వలిగొండ : SFI పోరాట ఫలితంగా పర్మిషన్ లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తు పాఠశాల ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను మూసివేయలని ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు లు మాట్లాడుతూ శ్రీ చైతన్య పేరు చెప్పి అమాయక తల్లిదండ్రులను మోసం చేసి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని,అడ్మిషన్ల కోసం బస్సులను అదేవిధంగా వాల్ రైటింగ్స్ రాస్తున్నారన్నారు, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత 20 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారీ* *(DEO)గారికి , ,అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి( MEO)గారి దృష్టికి తీసుకువెళ్లి, వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు,
విద్య అనేది అంగట్లో సరుకుగా మార్చి విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల ఫీజులు తీసుకోవాలని చూస్తున్నారన్నారు,దీనిపై వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేయగా మండల విద్యాధికారి ఎంఈఓ గారు స్పందించి శ్రీచైతన్య స్కూలుకు వచ్చి పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమని పర్మిషన్ లేని పాఠశాలలు నడిపితే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి విద్యాసంస్థలను పర్మిషన్ ఇవ్వకుండా చూడాల్సిందిగా, అదేవిధంగా ఇలాంటి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారన్నారు,విద్యను వ్యాపారంగా చేసుకోవాలని చూస్తున్న ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల అధ్యక్షులు ఎండి,ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసొల్ల,నరేందర్ దుబ్బ,శివ,సాయి,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
Jun 21 2024, 18:25