VijayaKumar

Jul 04 2024, 18:59

వలిగొండ మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్


ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ వలిగొండ మండల కమిటీలు* *గురువారం రోజున దేశవ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా వలిగొండ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలో ఎస్ఎఫ్ఐ బంద్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి మహేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థుల నిర్వహించే ప్రవేశ పరీక్షలలో జరిగిన అవగాహన నిరసిస్తూ జాతీయ పరీక్షల సమగ్రతలను కాపాడాలని అన్నారు కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలలో ఎన్డీఏ ను రద్దు చేయాలని నేటి యూజీసీ నెట్ టిఆర్ఎస్ కంబైన్డ్ నెట్ ఒకటోగులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి జాతీయ పరీక్షల సమగ్రత కృషి చేయాలని కాపాడాలని ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యా పై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాగేసుకొని విద్య పూర్తి నియంత్రణ కోసం యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని అన్నారు మరియు నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని దేశంలో పాఠశాలల మూసివేతనువిరమించుకోవాలన్నారు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం తెచ్చి, అధిక ఫీజులను నియంత్రణ చేయాలని విద్యారంగ పరిరక్షణకై తీసుకున్న కార్యాచరణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగిందిబందులో భాగంగా పులిగిల్ల,గోకారం,అరూరు,సంగెం గ్రామాలలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఎండి ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్,మండల సహాయ కార్యదర్శి వేములకొండ వంశీ చెరుక సుదర్శన్ యాసోబు ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ బైకాని గణేష్, ఏఐవైఎఫ్.. ఏఐఎస్ఎఫ్ నాయకులు మేడి దేవేందర్, సంగి కృష్ణ , అనిల్ రెడ్డి ,మహేష్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు*

VijayaKumar

Jul 04 2024, 18:56

మోత్కూరు : విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేయడంతో పాటు నీట్ పరీక్ష ఫలితాలను తక్షణమే రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు సరైన న్యాయం చేయాలని, ప్రవేశ పరీక్షల్లో విఫలమైన ఎన్‌టీఏ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న నీట్, యూజీసీ-నెట్ లీకేజీల వ్యవహారాన్ని సీబీఐ చేత కాకుండా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ ఏఐవైఎఫ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయంతమైంది. జిల్లా లోని మోత్కూర్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యాసంస్థల తరగతులు బహిష్కరించారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్ రావ్ సెంటర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి లీకైన నీట్ యోజేసినట్టు ప్రశ్న పత్రాలను దగ్ధం చేశారు. ఈ రాస్తారోకో నుద్దేశించి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ మరియు యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకేజీ ల వల్ల దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, నీట్ మరియు నెట్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీల ఉదాంతం రోజురోజుకు పెరిగి పెద్దదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు బీహార్ పోలీసులు 14మందిని అరెస్టు చేశారని, అదేవిధంగా మరికొంత మందికి నోటీసులు జారీచేసి సీబీఐ విచారణ అని చేతులు దులుపుకున్నారే తప్ప ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ దర్యాప్తు ఇంతవరకు చేయలేదని మండి పడ్డారు. గత ఏడేళ్లలో బిజెపి పాలిత రాష్ట్రాలలో సుమారు 70 ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్స్ లీకేజీ అయ్యాయని, దీనివల్ల 1.7 కోట్ల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారాయని, మరోవైపు వెలుగులోకి రాని లీకేజీలు ఇంకెన్నో ఉన్నాయని విమర్శించారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ మరియు ప్రవేశ పరీక్షల పై ఉన్న విశ్వసనీయత, నమ్మకం దెబ్బతింటుందని, నీట్ మరియు నెట్ పేపర్స్ లీకేజి వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం "ది నోటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్" చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) రద్దు చేయడంతో పాటు నీట్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలని, అదేవిధంగా నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకేజి కేసు పై సుప్రీం కోర్టు జడ్జితో సమగ్రమైన దర్యాప్తు జరిపించి దోషులను కటినంగా శిక్షించాలని, ఎన్.టీ.ఏ నిర్వాకం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రుఅనిల్ , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సురేష్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు శ్రీను ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపాక చందు ఎస్ఎఫ్ఐ నాయకులు చింటు ఏఐవైఎఫ్ నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 04 2024, 18:50

ప్రయాణికులకు అసౌకర్యంగా మారిన భువనగిరి ఆర్టీసీ బస్ స్టేషన్, సౌకర్యాలు మెరుగుపరచాలని lవినియోగదారుల డిమాండ్

