VijayaKumar

Jun 27 2024, 14:13

చౌళ్ళ రామారం లో కల్వర్టు, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమిటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామంలో జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం & స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల నుండి కల్వర్టు మరియు సిసి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, అడ్డ గూడూరు జడ్పిటిసి శ్రీమతి శ్రీరాముల జ్యోతి అయోధ్య , ఎంపీపీ శ్రీ దర్శనాల అంజయ్య , BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 20:07

భువనగిరి పట్టణంలో ఎనిమిదో వార్డులో శానిటేషన్ పనులు పరిశీలించిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో కౌన్సిలర్ పంగరెక్క స్వామి బుధవారం శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డులో  గల డ్రైనేజీ కాలువల చుట్టూ ఉన్న చెత్తని మున్సిపల్ సిబ్బంది తో తీయించారు. వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారం శుభ్రం చేయించారు. వర్షాకాలంలో సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



.

VijayaKumar

Jun 26 2024, 19:44

వలిగొండ: పాఠశాలల బంద్ విజయవంతం: ABVP

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వలిగొండ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ 1,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించాలని, 2,ప్రవేట్,కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా ఎక్కువ మొత్తంలో ఫిజులు వసూలు చేస్తున్న యజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, 3, ఫిజుల నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని, 4,ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, 5,నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేట్ పాఠశాలలో బుక్స్,యూనిఫామ్స్,అమ్ముతున్న యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, 6,ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా,వెంటనే DEO,MEO అధికారులను నియమించాలని, 7,ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, 8,వెంటనే మెగా డిఎస్సి ద్వారా 24వేల పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సతీష్,మహేందర్,సన్నీ,చరణ్ శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 18:25

వలిగొండ: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని డ్రగ్స్ పై ప్రజలకి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్,జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, వలిగొండ ఎస్సై మహేందర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 17:34

భువనగిరి : జిల్లాలో యదేచ్చగా ప్రైవేట్ విద్యాసంస్థలలో పుస్తకాల అమ్మకం...పట్టించుకోని యాదాద్రి భువనగిరి డి ఈ ఓ

వలిగొండ పవిత్రాత్మ ప్రవేట్ స్కూలుకు సంబంధించిన పుస్తకాలు ఏదేచ్ఛగా అమ్ముతుంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు SC,ST, BC విద్యార్థి సంఘం నాయకులు పుస్తకాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోన్ చేసి చెప్పిన మాకు సంబంధం లేదు అని చెప్పిన యాదాద్రి DEO నారాయణరెడ్డి MEO శ్రీధర్ జిల్లాలో పూర్తిగా విఫలం అయిపోయిన విద్యావ్యవస్థ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది పిల్లల ప్రాణాలతో చెలగాటలాడుతున్న DEO నారాయణరెడ్డి పుస్తకాలు పట్టుకొని రూములు చూపించిన పట్టించుకోని DEO అది పొంగ మాకు సంబంధం లేదు అని బెదిరిస్తున్న డీఈఓ నారాయణరెడ్డి జిల్లాలో విద్యా వ్యవస్థ అసమర్ధత వల్ల ప్రైవేటు స్కూలు ఇష్టానుసారంగా బస్ ఫీజ్ అని బుక్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ యూనిఫామ్ ఫీజ్ అని విద్యార్థుల రక్తం తాగుతున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా నిద్రపోయిన యాదాద్రి జిల్లా విద్యా వ్యవస్థ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాల వ్యవధిలో 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉన్నది ప్రవేట్ విద్యాసంస్థలకు కొమ్ముగాస్తున్న యాదాద్రి జిల్లా విద్యావ్యవస్థ *ప్రభుత్వం మీద తిరగబడాలని DEO దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదు గవర్నమెంట్ ను బదనం చేయాలని చూస్తున్న యాదాద్రి DEO* మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి అధికారి వ్యవస్థను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థి తల్లిదండ్రులు SC,ST,BC సంఘాలు *ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సల్ల మనీల్, లింగస్వామి, సరిత, మహేందర్, భాస్కర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 11:35

వలిగొండ మండల కేంద్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో వలిగొండ పట్టణ కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలు తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి, మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని వివరించి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రజలు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే సమాజం తిరోగమనంలో పయనిస్తుందని అన్నారు. సామాజిక ,మానసిక, శారీరిక అనారోగ్యాలు తలెత్తుతాయని అన్నారు.

