భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే పైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్

భువనగిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ దగ్గర హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారి పైన అండర్ పాస్ నిర్మాణం తక్షణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుబాటలో భాగంగా భువనగిరి పట్టణం నుండి పెంచికలపహాడ్, కృష్ణాపురం గ్రామాలతో పాటు మూడు మండలాలు 24 గ్రామాలకు వెల్లెడానికి ఉన్న రోడ్డు జాతీయ రహదారి దాటడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్షణం అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ భువనగిరితో పాటు వలిగొండ, ఆత్మకూరు మండలాలలోని 24 గ్రామాల ప్రజలు అవసరాల కోసం భువనగిరి కి హైదరాబాద్ కు వివిధ గ్రామాలకు వేలాదిమంది రైతులు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు రాకపోకలు ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు. భువనగిరి ఐటిఐ దగ్గర రోడ్డు దాటే సందర్భంలో అండర్ పాస్ లేకపోవడం వల్ల ఇప్పటికి 100 మంది పైగా యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నారని, వందలాదిమంది కాళ్లు చేతులు విరిగి శత గాత్రులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. పాలకులు ఎన్నికలప్పుడు వివిధ సందర్భాలలో ప్రజలను మభ్య పెట్టడం ఓట్లు దండుకోవడం గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రోడ్డు వేసినాడే నేషనల్ హైవే దాటడానికి తమ గ్రామాలకు పోయి రావడానికి ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయవలసిన అవసరం, ఏర్పాటు చేయించే బాధ్యత ఆనాడు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు బాధ్యత తీసుకొని ఈ నేషనల్ హైవే ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, సిపిఎం నాయకులు వడ్డబోయిన వెంకటేష్, గుండెబోయిన దానయ్య, గ్రామ ప్రజలు సిరికొండ కృష్ణ, సిలువేరు రాజు, భువనగిరి నరసింహ, బసాని కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పలు గ్రామాల్లో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పై నిర్వహించిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు.. తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వ్యాపార సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మండలంలోని జగ్గయ్య తండాలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత వాసాలమర్రి గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవనం మల్టీపర్పస్ భవనాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఏ రైతు ఇబ్బంది పడకుండా నిజమైన వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు.కొండలు, గుట్టలు,వెంచర్ లు ఉన్నవారికి రైతు భరోసా కాదన్నారు.గతంలో మాదిరిగా రైతు లు ఇబ్బంది పడకుండా రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలను అందేటట్లు చేస్తామన్నారు.రైతును రాజు చేసే ఈ రైతు భరోసా ను దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి  చేపట్టారన్నారు. కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించాలని రైతులను కోరారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ప్రతిగ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.గ్యారెంటీ లతో పాటు గ్రామంలో పలు భవనాల నిర్మాణాలు,రోడ్ల నిర్మాణాలు చేపట్టి మండలాలను గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు.

హైవే పై గ్రామాలు ఉన్నచోట సర్వీస్ రోడ్డు వేయాలి: సిపిఎం డిమాండ్

భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణ గిరి , ఎల్లమ్మ టెంపుల్ వద్ద హైవే రోడ్డుకు వీరువైపులా సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ఈ రోడ్డు దేవస్థానకు ప్రతిరోజు వచ్చే వేలమంది భక్తులు హైవే మీద వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రాణాలు కొలుపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు...* *ఈరోజు సిపిఎం పోరు యాత్రలో భాగంగా అనంతరం రైల్వే బ్రిడ్జి వద్ద ఆగిపోయిన సర్వీసు రోడ్డును సిపిఎం పట్టణ నాయకులతో కలిసి పరిశీలించారు, హైవే హైవే వెంట గ్రామాల్లో ఉన్న చోట సర్వీస్ రోడ్లు ఉండాలని నిబంధనలు ఉన్న కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేశారు, దీనితో రోడ్డు దాటే సమయంలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి, రోడ్డుకు ఇరువైపులా బ్రిడ్జిని నిర్మించి, సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు , స్వర్ణ గిరి ఎల్లమ్మ టెంపుల్ రోడ్డు దాటడానికి హైవేపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు,బిజెపి కేంద్ర మంత్రులు వెంటనే సందర్శించాలని, నిధులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ , పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు పట్టణ నాయకులు ఎల్లయ్య వల్దాస్ అంజయ్య బాలకృష్ణ లావుడియ రాజు, చింతల శివ ,కొత్త లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులను ఆదుకోవాలి: మందడి రంజిత్ రెడ్డి BJYM వలిగొండ మండల అధ్యక్షుడు

