దళిత ఎస్సై మృతికి కారకులను ఉద్యోగం నుండి తొలగించి హత్య నేరం నమోదు చేసి అరెస్టు చేయాలి: తళ్ళమల్ల హసేన్ మాలమహానాడు తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షులు
అశ్వరావుపేట సిఐ జితేందర్ రెడ్డి, మరో ఐదుగురు కానిస్టేబుల్, కుల అహంకారానికి అవమానానికి గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల శ్రీనివాసు మృతి చెందారు. *ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్,రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయల అఖిల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామా వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు*. సీఐ జితేందర్ రెడ్డి కుల వివక్ష అహంకారంతో, ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించినట్లు ఇటీవల టీవీ చానల్స్ పత్రికలలో వార్తలు వచ్చాయి సిఐ జితేందర్ రెడ్డి, తన వద్ద పనిచేస్తున్న, ఐదుగురు కానిస్టేబుల్ వేధింపులు కుల వివక్ష కారణంగా,ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వారావు పేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఎస్సై శ్రీరాములు శ్రీను (38) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. జూన్ 30న మహబూబ్‌నగర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. దళిత వర్గానికి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించి ఆత్మహత్యకు కారకుడైన,సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజు, ఉమెన్ పీసీ నాగరాణి,పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు హత్య నేరం కింద అరెస్టు అరెస్టు ఉద్యోగాల నుండి తొలగించాలి శ్రీరాముల శ్రీను,కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jul 08 2024, 16:28