అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి ఆశయాలను సాధిద్దాం: మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
![]()
అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి గారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన ఆశయాలని సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘననివాళని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు అన్నారు . శుక్రవారం వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నోముల రామి రెడ్డి 18 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోముల రామిరెడ్డి ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన సిపిఎం డివిజన్ నాయకులు కందాల రంగారెడ్డి సారధ్యంలో సంగెం గ్రామంలో ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు భూములను భూమిలేని పేదలకు పంచాలని వివిధ కులాల వృత్తిదారులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి వారందరికీ ప్రభుత్వ భూములు ఇప్పించారన్నారు* *కల్లుగీత కార్మికుల హక్కుల కోసం,దున్నేవాడికే భూమి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించారని అన్నారు* *సంగం గ్రామం తో పాటు పరిసర గ్రామాలుగా ఉన్న వర్కట్ పల్లి, గోకారం,ధర్మారెడ్డిపళ్లి గ్రామాల్లో సిపిఎం పార్టీ విస్తరణ కోసం నిరంతరం కృషి చేశారని పేదల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వమంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు* *భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించారని వారి యొక్క స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు* *ఈ కార్యక్రమంలో రాంరెడ్డి సహచరులు సింగిల్ విండో చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మాజీ సర్పంచ్ లు కీసరి రాంరెడ్డి కాసుల కృష్ణ,మాజీ ఎంపీటీసీ పబ్బతి మల్లేశం,సిపిఎం శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య సీనియర్ నాయకులు ఏనుగు సాయి రెడ్డి, నోముల జంగారెడ్డి,అంగిడి దేవేందర్ రెడ్డి,సురకంటి లక్ష్మారెడ్డి,ఏనుగు ప్రభాకర్ రెడ్డి,బండి గారి శంకరయ్య,వరికుప్పల మల్లేశం,కీసరి రంగారెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,చేగురి నర్సింహ,నారి రామస్వామి,మాడుగుల వెంకటేశం,జక్కుల వెంకటేశం, రామిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వర్థంతి అనంతరం రాంరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్థూపం వద్ద మొక్కలు నాటడం జరిగింది.
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రములో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, కార్యదర్శి రామదాసు లు మాట్లాడుతూ... న్యాయవాదులపై రోజురోజుకు జరుగుతున్న దాడులకు రక్షణగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ఈర్లపల్లి భిక్షపతి అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ ఫైళ్ల సంధ్యా రాణి- ఉపేందర్ రెడ్డి గార్లు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో , గూడూరు వెంకటరెడ్డి ,కొండే కిష్టయ్య, మంగ జగన్ (మాజీ సర్పంచ్ ) ,మంగ బాలయ్య, మంగ నర్సింహ, వేముల భిక్షపతి, ఎడవేల్లి బాలదరి, నర్సింహ,ఎల్లస్వామి,ఈర్లపల్లి స్వామి , తదితరులు పాల్గొన్నారు.
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మరియు నీలం థియేటర్, గోపరాజుపల్లి, సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డా" మామిడి కృష్ణ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మిమిక్రీ శ్రీనివాస్ , సినీ నటుడు ప్రదీప్ (అంతేగా... అంతేగా ) అజయ్ మంకెనపల్లి అన్న, సింగపంగ ప్రభాకర్, అబ్దుల్ కలీం ఆజాద్, బిర్రు కిరణ్ కుమార్, జితేందర్, జరిగింది,మరియు నీలం నాటకం రచయిత మరియు దర్శకుడు,నీలం నరేష్ జూలై 15 మధ్యాహ్నం రెండు గంటలకు నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో, నాంపల్లి, లో నాటకం ప్రదర్శించడం జరుగుతుందని ఈ నాటకానికి ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించాలని నీలం థియేటర్ ప్రెసిడెంట్ నరేష్ మాట్లాడడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతాళ్లగూడెం గ్రామానికి చెందిన ఉద్దగిరి ఎల్లయ్య తండ్రి బాలయ్య వయసు 60, అనే రైతు తన తమ్ముడు సైదులు తో కలిసి తేదీ 8 -07- 2024 సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పాముకాటు గురయ్యాడు .ఈ విషయాన్ని తన తమ్మునికి తెలుపగా తమ్ముడు ఇంటికి ,108 కి సమాచారం అందించాడు. 108 వాహనంలో చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు మృతి చెందాడు .సోదరుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.
భువనగిరి మున్సిపల్ 8 వ వార్డ్ రామ్ నగర్ సీత నగర్ జాంఖాన్నగూడెం నందగుట్ట పరిదిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భువనగిరి పరిధిలో ఎలక్ట్రిక్ స్ప్రే మిషన్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అన్ని గృహలకు డోర్ టూ డోర్ దోమలు మందులు పిచికారి కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ….ఇంటి లోపల గోడలపై పిచికారీ చేసే దోమల మందు సింజెంట వారి ఐకాన్ (Syngenta – ICON) క్రిమి సంహారక మందు వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవని, ఈ మందు ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా నివారించ వచ్చని, మందు పిచికారి చేసిన ప్రదేశాలలో నీటితో కడగటం వంటివి చేయడం ద్వారా మందు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు. ప్రజలు గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్‌షేడ్‌లు, టైర్లు, ఇతర డంప్ చేయబడిన కంటైనర్లు & మెటీరియల్స్, స్తబ్దుగా ఉన్న డ్రైన్ పాయింట్లు, కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు తీసివేయడంతో పాటు నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ రజిత, జవాన్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
Jul 12 2024, 15:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.9k