VijayaKumar

Jun 30 2024, 12:30

వలిగొండ: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మండల శాఖ అద్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి సమాజానికి ప్రేరణ కలిగించే అంశాలతో తొలి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ , బీజేపీ మండల నాయకులు డోగుపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్, మందుల నాగరాజు BJYM జిల్లా నాయకులు , మైసోల్ల మత్యగిరి ,రేగురి అమరేందర్ ,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి ,కీర్తి వెంకటేశం, ఆనకంటి శివకుమార్,బర్ల మల్లేశం, గుండ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 29 2024, 17:49

రామానంద తీర్థ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్. ఎన్ విహారి కృష్ణ ట్రైనింగ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ సంస్థ అందిస్తున్న సాంకేతిక శిక్షణా పరిజ్ఞానాన్ని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామానంద తీర్థ ట్రేనింగ్ అధికారి డాక్టర్ ఎన్ విహారి కృష్ణ కోరారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లా లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో స్వామి రామానంద తీర్థ సంస్థలో 15 రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లు నడుస్తున్నాయని ఆయన అన్నారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన యువతీ యువకులు జులై 08 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సుమారు 6 మాసాల పాటు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ మరియు భోజన వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ ముగిసిన వెంటనే ప్లేస్మేంట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులు రూపాయలు 12 వేల నుండి 18 వేల వరకు వేతనం పొందవచ్చని ఆయన అన్నారు . కేంద్ర ప్రభుత్వ ధీన్ దయాల్ ఉద్యోగ్ కౌన్సిల్ యోజన మరియు మేథా చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణలు పొందిన యువతీ యువకులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచు కోవాలని ఆయన సూచించారు. సాయి యాదాద్రి సేవాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు దెబ్బడి అశోక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులను చైతన్యం చేసి, రామానంద తీర్థ ఆద్వర్యంలో ఇస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ పరిజ్ఞానాన్ని విస్తృత పరుస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్ కొడారి వెంకటేష్, రామానంద తీర్థ మీడియా ఇంచార్జీ వై.ఎస్ చక్రవర్తి, ప్లేస్మేంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, యాదాద్రి సేవాశ్రమం డైరెక్టర్లు లింగం, రాజశేఖర్ పాల్గొన్నారు.

VijayaKumar

Jun 29 2024, 17:44

జూలై 15న నేతన్న గర్జన జయప్రదం చేయండి; తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపు

*మగ్గం నడవాలి నేతన్న బతకాలి* అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ కోసం , జూలై 7 నుండి 15 వరకు, నేతన్న పోరుయాత్రను జయప్రదం చేయాలని *తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీదర్* పిలుపు నిచ్చారు. శని వారం రోజున వృత్తి సంఘాల కార్యయం భువనగిరి లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి *గంజి మురళీదర్* మాట్లాడుతూ, చేనేతకార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమకు గాని, కార్మికులకు గాని ఉపాధి ,అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో ఉన్న, నూలు సబ్సిడీ, నేతన్న బీమా,చేనేత కు చేయుత, పథకాలను నిలిపి వేసిందని అన్నారు. పనులు లేకఆర్ధిక ఇబ్బందుల్లో, ఇప్పటివరకు 8 మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. సహకార సంఘాల లో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించలేదు. దీనితో వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకు పోతున్నాయని అన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 సంవత్సరాలు అయినా నేటికీ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికుల సంక్షేమానికి 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి అమలు చేయాలని, ప్రతి నేతన్న కుటుంబానికి 5 లక్షల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చే యాలని కోరారు.

పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని 90 శాతం సబ్సిడీపై పట్టు నూలు పరికరాలు ఇవ్వాలని, వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో నూలు డిపోలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేయించాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత మరియు కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ "మగ్గం నడవాలి నేతన్న బ్రతకాలి" నేతన్న పోరుయాత్ర జులై 7 న సిరిసిల్లలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 ముఖ్యమైన కేంద్రాలు చేనేత మరియు పవర్లూమ్ కేంద్రాల్లో బస్సు యాత్ర జరుగుతుందని జూలై 15న ఇందిరాపార్క్ దగ్గర నేతన్న గర్జన చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, గౌరవ అధ్యక్షలు గోసిక స్వామి, ఉపాధ్యాక్షలు కూరపాటి రాములు, సీనియర్ నాయకులు కోడి బాలనర్సయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు* గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, 9912198591

VijayaKumar

Jun 28 2024, 18:32

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి: ఎర్ర నరేష్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎస్ ఎస్ యూ మండల నాయకులు స్వేరో సర్కిల్ వాలంటరీ ఎర్ర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేయాలని, దాని కోసం చట్టం తేవాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిననందున విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని, మధ్యాహ్నం బోజన పథకం సరిగ్గా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగు నీరు, మూత్ర శాలలు, ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర బిక్షపతి, ఎర్ర శివ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 28 2024, 17:59

భువనగిరి : సూరేపల్లి కి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి: చిరంజీవి ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

