ఆదర్శమూర్తి, అసాధారణ ప్రతిభాశాలి హెల్లెన్ కెల్లర్; ధరణికోట నరసింహ VHPS జిల్లా అధ్యక్షులు
చిన్న తనం నుంచే మూడు రకాల వైకల్యాలను జయించి, అసాధారణ ప్రతిభను కనబర్చిన హెల్లన్ కెల్లర్ జీవితం మనకు ఆదర్శం కావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులధరణికోట నర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో జరిగిన "హెల్లన్ కెల్లర్" 144 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్లన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు,మూగ, అంధత్వం కల్గి ఉన్నా, అధైర్య పడకుండా ఆమె వికలాంగుల, మహిళల హక్కుల కోసం కృషి చేసారని ఆయన అన్నారు. హెల్లన్ కెల్లర్ రచయితగా, సంఘసంస్కర్త గా చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జాగిళ్ళపురం అయిలయ్య, నాయకులు వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.
Jun 28 2024, 16:59