వలిగొండ మండల కేంద్రంలో  భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం వలిగొండ మండల తహసిల్దార్ గారికి నిరుద్యోగులను ఆదుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిరుద్యోగులకు వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించి అందులో మహిళలకు 33% ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని రాష్ట్రప్రభుత్వం వెంటనే చెల్లించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేయడం జరిగింది, గ్రూప్ 2 ,3 పోస్టులను పెంచి వెంటనే పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, వలిగొండ మండల అధ్యక్షులు బోళ్ళ సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు హరీష్ రామకృష్ణ, మండల కార్యదర్శి మైసొల్ల మచ్చగిరి, మందుల నాగరాజు,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెలిమినేటీ వెంకటేష్ ,బర్ల మల్లేశం, వెంకటేశం, దండం మోహన్ రెడ్డి, రేగు శ్రీధర్, కీర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ లో జాతీయ వైద్యుల దినోత్సవం, శుభాకాంక్షలు తెలిపిన 8వ వార్డ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ కు భువనగిరి 8 వ వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్న డాక్టర్లు బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి కొనియాడారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. భువనగిరి రాధాకృష్ణ మూర్తి హాస్పటల్లో డాక్టర్ డే సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన డాక్టర్‌ రాధాకృష్ణ మూర్తి అని అన్నారు. వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు.. పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి అన్నారు రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పేర్కొన్నారు. . ఈ క్రమంలో డాక్టర్లు, ఈఎస్ఐ హాస్పటల్ సూపర్డెంట్ ప్రశాంత్ కుమార్, కర్ణాకర్, రిత్విక్ ,మధు ,రాజు కుమార్ ,సాయి, మహేష్, నర్సులు, స్వప్న ,అశ్విని,అనుష ,శ్రీలత,పల్లవి, భార్గవి, భవాని, ఆయమ్మలు సిబ్బంది పాల్గొన్నారు.



భువనగిరి: ముత్తిరెడ్డిగూడెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రారంభించిన క్రీడా ప్రాంగణంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ వాలీబాల్ ఆడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ముందుగా ఆయనకు గ్రామ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. యువత అంతా సరైన మార్గంలో పయనిస్తూ జీవితంలో మంచి అలవాట్లు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యువతకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి జెడ్పిటిసి బీరు మల్లయ్య స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భువనగిరి : జిల్లా కేంద్రంలో ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, నాయకులు వెంకట రాజయ్య, బోనాల విజయ్, మేకల కృష్ణ, శ్రీహరి ముదిరాజ్, రాములు తదితరులు  పాల్గొన్నారు.
వలిగొండ మండల కేంద్రంలో బాలుర జనరల్ సంక్షేమ వసతి గృహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన SFI

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ గారికి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ,జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ వలిగొండ మండల కేంద్రానికి బాలుల జనరల్ సంక్షేమ వసతి హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు గతంలో వలిగొండ మండల కేంద్రంలో ఎస్సీ,బీసీ హాస్టల్ 10వ తరగతి వరకు ఉన్న ప్రస్తుత ఎత్తివేయడం జరిగింది. మండల కేంద్రానికి పాఠశాల దశ నుండి ఇంటర్మీడియట్ వరకు చాలామంది విద్యార్థులు వస్తా ఉన్నారు. విద్యార్థులు ఉండడానికి హాస్టల్లో లేక కిరాయి ఇండ్లలో ఉండే చదువుల రిత్యా చదువుకోవడం జరుగుతా ఉందన్నారు ప్రభుత్వం వెంటనే వలిగొండ మండల కేంద్రం కి జనరల్ సంక్షేమ హాస్టల్లో మంజూరు చేసి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు జిల్లా సహాయ కార్యదర్శి ఈర్ల రాహుల్ మండల సహాయ కార్యదర్శి వేములకొండ వంశీ,కట్ట వినయ్ పబ్బు ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.


ముస్త్యాల పల్లి గ్రామంలో రోడ్లు మరమ్మత్తులు చేపట్టి, డ్రైనేజీ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

యాదాద్రి భువనగిరి జిల్లా ముస్త్యాల పల్లి గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం వేసిన సిసి రోడ్లు ధ్వంసమై ఎత్తు ఓంపులు ఉండడం వల్ల మురికి నీరు వర్షపు నీరు రోడ్లమీద పారి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణం సీసీ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ఇండ్ల పై నుండి వెళ్లిన విద్యుత్తు లైను తీగలను వెంటనే తొలగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముస్త్యలపల్లిలో గ్రామీణ ప్రజా సమస్యల అధ్యయనం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వార్డులను పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ సర్పంచులు లేకపోవడంతో గ్రామంలోని అభివృద్ధి కుంటుపడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముస్తాలపల్లి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో రైతుల పొలాలకు విద్యుత్ తీగలను ఇండ్లపై నుండి తీసుకుపోవడం వల్ల అనేక ప్రమాదాల గురవుతున్న పరిస్థితి ఉన్నదని ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ఇండ్ల పై నుండి కరెంటు తీగలను తొలగించి ప్రత్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కనే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం ఉండడం వల్ల తరచూ ప్రమాదాలకు ప్రజలు గురవుతున్నారని ఈ మధ్యకాలంలో ఒక రైతు పాడి గేద కరెంటు షాక్ తో చనిపోయి లక్ష రూపాయలకు పైగా నష్టపోయాడని వారికి తక్షణమే నష్టపరిహారం ఇచ్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు మరుగుదొడ్ల లాంటి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాలని, దోమలు పెద్ద ఎత్తున ప్రజల పైన దాడి చేస్తూ వైరల్ జ్వరాలకు కారణం అవుతున్నాయని గ్రామపంచాయతీ నుండి దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి సమస్యల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు మా జీతం నుండి ఖర్చు చేస్తున్నామని చెప్తున్నానని ఇప్పటికైనా ప్రభుత్వము గ్రామంలో ఉన్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో ప్రజలను సమీకరించి గ్రామపంచాయతీ కార్యాలయం దీక్షలు చేపడతామని ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో పర్యటనలు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మీనరసయ్య, నాయకులు ప్రజలు పసునాది దేవయ్య, పసునాది రాజు, పసునాది చంద్రయ్య, గంటపాక రమేష్, పసునాది భాస్కర్, కళ్లెం సాల్ మోహన్, సిర్పంగి కుమార్, గంటపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

పేరుకే పెద్ద ఆసుపత్రి... వసతులు లేవు ...సిబ్బంది లేరు... అరకొర సేవలు: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొరతతో, సౌకర్యల లేమితో, అరకొర సేవలతో పేరుకే పెద్దాసుపత్రి గా ఉందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఆసుపత్రిలోని సౌకర్యాలు, సిబ్బంది, సేవలను పరిశిలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ముఖ్యంగా ఎక్స్ రే డిపార్ట్మెంట్ లో మిషన్ చెడిపోయి సుమారు ఒక సంవత్సరం కావస్తున్నా , దానిని బాగు చేయకుండా, డైరెక్టుగా ఎక్స్ రే తీస్తున్నారని, దీంతో రేడియాజిస్ట్ లకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రతి రోజూ కేవలం 10 నుంచి 15 మంది వరకే ఎక్స్ రే సేవలు అందిస్తున్నారని, కానీ జిల్లా ఆస్పత్రికి రోజుకు సుమారు 40 నుంచి 50 మంది ఎక్స్ రే తీయించుకోవడానికి వస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో మరియు టీ హబ్ లో మరియు ఎమర్జెన్సీ లో మొత్తం కనీసం ఆరుగురు రేడియోలాజికల్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఈ సీ జీ టెక్నీషియన్స్ కనీసం ఇద్దరు ఉండాలి, కానీ ఒక్కరూ కూడా లేరని , రేడియాలజిస్ఠ్ లతోనే ఈ సీ జీ తీయడానికి ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సీ జీ హాల్లో, ఎక్స్ రే హాల్లో తప్పనిసరిగా ఏసీ ఉండాలి కానీ ఏసీ ఉన్నా , అది పని చేయడం లేదని, ప్రస్తుతం పని చేస్తున్న టెక్నీషియన్స్ కి తప్పనిసరిగా టీ ఎల్డీ భ్యాడ్జెస్( రేడియేషన్ నమోదు తెలిపే పరికరం ) ఉండాలి , కానీ ఆసుపత్రిలో వాటి ఊసే లేదు. రోజుకు 24 గంటలు పనిచేసే టెక్నీషియన్స్ ఉపయోగించుకోవడానికి మరుగుదొడ్లు సైతం లేవంటే ఆసుపత్రి పరిస్థితి మనకు అర్థం అవుతుందని ఆయన అన్నారు. అటు ఎమర్జెన్సీ లోనూ, ఇటు టీ హబ్ లోనూ మరియు జిల్లా ఆసుపత్రిలోనూ ఉన్న టెక్నీషియన్స్ తోనే పని చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. వేలాది రూపాయలు ఆసుపత్రి నిర్వహణకు మంజూరైనా, కనీస వసతులు కల్పించకపోవడంలోనూ సిబ్బందిని నియమించడంలోనూ, రోగులకు మెరుగైన వైద్యం అందించడం లోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుటుంబ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లు తక్షణమే స్పందించి, తగిన సిబ్బందిని నియమించాలని, సౌకర్యాలు మెరుగు పరచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.

పనిచేయని పరికరాలు