జూలై 15న నేతన్న గర్జన జయప్రదం చేయండి; తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపు
*మగ్గం నడవాలి నేతన్న బతకాలి* అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ కోసం , జూలై 7 నుండి 15 వరకు, నేతన్న పోరుయాత్రను జయప్రదం చేయాలని *తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీదర్* పిలుపు నిచ్చారు. శని వారం రోజున వృత్తి సంఘాల కార్యయం భువనగిరి లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి *గంజి మురళీదర్* మాట్లాడుతూ, చేనేతకార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమకు గాని, కార్మికులకు గాని ఉపాధి ,అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో ఉన్న, నూలు సబ్సిడీ, నేతన్న బీమా,చేనేత కు చేయుత, పథకాలను నిలిపి వేసిందని అన్నారు. పనులు లేకఆర్ధిక ఇబ్బందుల్లో, ఇప్పటివరకు 8 మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. సహకార సంఘాల లో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించలేదు. దీనితో వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకు పోతున్నాయని అన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 సంవత్సరాలు అయినా నేటికీ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికుల సంక్షేమానికి 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి అమలు చేయాలని, ప్రతి నేతన్న కుటుంబానికి 5 లక్షల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చే
యాలని కోరారు.
పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని 90 శాతం సబ్సిడీపై పట్టు నూలు పరికరాలు ఇవ్వాలని, వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో నూలు డిపోలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేయించాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత మరియు కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ "మగ్గం నడవాలి నేతన్న బ్రతకాలి" నేతన్న పోరుయాత్ర జులై 7 న సిరిసిల్లలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 ముఖ్యమైన కేంద్రాలు చేనేత మరియు పవర్లూమ్ కేంద్రాల్లో బస్సు యాత్ర జరుగుతుందని జూలై 15న ఇందిరాపార్క్ దగ్గర నేతన్న గర్జన చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, గౌరవ అధ్యక్షలు గోసిక స్వామి, ఉపాధ్యాక్షలు కూరపాటి రాములు, సీనియర్ నాయకులు కోడి బాలనర్సయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు* గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, 9912198591
Jul 01 2024, 17:43