భువనగిరి: పుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా,విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం లో ప్రతి ఏటా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను శుక్రవారం భువనగిరి పట్టణములో రాంనగర్ ప్రైమరీ పాఠశాలలోమున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు 8 వ వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌ ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధను అందించాలని సూచించారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: భువనగిరి టౌన్ లో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు భువనగిరి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు DEO నారాయణరెడ్డి గారికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే MEO నాగేశ్వర్ రెడ్డి గారిని పంపి శ్రీ చైతన్య స్కూల్ కు సీల్ విధించడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు . ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు *గుండెబోయిన సురేష్, బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ , ఉమ్మడి జిల్లా bc యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం ,మహేందర్ గౌడ్,వనిత,దర్శన్ ముదిరాజ్,వెంకట్ ప్రజాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట : ఇంద్రపాలనగరం చెరువులో గుర్తుతెలియని మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని చెరువు లో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గత మూడు రోజుల క్రితం గ్రామంలో తిరిగాడని, మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిపారు. మృతదేహం నీటిలో తెలియాడుతూ శుక్రవారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం* *వలిగొండ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు యోగ దినోత్సవం సందర్బంగా యోగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నకిరేకంటి మొగులయ్య, అసెంబ్లీ కోకన్వీనర్ రాచకొండ కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు గంగాదారి దయాకర్, మండల కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, బూత్ అద్యక్షులు పిట్టల రాజు, మండల యువ మోర్చాప్రధాన కార్యదర్శి ఆమనగంటి శివ,ఎర్రబోలు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు


వలిగొండ మల్లెపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి: CPM

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  - మల్లేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి మురికి నీరు కారణంగా పాడైపోయిన బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి... సిపిఎం డిమాండ్ వలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేపల్లి అండర్ గ్రౌండ్ పాడైపోయి రోడ్డుపై మురికినీరు ప్రవహించడం కారణంగా పాడైపోయిన బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు ఈరోజు మల్లేపల్లి గ్రామంలో మురికి నీరుపారడంతో పాడైపోయిన బీటీ రోడ్డుపై సిపిఎం వలిగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెలువర్తి,మొగిలిపాక,కెర్చిపల్లి గ్రామాల ప్రజలు నిత్యం వలిగొండ మండల కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చిపోతు ఈ రోడ్డుపై మురికి నీరు పారుతుండటంతో గుంతలుపడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే అనేకమంది ప్రయాణికులు ఈ గుంతల్లో పడి గాయాల పాలైనరని అన్నారు సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెంటనే పాడైపోయిన అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టి రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు కారణంగా పాడై గుంతలుపడిన బీటీరోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, సిపిఎం పట్టణ నాయకులు వేముల లక్ష్మయ్య,కొండూరు సత్తయ్య,ఎండి షాహిద్, గ్రామ ప్రజలు పల్లెర్ల లక్ష్మయ్య,భిక్షపతి, నరసింహ,తదితరులు పాల్గొన్నారు
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్కస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా:పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మాత్రలు అందజేయనున్నారని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేశారు** ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ కార్యక్రమంలో ఎ.యన్ .యం.ఇంద్ర ప్రేమలత, శోభ , శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయులుయాదయ్య , సంతోష,గంజ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు , రాంనగర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

చౌటుప్పల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు ఆయన చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను సమీక్షిస్తూ... ధరణి మోడ్యూల్ సంబంధించి ఫౌతి కేసులు, కోర్టు కేసు ఇంటిమేషన్లు, మ్యుటేషన్లు తదితర ధరణి దరఖాస్తులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా వెంటనే పరిష్కరించాలని సూచించారు. వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి వి.శేఖర్ రెడ్డి, తహసిల్దార్ హరికృష్ణ, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.
వలిగొండ : SFI పోరాట ఫలితంగా పర్మిషన్ లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ పట్టణంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తు పాఠశాల ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను మూసివేయలని ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు లు మాట్లాడుతూ శ్రీ చైతన్య పేరు చెప్పి అమాయక తల్లిదండ్రులను మోసం చేసి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని,అడ్మిషన్ల కోసం బస్సులను అదేవిధంగా వాల్ రైటింగ్స్ రాస్తున్నారన్నారు, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత 20 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారీ* *(DEO)గారికి , ,అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి( MEO)గారి దృష్టికి తీసుకువెళ్లి, వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు, విద్య అనేది అంగట్లో సరుకుగా మార్చి విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల ఫీజులు తీసుకోవాలని చూస్తున్నారన్నారు,దీనిపై వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేయగా మండల విద్యాధికారి ఎంఈఓ గారు స్పందించి శ్రీచైతన్య స్కూలుకు వచ్చి పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమని పర్మిషన్ లేని పాఠశాలలు నడిపితే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి విద్యాసంస్థలను పర్మిషన్ ఇవ్వకుండా చూడాల్సిందిగా, అదేవిధంగా ఇలాంటి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారన్నారు,విద్యను వ్యాపారంగా చేసుకోవాలని చూస్తున్న ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల అధ్యక్షులు ఎండి,ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసొల్ల,నరేందర్ దుబ్బ,శివ,సాయి,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: గీత కార్మికులకు సేఫ్టీ మోకులు వెంటనే అందించాలి: చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు గౌడ్

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ సమావేశం పాండాల మైసయ్య అధ్యక్షతన వృత్తిదారులభవన్ బుదవారం రోజున భువనగిరిలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ ,మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికులకు అనేక ఏళ్లుగా వృత్తి చేస్తూ ,ప్రమాదాలకు లోనై ఏటా వందలాది మంది చనిపోతున్నారని ,వాటిని నివారించడానికి ప్రభుత్వం సేఫ్టీ మోకులు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని ,వెంటనే గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికులను రక్షించాలని డిమాండ్ చేశారు . గత రెండు సంవత్సరాలుగా తాటి చెట్ల పైనుండి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన, గీత కార్మికులకు. రావలసిన ఎక్స్ గ్రేషియా , మరియు గీతా కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన తాత్కాలిక పరిహారము ,వెంటనే అందించాలని భువనగిరి మండలంలో మంది చనిపోయిన. 12మంది మరియు ఎనిమిది మంది శాశ్వత వికలాంగులైన వారు ,తాత్కాలిక పరిహారము అందించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు ,ప్రభుత్వము వృత్తి పింఛన్లను ఇవ్వడంలో గత రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని. 50 సంవత్సరాలు నిండిన వృత్తి పింఛన్లకు అర్హులైన గీతా కార్మికులు రెండు సంవత్సరాలు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకొని కనులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని వెంటనే గీతా కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ప్రకటించిన విధంగా ,పెంచి తక్షణమే రెగ్యులర్ గా పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూతనంగా గ్రామాలలో గీత వృత్తిలో పనిచేస్తున్న వారికి ,కొత్త సభ్యత్వము గుర్తింపు కార్డులు, ఇవ్వాలని ఎన్నికల కోడ్ పేరుతో ఆపివేసిన ,గీతా కార్మికులకు నూతన సభ్యత్వాలనే తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . గత ప్రభుత్వము గీతా కార్మికులకు ఇస్తానన్న ఉచిత బైక్ లను ప్రతి గీత కార్మిక కుటుంబానికి అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జూలై,ఆగస్టు . మాసాలలో అమరుల యాది లో కల్లుగీత కార్మిక ఉద్యమంలో, వృత్తి రక్షణ సంక్షేమం కొరకు హక్కుల కొరకు పోరాడిన, మహనీయులు.. బొమ్మగానిధర్మభిక్షం, తొట్లమల్సూరు,, బైరుమల్లయ్య, సూదగాని యెట్టయ్య, లాంటి అనేకమంది అమరవీరులని ,సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ గ్రామ గ్రామాన కల్లుగీత కార్మిక ఉద్యమంలో అమరులైన మహనీయులని, జ్ఞాపకం చేసుకుంటూ సభలు నిర్వహించనున్నామని వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాండాల మైసయ్య, మట్ట బాలరాజు, రంగా కొండల్, గడ్డమీది సోములు, కొండ అశోక్, మచ్చ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ భువనగిరి ఆలేరు, చౌటుప్పల్ మూడు డివిజన్ల సభ్యుల ఏకాభిప్రాయంతో మంగళవారం ఎన్నుకున్నారు జిల్లా కమిటీ కన్వీనర్ గా మేకల యాదగిరి

కో కన్వీనర్ అల్లి మహేష్ ను ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులుగా కోమల్ల స్వామి ,వలిగొండ

ఉపాధ్యక్షులుగా  పర్ష బంగారయ్య ,ఆలేరు

కార్యదర్శి కూరపాక కరుణాకర్

సహాయ కార్యదర్శి బల్లం అశోక్

ప్రధాన కార్యదర్శి ఆడేపు బిక్షపతి

కోశాధికారి యూసుఫ్

నెంబర్లు : కనుక స్వామి, భీమిని నరసింహ, బండారి నర్సింగరావు, నూనె హనుమంతు, వల్లాల బాలమని ,బంగారు ఎల్లమ్మ, మరాఠీ లక్ష్మీనరసింహ, శీను ,పత్తి ఆదిలక్ష్మి, మూల వెంకటయ్య, పిట్టల సత్యనారాయణ, కానుల బాలమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

.