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ అసౌకర్యాలకు నిలయంగా మారిందని అధికారులు చర్యలు తీసుకొని సౌకర్యాలు మెరుగు పరచాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం వేలాదిమంది ప్రజలు భువనగిరి బస్ స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారని, ప్రతి రోజూ సుమారు నలబై డిపోలకు చెందిన బస్సులు బస్సులు భువనగిరి బస్ స్టేషన్ కు వచ్చిపోతుంటాయని ఆయన అన్నారు.తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం భువనగిరి బస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రయాణికులకు తాగు నీరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, మంచి క్యాంటీన్ సౌకర్యం, బస్ స్టేషన్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారుల అలసత్వం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.భువనగిరి బస్ స్టేషన్ లోపల ఉన్న దుకాణాలు తొలగించి, ప్రయాణికుల సౌకర్యార్థం వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నోసార్లు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు విన్నవించినా , ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యంగా నల్లగొండ వైపు వెళ్లే దారిలో వచ్చే దుర్వాసనతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, అలాగే నల్లగొండ వెళ్ళే వైపు ఉన్న కార్గో సెంటర్ ను ఏకంగా బస్ స్టేషన్లో ఏర్పాటు చేసారని, కార్గో వస్తువులు బస్ స్టేషన్లో అడ్డదిడ్డంగా పడి వేయడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారిందని ఆయన అన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రైవేటు వాహనాలకు బస్ స్టేషన్ లోనికి అనుమతి లేకున్నా, అధికసంఖ్యలో ఆటోలకు బస్ స్టేషన్లో అడ్డాగా మారిందని ఆయన అన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలని లేనిచో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

VijayaKumar

Jul 04 2024, 16:29

వలిగొండ: త్రిబుల్ ఆర్ బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు పరచాలి : సిపిఎం డిమాండ్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు* *గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు* *మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

VijayaKumar

Jul 04 2024, 16:17

దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం : సిపిఎం

నాడు తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నైజాం రజాకార్ల కబంద హస్తాల కింద నలుగుతున్న ప్రజలను చైతన్యం చేసి ప్రజా పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు గురువారం రోజున మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు వెంకటేశం తో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ 1946 జూలై 4వ తేదీన నాటి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామ తాలూకా కడవెండి గ్రామంలో భూస్వాములు రజాకార్ల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు అమలవుతున్న వెట్టిచాకిరి కి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో ముందు భాగాన నిలిచిన దొడ్డి కొమరయ్య తుపాకీ తూటాలకు గురై అమరుడు అయ్యాడన్నారు నాడు తెలంగాణ ప్రాంతంలో విసునూరు రామచంద్రారెడ్డి,జానకమ్మ, బాబు దొర లాంటి భూస్వాములు ఆ ప్రాంతంలో ప్రజలచేత వెట్టి చేయిస్తూ ప్రజలపై అనేక భారాలు వేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘంలో సభ్యుడుగా చేరిన యువకుడైన దొడ్డి కొమరయ్య వారి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో తుపాకీ తూటాలకు లోనై మరణించారని ఆయన స్ఫూర్తి తో నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడవలసిన అవసరం నేటితరం యువతపై ఉందని ఆయన స్ఫూర్తితో మరిన్ని ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం సీనియర్ నాయకులు దొడ్డి బిక్షపతి, నాయకులు రాధారపు మల్లేశం,కొమ్ము స్వామి వేముల నాగరాజు, మొగిలిపాక యాదయ్య, నరసింహ,శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 22:01

జిల్లా గురుకులాల సమస్యలను పరిష్కరించలేని ఆర్ సి ఓ ను సస్పెండ్ చేయాలి, సమస్యల వలయంలో మోత్కూర్ గురుకులం :AISF

విద్యార్థి యువనజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గురుకుల బాలుర పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గత రెండు రోజులుగా మోత్కూర్ గురుకుల బాలుర హాస్టల్ లో కనీసం మెను పాట్టించుకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా అధికారులు పూర్తిగా విఫలమైనారు అన్ని ఆరోపించారు.* *అదే విధంగా నాసిరకం పాల ప్యాకెట్లను పాలను విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపించారు.* *పూర్తిగా కాంట్రాక్టర్లు అధికారుల పర్యవేక్షణలో పాఠశాల నడుస్తుందని అన్నారు.* *పాఠశాల చుట్టూ కనీసం ప్రహరీ గోడ లేకుండా లక్షల రూపాయలను ప్రతి నెల బిల్డింగ్ యాజమాన్యానికి కడుతున్నారు తప్ప కనీసం బిల్డింగ్ మరమ్మతులు చేపియడంలో పూర్తిగా విఫలమైనారు అన్ని ఆరోపించారు.* *విద్యార్థులకు కనీసం మినరల్ వాటర్ సౌకర్యం కల్పించలేని వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని అన్నారు.* *తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు..* *ఈ కార్యక్రమంలో SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ బుర్రు అనిల్ కుమార్, AISF జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతికుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్,అనిల్,శ్రీకాంత్,ప్రవీణ్, వెంకటేష్,రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 18:02

భువనగిరి: సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా 9వ వార్షికోత్సవ వేడుకలు

తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకొని, ఎన్నో సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కారం చేసిన సుమన్ టీవీ తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరం లోనికి ప్రవేశిస్తున్న సందర్భంగా సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాయగిరి లోని సహృదయ వృద్ధాశ్రమంలో ఎస్ టీవీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ సుమన్ టీవీ ఎస్ టీవీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమై కొద్ది కాలమే అయినా , ఎన్నో మానవీయ కథనాలు, ఇన్వెస్టిగేషన్ కథలు అందించి అందరి అభిమానాన్ని పొందారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, ప్రతి పేదవాడికి సుమన్ టీవీ అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు సురుపంగ ప్రకాష్, గడ్డమీద శేఖర్ తదితరులు సుమన్ టీవీ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ టీవీ సిబ్బంది శరత్ చంద్రారెడ్డి, సతీష్ రెడ్డి, పిట్టల అరుణ్, ప్రవీణ్, మాధవరెడ్డి, సహృదయ వృద్ధాశ్రమంలోని వృద్దులు పాల్గొన్నారు.


