పేరుకే పెద్ద ఆసుపత్రి... వసతులు లేవు ...సిబ్బంది లేరు... అరకొర సేవలు: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొరతతో, సౌకర్యల లేమితో, అరకొర సేవలతో పేరుకే పెద్దాసుపత్రి గా ఉందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఆసుపత్రిలోని సౌకర్యాలు, సిబ్బంది, సేవలను పరిశిలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ముఖ్యంగా ఎక్స్ రే డిపార్ట్మెంట్ లో మిషన్ చెడిపోయి సుమారు ఒక సంవత్సరం కావస్తున్నా , దానిని బాగు చేయకుండా, డైరెక్టుగా ఎక్స్ రే తీస్తున్నారని, దీంతో రేడియాజిస్ట్ లకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రతి రోజూ కేవలం 10 నుంచి 15 మంది వరకే ఎక్స్ రే సేవలు అందిస్తున్నారని, కానీ జిల్లా ఆస్పత్రికి రోజుకు సుమారు 40 నుంచి 50 మంది ఎక్స్ రే తీయించుకోవడానికి వస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో మరియు టీ హబ్ లో మరియు ఎమర్జెన్సీ లో మొత్తం కనీసం ఆరుగురు రేడియోలాజికల్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఈ సీ జీ టెక్నీషియన్స్ కనీసం ఇద్దరు ఉండాలి, కానీ ఒక్కరూ కూడా లేరని , రేడియాలజిస్ఠ్ లతోనే ఈ సీ జీ తీయడానికి ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సీ జీ హాల్లో, ఎక్స్ రే హాల్లో తప్పనిసరిగా ఏసీ ఉండాలి కానీ ఏసీ ఉన్నా , అది పని చేయడం లేదని, ప్రస్తుతం పని చేస్తున్న టెక్నీషియన్స్ కి తప్పనిసరిగా టీ ఎల్డీ భ్యాడ్జెస్( రేడియేషన్ నమోదు తెలిపే పరికరం ) ఉండాలి , కానీ ఆసుపత్రిలో వాటి ఊసే లేదు. రోజుకు 24 గంటలు పనిచేసే టెక్నీషియన్స్ ఉపయోగించుకోవడానికి మరుగుదొడ్లు సైతం లేవంటే ఆసుపత్రి పరిస్థితి మనకు అర్థం అవుతుందని ఆయన అన్నారు. అటు ఎమర్జెన్సీ లోనూ, ఇటు టీ హబ్ లోనూ మరియు జిల్లా ఆసుపత్రిలోనూ ఉన్న టెక్నీషియన్స్ తోనే పని చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. వేలాది రూపాయలు ఆసుపత్రి నిర్వహణకు మంజూరైనా, కనీస వసతులు కల్పించకపోవడంలోనూ సిబ్బందిని నియమించడంలోనూ, రోగులకు మెరుగైన వైద్యం అందించడం లోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుటుంబ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లు తక్షణమే స్పందించి, తగిన సిబ్బందిని నియమించాలని, సౌకర్యాలు మెరుగు పరచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.
పనిచేయని పరికరాలు
Jul 01 2024, 18:20