గోపరాజుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మాట తప్పకుండా అమలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసే విధంగా పని చేస్తుందని, రైతుల శ్రేయస్సు కోరే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల లింగయ్య , సలిగంజి భిక్షపతి, నరసింహా, యూత్ అద్యక్షులు సంగిశెట్టి రమేష్, దొండ లింగయ్య, ఏనుగుల సత్తయ్య,. పాలకుర్ల యాదయ్య,శ్రీనివాస్, పొలబోయిన రాములు, గాజుల శ్రీనివాస్, సలిగంజి పృధ్వీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

లోతుకుంట మోడల్ స్కూల్ లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని లోతుకుంట ప్రభుత్వ మోడల్ స్కూల్ లో సోమవారం రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు వలిగొండ ఎస్సై డి మహేందర్ విద్యార్థులకు డ్రగ్స్ ,సైబర్ నేరాలపై అవగాహన. కల్పించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ , డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ సైబర్ నేరాల పై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దని , డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు .చిన్ననాటి నుంచి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలన్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు బానిస కావద్దన్నారు. సైబర్ నేరాలపట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ , టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి: కొడారి వెంకటేష్ ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం "జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ" ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే ను కోరారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం జిల్లా లోని విద్యాశాఖాధికారి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు, మరియు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో "జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ" ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

హనుమపురం ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు మెమోరండం అందజేసిన సిపిఐ నేతలు

భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 28 లో పేదలకు పట్టాలు ఇవ్వాలని సోమవారం  ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని లబ్ధిదారులతో కలిసి మెమోరండం ఇవ్వడం జరిగింది హనుమాపురం గ్రామంలో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని తేదీ 23/6/2024 ఆదివారం రోజున హనుమాపురం గ్రామంలో నిరసన ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ దాదాపు 5 మాసాల నుండి లబ్ధిదారులు ప్రయత్నం చేసినప్పటికీని ప్రభుత్వం స్పందించడం లేదు వెంటనే గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసిన వారిలో సిపిఐ నాయకులు ఎల్లంకి మహేష్ హన్మాపురం గ్రామ గుడిసెల సంఘం నాయకులు నాగపురి యాదగిరి రామగోని ప్రవీణ్ కుమార్ కోర సామేలు కిల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఏషాల అశోక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులకు నిధులు కోరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

హైదరాబాదులో సోమవారం  ఉదయం 10:00గం.లకు రాష్ట్ర రెవెన్యు మరియు గ్రుహ నిర్మాణ శాఖా మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని భువనగిరి నియేజకవర్గంలోని సింగన్నగూడెం,హుస్సేనాబాద్,కొండమడుగు,బీబినగర్,రేవణవల్లి,జిబ్లాక్ పల్లి నందుగల అసంపూర్తిగా వున్న 641 డబుల్ బెడ్రూం ఇండ్లకు పెండిగ్ లో వున్న పనులను పూర్తి చేయుటకు 4.62కోట్ల నిదులను మంజూరు చేయాలని కోరిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి . అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

వంట కార్మికులకు గౌరవ వేతనం 10వేలు వెంటనే ఇవ్వాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

భువనగిరి జిల్లా మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి *జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబా గారికి మరియు జిల్లా ఉద్యాశాఖధికారి నారాయణ రెడ్డి గార్లకు వేరు వేరుగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.* ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని దానిని వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని, కార్మికులను తొలగించరాదని, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, వయసు పై బడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అదేవిధంగా స్లాబ్ రేటు పెంచుతూ నిత్యవసర వస్తువులన్నిటిని కూడా సరఫరా చేస్తూ పిల్లలకు పౌష్టికాహారం కింద కోడి గుడ్డను కూడా సరఫరా చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సంధ్య, నిర్మల, పద్మ, లక్ష్మీ, అనసూర్య, వాణి, అండాలు, కృష్ణవేణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  మండలంలోని నాగారం గ్రామానికి చెందిన ఆలకుంట్ల గణేష్ కూతురు వినీషా ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ప్రభుత్వం నుండి మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ ఓ సి చెక్కును భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో ఆదివారం బాధిత కుటుంబ సబ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తీగల కిష్టయ్య,బెలిదెనాగేశ్వర్, గొళ్ల యాదయ్య, జిట్ట సత్తయ్య, బర్ల నర్సింహా,బర్ల జగదీశ్వర్,జిట్ట స్వామి,ఏగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 % రిజర్వేషన్లు ఇవ్వాలి; పల్లగొర్ల మోది రాందేవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

వలిగొండ బీసీ ఆఫీసులో వివిధ బీసీ కుల,సంఘాలతో కలిసి సమావేశం నిర్వహించారు .బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్లు ఇవ్వక పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుద్దన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూడటం అత్యంత దుర్మార్గం అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పినందుకే..కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో బీసీలను మోసం చేసినందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి బీసీలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారని, అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కులగణన విధివిధానాల కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఏది ఏమైనా..కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేలా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా కుల సంఘాలన్నీ ఏకతాటి మీదిగా ఉండి పని చేయాలన్నారు *ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్,మనీల్,గొలుసుల మధు,వెంకట్ గౌడ్,సురేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలిదాన్ దివస్

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు “ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా” అంటూ సమైక్య భారతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన భరతమాత ముద్దుబిడ్డ,జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ_శ్యామ్_ప్రసాద్_ముఖర్జీ గారి బలిదాన్ దివస్, వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్,బీజేపీ మండల కార్యదర్శి మందుల నాగరాజు ,పిట్టల రాజు ,bjym అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, BJYM మండల ఉపాధ్యక్షులు అమనగంటి శివ,కీర్తి వెంకటేశం, రెగూ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ముద్దాపురం గ్రామంలో వ్యక్తి అదృశ్యం... కేసు నమోదు...

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామానికి చెందిన సామ చంద్రా రెడ్డి వయసు 30 సంవత్సరాలు, ఈనెల 17 న సాయంత్రం ఐదు గంటలకి ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. సోదరుడు సామ నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.