VijayaKumar

Jul 02 2024, 17:40

వలిగొండ : రేషన్ కార్డులు ,నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలి : సిపిఎం డిమాండ్

రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను, 60 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు సిపిఎం నిర్వహిస్తున్న రెండవరోజు 'పోరుబాట' కార్యక్రమంలో భాగంగా మంగళవారం దాసిరెడ్డిగూడెంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేదలకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల రేషన్ బియ్యం తో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాలకు వారు దూరమవుతున్నారన్నారు,మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అనేకమంది వృద్దులు 60 సంవత్సరాలు నిండిన తమకు పెన్షన్ అందక ఎదురుచూపులు చూస్తున్నారని 60 సంవత్సరాలు నిండిన వారందరికీ వెంటనే నూతన పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు,దాసిరెడ్డిగూడెం నుండి రేపాకు కు వెళ్లే రోడ్డులో ఉన్న కల్వర్టులు వర్షాకాలం సమయంలో నీరు చేరడం వల్ల ఆరోడ్డు మార్గంలో వెళ్లే రేపాక,కంచనపల్లి గ్రామాల ప్రజలకు,ప్రయాణికులు ప్రయాణం చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెంటనే రెండు కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో కొత్త కాలనీలో ఉన్న ఎస్సీ కాలనీలో ఓపెన్ డ్రైనేజీ వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఓపెన్ డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చాలని డిమాండ్ చేశారు దాసిరెడ్డిగూడెం నుండి వలిగొండ కు వచ్చే మార్గంలో మూలమలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు లేక అనేక ప్రమాదాలు జరిగాయని వాటిని ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి కొమ్ము స్వామి, నాయకులు ఫాలోజు శంకరాచారి,కందుల బాలయ్య,అశోక్ నరసయ్య,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

VijayaKumar

Jul 02 2024, 17:36

భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే పైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్

భువనగిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ దగ్గర హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారి పైన అండర్ పాస్ నిర్మాణం తక్షణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుబాటలో భాగంగా భువనగిరి పట్టణం నుండి పెంచికలపహాడ్, కృష్ణాపురం గ్రామాలతో పాటు మూడు మండలాలు 24 గ్రామాలకు వెల్లెడానికి ఉన్న రోడ్డు జాతీయ రహదారి దాటడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్షణం అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ భువనగిరితో పాటు వలిగొండ, ఆత్మకూరు మండలాలలోని 24 గ్రామాల ప్రజలు అవసరాల కోసం భువనగిరి కి హైదరాబాద్ కు వివిధ గ్రామాలకు వేలాదిమంది రైతులు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు రాకపోకలు ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు. భువనగిరి ఐటిఐ దగ్గర రోడ్డు దాటే సందర్భంలో అండర్ పాస్ లేకపోవడం వల్ల ఇప్పటికి 100 మంది పైగా యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నారని, వందలాదిమంది కాళ్లు చేతులు విరిగి శత గాత్రులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. పాలకులు ఎన్నికలప్పుడు వివిధ సందర్భాలలో ప్రజలను మభ్య పెట్టడం ఓట్లు దండుకోవడం గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రోడ్డు వేసినాడే నేషనల్ హైవే దాటడానికి తమ గ్రామాలకు పోయి రావడానికి ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయవలసిన అవసరం, ఏర్పాటు చేయించే బాధ్యత ఆనాడు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు బాధ్యత తీసుకొని ఈ నేషనల్ హైవే ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, సిపిఎం నాయకులు వడ్డబోయిన వెంకటేష్, గుండెబోయిన దానయ్య, గ్రామ ప్రజలు సిరికొండ కృష్ణ, సిలువేరు రాజు, భువనగిరి నరసింహ, బసాని కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 17:33

తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పలు గ్రామాల్లో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పై నిర్వహించిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు.. తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వ్యాపార సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మండలంలోని జగ్గయ్య తండాలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత వాసాలమర్రి గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవనం మల్టీపర్పస్ భవనాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఏ రైతు ఇబ్బంది పడకుండా నిజమైన వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు.కొండలు, గుట్టలు,వెంచర్ లు ఉన్నవారికి రైతు భరోసా కాదన్నారు.గతంలో మాదిరిగా రైతు లు ఇబ్బంది పడకుండా రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలను అందేటట్లు చేస్తామన్నారు.రైతును రాజు చేసే ఈ రైతు భరోసా ను దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి  చేపట్టారన్నారు. కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించాలని రైతులను కోరారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ప్రతిగ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.గ్యారెంటీ లతో పాటు గ్రామంలో పలు భవనాల నిర్మాణాలు,రోడ్ల నిర్మాణాలు చేపట్టి మండలాలను గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు.