నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 13:24

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు వెళుతుంటే ఔటర్ రింగురోడ్డు వద్ద కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి. మేమంతా సిద్ధం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 12:18

నిర్బంధ అరెస్టులు మాకు కొత్తేమి కాదు: ఈటల రాజేందర్

నిర్బంధించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తమకు అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.

బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని గురువారం ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

ప్రతిసారీ అధికార పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షాలుగా తమపై ఉందన్నారు.

కానీ కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే బీఆర్ఎస్‌ను ప్రజలు మార్చడం ఖాయమని హెచ్చరించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు....

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 12:16

భైంసాలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

నిర్మల్ జిల్లా:జులై 20

బైంసా పట్టణంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలిసింది

పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన తోట శంకర్ (30) అనే వ్యక్తిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ సదరు వ్యక్తి బైక్ పై గోపాల్ నగర్ కాలనీకి వచ్చి తోట శంకర్ ను బయటకు పిలిచినట్లుగా సమాచారం.

నిద్ర నుంచి మేల్కొని ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువకునిపై సదరు వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది.

ఇక.. బాదితుడు అరుపులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు బయటికి వచ్చేసరికి దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను తీసుకవచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది.

గాయాలపాలైన తోట శంకర్ ను కాలనీకి వాసులు హుట హూటిన స్థానిక ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించినట్లుగా తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బైకు ను స్వాధీన పరచుకున్నారు. నిందితుడు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు....

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 12:13

Pawan Kalyan: జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

నేడు నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 12:12

Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం ఘాటుగా స్పందించారు..

ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.

ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు.

ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మోదీ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ భరోసా ఇచ్చారు..

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 10:36

కూతురు బర్త్ డే కు టమాటో గిఫ్ట్

కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేయడం, పండ్లు పంపిణీ చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కూతురి పుట్టిన రోజు నాడు వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. టమాటలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు

మనం ఏ కూర వండినా అందులో టమాటను మస్ట్‌గా వాడుతుంటాం. అలాంటి టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు వాటిని కొనలేకపోతున్నారు.

అందుకే టమాట ధరలు కొండెక్కిన ఈ సమయంలో వాటిని పేదలకు పంచిపెట్టి తన కూతురి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేయాలని అనుకున్నాడు హైదరాబాద్‌ పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివ.

అనుకున్నట్టుగానే బుధవారం నాడు టమాటలను పంచిపెట్టాడు. టమాటల పంపిణీ అంటే ఏదో నాలుగైదు కిలోలు.. మహా అయితే 10 కిలోలు పంచిపెట్టాడని అనుకుంటున్నారేమో!

కాదు.. కాదు.. ఏకంగా 4 క్వింటాళ్ల వరకు టమాటలను పంపిణీ చేసి ఔరా అనిపించాడు నల్ల శివ. టమాట ధరలు ఆకాశన్నంటిన తరుణంలో బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా పెద్దమొత్తంలో టమాటాలను ఉచితంగా పంపిణీ చేయడం ఆసక్తిగా మారింది....

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 10:26

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం..

న్యూఢిల్లీ..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభంకాబోతున్నాయి. ఆగస్ట్ 11 వరకు మొత్తం 17 పని దినాల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి..

ఈ సమావేశాల్లో మొత్తం 31 బిల్లులను ప్రవేశపెడుతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

మరోవైపు ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగబోతున్నాయి. మణిపూర్ లో చెలరేగిన హింసపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయబోతున్నాయి.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.

తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. పార్టమెంట్ సెషన్స్ కు ముందు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది..

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 10:19

మబ్బే మసకేసిందిలే

ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరమైతె రెండు రోజులుగా ముసురు కమ్మేసింది. కాగా గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీనికి తోడు తీవ్ర చలిగాలుల వీస్తుండటంతో నగర వాసులు బయటకు రావడానికే జంకుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి భూపాలపల్లి లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలను కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు....

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 09:56

11 పార్టీలే మిగిలాయ్‌.. ఏ గ్రూపులోనూ చేరని ఎంపీలు 91 మంది..

•వైకాపా, తెదేపా, భారాస, బిజూ జనతాదళ్‌ తటస్థంఎన్డీయే, ఇండియాల్లో 65 పార్టీలు

దిల్లీ: దేశంలో రాజకీయ పునరేకీరణలో భాగంగా ఎన్డీయే, ఇండియా కూటముల్లో పార్టీలు భారీగా చేరాయి..

ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. ఇందులో ఏపీలోని వైకాపా, తెదేపా, తెలంగాణలోని భారాస, ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ ప్రధానమైనవి. ఈ 3 రాష్ట్రాల్లో 63 ఎంపీ సీట్లున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది..

ఏ కూటమిలోనూ లేని పార్టీలు

వైకాపా, భారాస, బిజూ జనతాదళ్‌, బీఎస్పీ, మజ్లిస్‌, తెదేపా, శిరోమణి ఆకాలీదళ్‌, ఏఐయూడీఎఫ్‌, జనతాదళ్‌ (ఎస్‌), ఆర్‌ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్‌ (మాన్‌).

వైకాపా, బిజూ జనతాదళ్‌ తరచూ పార్లమెంటులో భాజపాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.

తెలంగాణలోని భారాస ఈ ఏడాది మొదట్లో భాజపాకు వ్యతిరేక కూటమి కట్టాలని ప్రయత్నించింది. కానీ ప్రస్తుతం రెండు కూటములకూ దూరంగానే ఉంది.

రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యతిరేక గళమెత్తాలని తమ ఎంపీలకు ఆయన సూచించారు.తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్‌ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటకల్లో ప్రభావం చూసే అవకాశముంది..

నిజంనిప్పులాంటిది

Jul 20 2023, 09:52

కేటీఆర్‌ పుట్టిన రోజున ట్రై క్రీడా పోటీలు

రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా క్రీడాప్రాధి కారిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రై రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో నాలుగు బహుమతులు, శాలువ, జ్ఞాపికలతో సత్కరించడంతో పాటుగా ప్రశంస సర్టీఫికెట్లు బహుకరించనున్నారు. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ పోటీల్లో సుమారు 5 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు సమాచారం.

ఇటీవల క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్వహించిన సీఎం కప్‌ పోటీలతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు క్రీడాకారుల్లో ఉత్సాహం రావడంతో కేటీఆర్‌ పుట్టిన రోజు క్రీడల పండుగగా ట్రై పోటీలు నిర్హపించేందుకు శాట్స్‌ సిద్ధమైంది.

ఈ పోటీల్లో సైక్లింగ్‌ కు ట్యాంక్‌ బండ్‌, నక్లస్‌ రోడ్డు వేదికకాగా, మహిళల మల్లయుద్ధానికి కోట్ల విజయ భాస్కర్‌ స్టేడియం, స్కేటింగ్‌ కు ఇందిరా పార్కు స్కేటింగ్‌ ట్రాక్‌ వేదిక కానుంది.

ఈ నెల 24న ఉదయం నుంచి ఈ పోటీలను నిర్వహించనున్న నేపధ్యంలో పర్యవేక్షకులకు తగిన సూచనలను క్రీడాప్రాధికారిక సంస్థ చేస్తోంది....