యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ భువనగిరి ఆలేరు, చౌటుప్పల్ మూడు డివిజన్ల సభ్యుల ఏకాభిప్రాయంతో మంగళవారం ఎన్నుకున్నారు జిల్లా కమిటీ కన్వీనర్ గా మేకల యాదగిరి
కో కన్వీనర్ అల్లి మహేష్ ను ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా కోమల్ల స్వామి ,వలిగొండ
ఉపాధ్యక్షులుగా పర్ష బంగారయ్య ,ఆలేరు
కార్యదర్శి కూరపాక కరుణాకర్
సహాయ కార్యదర్శి బల్లం అశోక్
ప్రధాన కార్యదర్శి ఆడేపు బిక్షపతి
కోశాధికారి యూసుఫ్
నెంబర్లు : కనుక స్వామి, భీమిని నరసింహ, బండారి నర్సింగరావు, నూనె హనుమంతు, వల్లాల బాలమని ,బంగారు ఎల్లమ్మ, మరాఠీ లక్ష్మీనరసింహ, శీను ,పత్తి ఆదిలక్ష్మి, మూల వెంకటయ్య, పిట్టల సత్యనారాయణ, కానుల బాలమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
.


.
ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్, పట్టణ ఉపాధ్యక్షులు కార్తీక్, ఎండి. అసద్, అబ్దుల్, కౌశిక్, సద్దామ్, జలీల్,ఫిరోజ్, ప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు.
జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సందెలు శ్రీనివాస్ మాదిగ యాకర్ నరసింహారావు మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బాల నరసింహ మాదిగ జాంగిర్ మాదిగ పాముకుంట్ల బసవయ్య మాదిగ మాజీ సర్పంచ్ బిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కొ) దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో జరిగింది. ఈ సమావేశంలో క్యాట్కో రాష్ట్ర కమిటీ నాయకులు వేముల గౌరీ శంకర్ రావు, శంకర్ లాల్ చౌరాసియా, ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రంలో రైతు వినియోగదారుల సంఘాలు, మహిళా వినియోగదారుల సంఘాలు, పిల్లల, వృద్ధుల, మరియు వికలాంగుల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లలో చైతన్యం తీసుకువచ్చి గ్రామస్థాయిలో వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంస్థ ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా ఆగష్టు 10,11-2024 రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు "ఆహ్వాన కమిటీ సభ్యులను" ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దశాబ్ది ఉత్సవాల ముఖ్య భాద్యతలు రాష్ట్ర ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు అప్పగించారు. ప్రతి ఒక్క వినియోగదారుల సంఘం బాధ్యులు నూతన వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కృషిచేయాలని సూచించారు. ఆగస్టు 10,11 న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంపత్ కుమార్(రంగారెడ్డి ), ఎస్ రమేష్ బాబు(మేడ్చల్), సిహెచ్ గురవయ్య (నల్లగొండ), పి సోమయ్య(యాదాద్రి భువనగిరి), షేక్ సైదా, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు( సూర్యాపేట), ఏ మట్టయ్య ,ఎండి ముస్తాఫా, ఎండి నజీర్ పాష, కట్ట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
హన్మాపురం నుండి అనంతరం, తాజ్ పూర్ గ్రామాల వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం హన్మాపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ హన్మాపూర్ మీదుగా అనంతరం నుండి బీబీనగర్, తాజ్ పూర్ నుండి బొమ్మలరామారం వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మధ్యకాలంలో గెలిచిన స్థానిక శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ తక్షణము స్పందించి రోడ్డును పరిశీలన చేసి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరోమారు బీటీ రోడ్డును వేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. 15 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మూడు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్, సిపిఎం నాయకులు గ్రామ ప్రజలు తోటకూరి నాగరాజు, తోటకూరి గణేష్, కుసుమ మధు, పైళ్ల సత్తిరెడ్డి, ముద్దం చంద్రయ్య, కమ్మ బాలయ్య, శీను, అరిగే సంజీవ, సోమ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Jun 19 2024, 17:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k