భువనగిరి జిల్లా కేంద్రం నుంచి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి బస్ స్టేషన్ కంట్రోలర్ లింగయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు , ప్రయాణికులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత రెండు నెలల నుంచి సూరేపల్లి గ్రామానికి బస్సు రావడం లేదని, ఈనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆటోలలో ఇతర వాహనాల ద్వారా విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వారు స్పందించి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామానికి చెందిన వెంకట నరసింహారెడ్డి , మురళి, ప్రభాకర్, నవీన్ ,మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 28 2024, 16:59

భువనగిరి పట్టణంలో 8వ వార్డులో నీటి వసతి కల్పించిన కౌన్సిలర్ పంగరెక్క స్వామి

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి థియేటర్ నందగుట్ట దగ్గర 8వ వార్డు లో పనిచేయని బోరు ను వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి దగ్గరుండి కొత్త మోటార్ వేపించి ప్రజలకు నీరు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా ఉండకూడదని వేరే మోటార్ వేయించమని తెలియజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శంకరయ్య పాపయ్య కృష్ణ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 28 2024, 16:38

భువనగిరి: జూలై 1 నుంచి అమలయ్యే కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని భువనగిరి బార్ అసోసియేషన్ ముందు నిరసన

ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నూతనంగా వచ్చే క్రిమినల్ మేజర్ చట్టాల ద్వారా హక్కులను కోల్పోతున్నామని జులై 1 నుండి అమలయే నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని భారశిక్ష అధ్యక్షులు బబ్బురి హరినాథ్ ఐలు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డిలు డిమాండ్ చేశారు భువనగిరి బార్ అసోసియేషన్ ముందు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలు న్యాయ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వెంటనే అమలు చేయ తలపెట్టిన నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు అన్ని బార్ అసోసియేషన్లలో,జడ్జీలతో, ప్రజలతో, విస్తృతంగా చర్చ జరపాలని వారు అన్నారు అలాగే రేపు 29-06-24 రోజున బార్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులకు న్యాయవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు *ఈ కార్యక్రమంలో గజ్జల రవీందర్ రెడ్డి, గోదా వెంకటేశ్వర్లు, బొబ్బల కేశవరెడ్డి,బొల్లెపల్లి కుమార్ ఐలు జిల్లా సహాయ కార్యదర్శి బొమ్మ వెంకటేష్ సురకంటి జంగారెడ్డి జి లింగం సురేష్ చింతల రాజుతదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 28 2024, 12:58

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా మారగోని

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు,గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డికి, నియామకానికి సహకరించిన సౌత్ ఇండియా చైర్మన్ రావులపల్లి తిరుపతయ్య, తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇటికాల మాధవి, ఎండి. సమిమ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడుతానని తెలిపారు.

VijayaKumar

Jun 27 2024, 19:49

వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర పై PD , యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ..తన వ్యక్తిగత అవసరాల కోసం స్థానిక కాంట్రాక్టర్ లను, ప్రభుత్వ ఉద్యోగులను , మహిళల ను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ బెదిరింపులకు SC /ST కేసులు పెడితనని బెదిరింపులకు పాల్పడుతున్న వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేందర్ (43 ) అనే వ్యక్తి పై ప్రివెంటివ్ డిటెన్షన్ ( PD) యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు పాల్పడుతూ వారి వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ SC /ST కేసులు పెడుతనాని బెదిరింపులకు పాల్పడుతూ , మహిళలను మానసికంగా, శారీరకంగా బెదిరిపింపులకు పాల్పడుతున్నడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి పై కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించించిన పోలీసులు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నిందితునిపై PD నెంబర్ 6/PD -Cell / RCKD/2024 యాక్ట్ వలిగొండ మండలం వేముల కొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి పై PD చట్టాన్ని ప్రయోగించిన రాచకొండ పోలీసులు... * *నిందితున్ని నల్గొండ సబ్ జైల్ నుండి చర్లపల్లి జైల్ కు తరలించిన రాచకొండ పోలీసులు పోలీసులు.

VijayaKumar

Jun 27 2024, 17:57

వలిగొండ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి వేముల నాగరాజు SFI జిల్లా ఉపాధ్యక్షులు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ వినతిపత్రం వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలన్నారు ఒక పాఠశాలలో ఒక రేటుగా అంగట్లో సరుకుల ఏ స్కూలుకు తోసిన ఫీజు ఆ స్కూలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు వెంటనే ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేసి పేద మధ్య తరగతి తల్లిదండ్రులని ఆదుకోవాలని అన్నారు మరియు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్లో ద్వారా ఫీజు నిర్ణయాలు చేయాలన్నారు పాఠశాల యజమాన్యం వాళ్ళు ఇష్టానుసారమైన ఫీజులు నిర్వహించడం తల్లిదండ్రులు కట్టడం కాకుండా పేరెంట్స్ మీటింగ్లో వారు కట్టే స్తోమత తగిన ఫీజులు నిర్ణయం చేయాలన్నారు అదేవిధంగా మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలుగా పుస్తకాల పేరుతో స్టేషనరీ వ్యాపారం నడిపిస్తున్నారన్నారు ప్రభుత్వ మాత్రం చోద్యం చూస్తున్నట్టు విహరిస్తామన్నారు అని వారు విమర్శించారు మండల విద్యాధికారి వెంటనే అన్ని పాఠశాలలు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్ముతున్న పాఠశాలను సీజ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ ఏసోఫ్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.