఫిమేల్ ఆథర్స్" అనే టాపిక్ లో.. డాక్టర్ అజిత్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేసి  పిహెచ్డి  పొందారు. ఈ సందర్భంగా గురువారం డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. తన పీహెచ్డీ డాక్టరేట్ కు సహకరించిన ప్రిన్సిపాల్ మరియు డిపార్ట్మెంట్ సభ్యులకు, ఇతర అధ్యాపక బృందానికి మల్లికార్జున్ తన యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ సబ్జెక్టులో తమ కాలేజీకి చెందిన మల్లికార్జున్ కు డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయమని ప్రశంసించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల, దేవయాని, లైబ్రేరియన్ డాక్టర్ రాజారామ్, రవిచంద్ర, భాస్కర్ రెడ్డి, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, బిక్షమయ్య, యాదగిరి, తదితరులు డాక్టర్ మల్లికార్జున్ కు అభినందనలు తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు ఎమ్మెల్యే
చౌటుప్పల్: మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ, మృతి చెందిన బాలగొని నాగేష్ కుటుంబ సభ్యులను గురువారం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు పరామర్శించి, నాగేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిలర్ అధ్యక్షుడు ఎం.డీ బాబా షరీఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.