VijayaKumar

Jun 26 2024, 11:03

సామాజిక కార్యకర్తకి డాక్టరేట్ ప్రధానం: ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ సంస్థ నుండి డాక్టరేట్ పొందిన డాక్టర్. ముప్పిడి రవి

నార్కట్ పల్లి మండల ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి రవి పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ సృస్తికర్త అయినటువంటి డాక్టర్ కృష్ణంరాజు గారితో పనిచేస్తూ మన తెలంగాణాలో పలు జిల్లాలలో రక్తం అవసరం ఉన్నవారికి కొన్ని వందల మందికి రక్త ధాతలని పంపించి అవసరం తీర్చి సోషల్ వర్కర్ గా గుర్తింపు పొంది అనేక రకాల సేవ కార్యక్రమాలలో పాల్గొని ముందుండి నడిపిస్తూ సేవ చేస్తుండేవారు. వారు చేసే సేవలకు ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్ ( IPAC ) వారు విడుదల చేసిన డాక్టరేట్ డిగ్రీ కి నామినేషన్ లో ఎంపికైయ్యారు. ఈ అవార్డు ను ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ గారిచే సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఢిల్లీ లో గౌరవ డాక్టరెట్ ని అందుకోనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

VijayaKumar

Jun 25 2024, 17:40

వలిగొండ : లోతుకుంట మోడల్ స్కూలుకు పూర్తిస్థాయి వార్డెన్ ను నియమించాలి: AISF, AIYF

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని లోతుకుంట మోడల్ స్కూల్ ను ఏ ఐ ఎస్ ఎఫ్ మరియు ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం  పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ పలు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్* సంయుక్తంగా మాట్లాడుతూ మోడల్ కాలేజీలో రెగ్యులర్ వార్డెన్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా హాస్టల్లో కనీస వసతులు ఫ్యాన్లు లైట్స్ టాప్స్ పని చేయక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే పూర్తిస్థాయి వార్డెన్ నియమించాలని వారు డిమాండ్ చేశారు పూర్తిస్థాయి వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం భోజనం కూడా సరిగా ఉండకుండా భోజన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు డైట్ చార్జీలు ఒక విద్యార్థికి ఒక రోజుకు 33 రూపాయలు కేటాయించడంతో 33 రూపాయలతో నాణ్యమైన భోజనం అందడం లేదని కనీసం ఒక్కో విద్యార్థికి 65 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు 7 మండలాలకు ఒకరే ఎంఈఓ ఉండడం వలన విద్యాశాఖ నిర్లక్ష్యం కనబడుతుందని అన్నారు మోడల్ స్కూల్ కు క్రొత్తగా వేసిన సి సి రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకుండా పిఆర్ఏఈ సుగుణాకర్ రావు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులుబూడిద సాయి చరణ్, ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 25 2024, 06:41

గోపరాజుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మాట తప్పకుండా అమలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసే విధంగా పని చేస్తుందని, రైతుల శ్రేయస్సు కోరే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల లింగయ్య , సలిగంజి భిక్షపతి, నరసింహా, యూత్ అద్యక్షులు సంగిశెట్టి రమేష్, దొండ లింగయ్య, ఏనుగుల సత్తయ్య,. పాలకుర్ల యాదయ్య,శ్రీనివాస్, పొలబోయిన రాములు, గాజుల శ్రీనివాస్, సలిగంజి పృధ్వీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 24 2024, 19:39

లోతుకుంట మోడల్ స్కూల్ లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని లోతుకుంట ప్రభుత్వ మోడల్ స్కూల్ లో సోమవారం రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు వలిగొండ ఎస్సై డి మహేందర్ విద్యార్థులకు డ్రగ్స్ ,సైబర్ నేరాలపై అవగాహన. కల్పించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ , డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ సైబర్ నేరాల పై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దని , డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు .చిన్ననాటి నుంచి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలన్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు బానిస కావద్దన్నారు. సైబర్ నేరాలపట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ , టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.